IPL 2025 : సౌమ్యుడిగా, వివాద రహితుడిగా పేరుపొందిన బుమ్రా ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో నిగ్రహాన్ని కోల్పోయాడు. ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. మైదానంలో అందరూ చూస్తుండగానే.. తోటి ఆటగాళ్ల సమక్షంలోనే ప్రత్యర్థి జట్టు ఆటగాడి మీదికి దూసుకుపోయాడు. రారా చూసుకుందాం అంటూ హెచ్చరికలు పంపాడు.. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిందని అకౌంట్ నెంబర్ చెబుతున్నారు.. బుమ్రా బౌలింగ్లో కరణ్ నాయర్ విపరీతమైన దూకుడు ప్రదర్శించాడు. కనివిని ఎరుగని స్థాయిలో పరుగులు రాబట్టాడు. అయితే నాయక్ పరుగులు తీస్తున్న సమయంలో నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న బుమ్రా ను ఢీకొన్నాడు.. అయితే అతనిపై బుమ్రా ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాదు నాయర్ తో వాగ్వాదానికి దిగాడు. దీనికి నాయర్ క్షమాపణ చెప్పడానికి ముందుకు వెళ్లినప్పటికీ బుమ్రా ఏమాత్రం శాంతించలేదు. పరిస్థితిని కాస్త మెరుగుపరచడానికి ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మధ్యలో ప్రవేశించాడు. నాయర్ తో మాట్లాడి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాడు.. అయితే ఇదంతా జరుగుతున్నప్పుడు ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వెనుక ఉన్నాడు. నవ్వుతూనే.. వ్యంగ్యంగా తల ఊపుతూ చిత్ర విచిత్రంగా కనిపించాడు.
Also Read : హార్దిక్ కన్నుకొట్టాడు.. రోహిత్ చిరునవ్వు నవ్వాడు.. వైరల్ వీడియో
కావాలని చేశారా..
వాస్తవానికి ఐపీఎల్ లో వివాదాలు మామూలుగా ఉండవు. అయితే కొన్నిసార్లు స్క్రిప్ట్ ఆధారంగా కూడా సాగుతుంటాయి. ఈ విషయాన్ని గతంలో ఐపీఎల్ నిర్వాహకులు అంతర్గత సంభాషణలో పేర్కొన్నారు. ఐపీఎల్ మీద హైప్ పెంచడానికి నిర్వాహకులు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.. ఈసారి కూడా అలానే చేసి ఉంటారని అభిమానులు అనుమానిస్తున్నారు.. బుమ్రా కు నాయర్ క్షమాపణ చెప్పినప్పటికీ ఎందుకు అంతలా రియాక్ట్ అయ్యాడనేది అభిమానులకు అంతుపట్టడం లేదు. సహజంగా పరుగులు తీస్తున్న సమయంలో బ్యాటర్ బౌలర్ ను ఢీకొట్టడం.. బౌలర్ బ్యాటర్ ను తగలడం సర్వసాధారణం. ఇలాంటి సందర్భాలు బుమ్రా కు చాలానే ఎదురయ్యాయి. అయినప్పటికీ అతడు పెద్దగా పట్టించుకోలేదు. ఆ సంఘటనలను వివాదాలు చేయలేదు. కానీ ఎన్నడూ లేనివిధంగా కరణ్ నాయర్ ఢీ కొట్టిన ఘటనను సంచలనం చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బహుశా తన బౌలింగ్లో నాయర్ బీభత్సంగా బ్యాటింగ్ చేయడం వల్లే బుమ్రా కు కోపం వచ్చి ఉంటుందని కొంతమంది అభిమానులు అనుమానిస్తున్నారు. మరికొందరేమో ఐపీఎల్ నిర్వాహకులు రచించిన స్క్రిప్ట్ లో భాగమేనని అంటున్నారు. ఇది సీరియస్ గొడవ అయితే రోహిత్ శర్మ అలా ఎందుకు నవ్వుతాడని.. ఇది ముమ్మాటికి డ్రామా అని కొంతమంది వాదిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ బుమ్రా తన సహజ గుణానికి విరుద్ధంగా వ్యవహరించడం.. ఈ మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది. అన్నట్టు బుమ్రా బౌలింగ్ లోనే ఢిల్లీ ఆటగాళ్లు చివరి ఓవర్లో ముగ్గురు రన్ అవుట్ కావడం.. మ్యాచ్ ను ఒకసారి గా ముంబై వైపు తిప్పింది. అన్నట్టు బుమ్రా వేసిన ఆ ఓవర్లో ఢిల్లీ ఆటగాడు అశుతోశ్ శర్మ వరుసగా బౌండరీలు కొట్టడం గమనార్హం.
ROHIT SHARMA’s REACTION pic.twitter.com/ZyPzY8KLNB
— Johns. (@CricCrazyJohns) April 13, 2025