Homeక్రీడలుKKR Vs CSK 2023: ఐపీఎల్: ఎంపైర్లతోనే గొడవకు దిగిన కెప్టెన్.. వీడియో వైరల్

KKR Vs CSK 2023: ఐపీఎల్: ఎంపైర్లతోనే గొడవకు దిగిన కెప్టెన్.. వీడియో వైరల్

KKR Vs CSK 2023: ఐపీఎల్ 16వ ఎడిషన్ లీగ్ దశ కొద్దిరోజుల్లో ముగియనుంది. ప్లే ఆఫ్ చేరేందుకు అన్ని జట్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. సులభంగా ప్లే ఆఫ్ చేరతాయనుకున్న జట్లు అనూహ్య ఓటములతో వెనుకబడిపోతున్నాయి. ఆదివారం సాయంత్రం చెన్నై సూపర్ కింగ్స్ – కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ లో కోల్ కతా జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసుకుని ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.

ప్లే ఆఫ్ కు చేరాలంటే తప్పక గెలవాల్సిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు. ప్రటిష్టమైన చెన్నై జట్టును వారి సొంత గడ్డపై ఓడించి సత్తా చాటింది. చెన్నై జట్టు ఘోరంగా విఫలం కావడంతో నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. కోల్ కతా జట్టులో రింకు సింగ్, కెప్టెన్ నితీష్ రానా అర్థ సెంచరీలతో రాణించడంతో సులభంగానే లక్ష్యాన్ని చేదించింది. దీంతో ప్లే ఆఫ్ రేసులో తామున్నామంటూ మిగిలిన జట్లకు హెచ్చరికలు పంపింది కోల్ కతా జట్టు. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా మంచి ఇన్నింగ్స్ ఆడి ఆకట్టుకున్న నితీష్ రానా వ్యవహరించిన తీరు పలు విమర్శలకు దారితీస్తోంది.

అంపైర్లతో వాగ్వాదానికి దిగిన రానా..

ఈ మ్యాచ్ లో కోల్ కతా జట్టు కెప్టెన్ నితీష్ రానా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అయితే సీఎస్కే ఇన్నింగ్స్ సమయంలో రానా వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీసింది. చెన్నై జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆఖరి ఓవర్ వేసేందుకు కేకేఆర్ నుంచి అరోరా సమాయత్తమయ్యాడు. అయితే, స్లో ఓవర్ రేటు మెయింటైన్ చేస్తున్న కారణంగా కొత్త నిబంధనల ప్రకారం మైదానంలోనే కేకేఆర్ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. 30 యార్డ్ సర్కిల్ బయట ఐదుగురికి బదులు నలుగురు ఫీల్డర్లనే ప్లేస్ చేయాలని ఎంపైర్లు సూచించారు. దీంతో కోపోద్రిక్తుడైన నితీష్ రానా అంపైర్ల వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో అంపైర్లు నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిందేనని తేల్చి చెప్పడంతో రానా అక్కడి నుంచి కదిలినట్టు కనిపించింది. ఈ వీడియో పై స్పందించిన నెటిజన్లు ఎవరైనా రూల్స్ పాటించాల్సిందే కదా ఎందుకు ప్రతి దానికి గొడవ పడడం అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. అద్భుతమైన బ్యాటింగ్ తో జట్టుకు విజయం అందించిన రానా ఈ తరహా గొడవలతో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నాడని పలువురు పేర్కొంటున్నారు.

విజయకేతనం ఎగరవేసి.. ఆశలు నిలుపుకుని..

ఇక చెన్నై జట్టు ఇన్నింగ్స్ లో ఆఖరి ఓవర్ వేసిన వైభవ్ అరోరా 9 పరుగులు మాత్రమే ఇచ్చి రవీంద్ర జడేజా వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో చెన్నై జట్టు 144 పరుగులకే ఇన్నింగ్స్ ను ముగించాల్సి వచ్చింది. నితీష్ రానా, రింకు సింగ్ అర్థ శతకాలతో రాణించడంతో కోల్ కతా జట్టు సులభంగానే విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో రానా 44 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్ తో 57 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ గా నిలిచిన రింకు సింగ్ 43 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సులతో 54 పరుగులు సాధించాడు. ఇక సీఎస్కేను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్ లో ఆరు గెలిచి 12 పాయింట్లతో ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. మిగిలిన మ్యాచ్ లో తప్పక గెలవాల్సిన పరిస్థితి చెన్నై జట్టుకు ఏర్పడింది. కోల్ కతా జట్టుపై చెన్నై ఓడిపోవడం, రాజస్థాన్ జట్టుపై బెంగళూరు రాయల్ చాలెంజర్స్ భారీ విజయం నమోదు చేయడంతో ఇప్పుడు మరింత కఠినంగా మారింది. చూడాలి మరి ఏ జట్లు ప్లే ఆఫ్ కు వెళ్లనున్నాయో.

https://twitter.com/Raju88784482906/status/1657773871272169473?s=20

RELATED ARTICLES

Most Popular