Homeక్రీడలుక్రికెట్‌IPL 2026 Mumbai Indians: ముంబైకి ఈసారి ఆ భయం లేదు.. అలా ఆడితే...

IPL 2026 Mumbai Indians: ముంబైకి ఈసారి ఆ భయం లేదు.. అలా ఆడితే ఖాతాలో ఆరో ట్రోఫీ

IPL 2026 Mumbai Indians: ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ముంబైకి ప్రథమ స్థానం ఉంటుంది. ముంబై జట్టు ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీలు అందుకుంది. అదిరిపోయే రికార్డుతో మిగతా జట్ల కంటే ముందు వరుసలో ఉంది. గత మూడు సీజన్లుగా ముంబై జట్టుకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నాడు. ఈసారి అతని నాయకత్వంలో ముంబై విజేత అవుతుందా.. ఐపీఎల్ ట్రోఫీని అందుకొని సరికొత్త చరిత్ర సృష్టిస్తుందా.. ఈ ప్రశ్నలకు మరి కొద్ది రోజుల్లో సమాధానం లభించే అవకాశం ఉంది.

Also Read: ఇజ్రాయెల్‌లో వేలాది కాకులకు ఏమైంది.. ఎందుకిలా ప్రవర్తిస్తున్నాయి? వినాశనమేనా?

ఐపీఎల్ లో ఐదుసార్లు ట్రోఫీలు అందుకోని రికార్డు సృష్టించింది ముంబై జట్టు. గత ఏడాదితో పోల్చి చూస్తే జట్టులో కొంతవరకు మార్పులు జరిగాయి. బౌలింగ్.. బ్యాటింగ్.. ఫీల్డింగ్ విభాగాలలో ముంబై జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. డికాక్ ను కోటి రూపాయలకు కొనుగోలు చేసి.. బ్యాటింగ్ బలాన్ని పెంచుకుంది.. అంతేకాదు మయాంక్ రావత్.. అధర్వ.. మహమ్మద్ ఇజర్.. ఆంకోలేకర్ వంటి యంగ్ ప్లేయర్లను కూడా జట్టులోకి తీసుకుంది. వీళ్ళు మాత్రమే కాకుండా హార్దిక్ పాండ్యా, బౌల్ట్, బుమ్రా, రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ వంటి స్టార్ ప్లేయర్లు కూడా ఉన్నారు. ఇంతమంది బలమైన ప్లేయర్లు మరే జట్టులో కూడా లేదంటే అతిశయోక్తి కాదు. గత ఏడాది పై ప్లేయర్లతోనే ముంబై జట్టు ఏకంగా క్వాలిఫైయర్ 2 దాకా వెళ్ళిపోయింది.

ఇవే బలాలు

ముంబై జట్టుకు ప్రధాన బలం బ్యాటింగ్. ఆ జట్టులో బలమైన ప్లేయర్లు ఉన్నారు.. రికెల్టన్, హార్థిక్ పాండ్యా, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్, రోహిత్ వంటి వారితో ముంబై బ్యాటింగ్ దళం అత్యంత బలంగా కనిపిస్తోంది. రికెల్టన్, రోహిత్ శర్మ ప్రారంభ ఓవర్లలో మెరుపు ఆరంభాన్ని అందించగలరు. ఒకవేళ రికెల్టన్, రోహిత్ గనుక ఇబ్బంది పడితే.. ప్రత్యామ్నాయంగా డికాక్ అందుబాటులో ఉన్నాడు. సూర్య కుమార్ యాదవ్ ఎలాగూ వన్ డౌన్ లో వస్తాడు.. సూర్య 65.18 సగటు.. 167.91 స్ట్రైక్ రేట్ తో ఏకంగా 717 రన్స్ చేశాడు. ముంబై జట్టు తరుపున హైయెస్ట్ స్కోర్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. తిలక్, హార్దిక్ వంటి వారితో మిడిల్ ఆర్డర్ అత్యంత పటిష్టంగా ఉంది. చివర్లో నమన్ దీర్ ఏదైనా చేయగలడు.

ఒకవేళ వికెట్లు వెంటనే కోల్పోయినప్పటికీ.. సత్తా చూపించగల సామర్థ్యం ముంబై జట్టుకు ఉంది. ఎందుకంటే విల్ జాక్స్ లాంటి ప్లేయర్ కూడా ఆ జట్టుకు ఉన్నాడు. బౌలింగ్లో బుమ్రా నే ముంబై జట్టుకు ప్రధాన అస్త్రం. దీపక్ చాహర్.. శాంట్నర్, హార్దిక్ వంటి ఆల్రౌండర్లు కూడా ముంబై జట్టుకు ప్రధాన బలం.

ఇబ్బంది పెడుతున్న బలహీనతలు

ముంబై జట్టుకో సమర్థవంతమైన వికెట్ కీపర్ లేడు. రికెల్టన్.. డికాక్ ఇద్దరూ ఫారిన్ ప్లేయర్లే. రాబిన్ మింజ్ కు అంతగా అనుభవం లేదు. శాంట్నర్ స్థాయిలో మరో స్పిన్నర్ లేడు.. హార్దిక్, బుమ్రా, చాహర్ గతంలో గాయపడ్డారు. వీరి ముగ్గురిలో ఎవరికైనా గాయమైతే ముంబై జట్టు ఇబ్బంది పడక తప్పదు.

2013, 2015, 2017, 2019, 2020 సంవత్సరాలలో ముంబై జట్టు విజేతగా ఆవిర్భవించింది. ఈ జట్టులో డికాక్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, బుమ్రా ఇటువంటివారు కీలక ప్లేయర్లుగా ఉన్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular