Homeక్రీడలుIPL 2022 Tickets Online Booking: ఐపీఎల్ టికెట్లు కావాలా.. ఆన్‌లైన్‌లో ఇలా బుక్ చేసుకోండి..

IPL 2022 Tickets Online Booking: ఐపీఎల్ టికెట్లు కావాలా.. ఆన్‌లైన్‌లో ఇలా బుక్ చేసుకోండి..

IPL 2022 Tickets Online Booking: ఇండియాలో ఐపీఎల్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పరిమిత ఓవర్లతో సాగే ఈ టోర్నమెంట్ కు దేశవ్యాప్తంగా విపరీతమైన అభిమానులు ఉన్నారు. కాగా ఈ సారి లీగ్ దశ మ్యాచ్ లు ఈనెల 26 నుంచి మే 29 వరకు జరగనున్నాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో.. ఈ మ్యాచ్ లను మొత్తం ముంబై లోని వాంఖడే, డివై పాటిల్, పూణేలోని ఎంసిఏ స్టేడియంలో మాత్రమే నిర్వహిస్తున్నారు. కేవలం ప్లే ఆఫ్ తో పాటు ఫైనల్ మ్యాచ్ ను మాత్ర‌మే అహ్మదాబాద్ లో నిర్వహించనున్నారు.

IPL 2022 Tickets Online Booking
IPL 2022 Tickets Online Booking

అయితే గత రెండేళ్లుగా ఐపీఎల్ మ్యాచ్ లకు అభిమానులకు ఎంట్రీ లేదు. ఈసారి కరోనా పరిస్థితులు అదుపులో ఉండడంతో.. 25 శాతం మేర అభిమానులకు పర్మిషన్ ఇచ్చింది బీసీసీఐ. రెండేళ్ల గ్యాప్ తర్వాత అభిమానులకు ఎంట్రీ ఇవ్వడంతోపాటు.. పరిమిత మందికి అవకాశం ఉండడంతో.. ఐపీఎల్ టికెట్ లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దేశ వ్యాప్తంగా ఈ టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు అందరూ ఎగబడుతున్నారు.

Also Read: RRR Movie First Day Worldwide Collection: ‘ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్

బీసీసీఐ మార్చి 23 బుధవారం నుంచి ఈ టికెట్లను ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా వీటిని ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా అధికారిక వెబ్ సైట్ www.iplt20.com లోకి లేదా https://in.bookmyshow.com/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఈ రెండు వెబ్ సైట్ లలో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. మెనూ బార్ లోకి వెళ్ళిన తర్వాత బై టికెట్స్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.

IPL 2022 Tickets Online Booking
IPL 2022 Tickets Online Booking

అందులో కావాల్సిన టికెట్లను సెలెక్ట్ చేసుకుని.. వాటికి తగ్గ ధరను ఆన్ లైన్ లోనే చెల్లించాలి. ఆ తర్వాత టికెట్స్ కు సంబంధించిన పీడీఎఫ్ ఫైల్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ డౌన్ లోడ్ చేసుకున్న పీడీఎఫ్ ఫైల్ ను స్క్రీన్ షాట్ లేదా ప్రింటవుట్ తీసుకుని స్టేడియంకు తీసుకెళ్ళాలి. వాటిని చూపిస్తే లోపలికి వెళ్ళనిస్తారు. అయితే ఈసారి ఐపీఎల్ లో 12 రోజులు డబుల్ హెడ్ మ్యాచ్ లు ఉన్నాయి. అంటే ఒకే రోజు రెండు మ్యాచ్ లు నిర్వహిస్తారన్నమాట. మధ్యాహ్నం 3.30 గంటలకు ఒకటి మొదలైతే, రాత్రి 7.30 గంటలకు మరొకటి స్టార్ట్ అవుతుంది. స్టేడియంలోకి వెళ్లాలనుకునేవారు ఖచ్చితంగా కరోనా రూల్స్ ఫాలో అవ్వాలి.

Also Read:Bigg Boss Non Stop Telugu: ఓటింగ్ లో దుమ్ములేపుతున్న బ్యూటీ.. ఆ ఇద్ద‌రిలో ఒక‌రు ఎలిమినేట్‌..?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

2 COMMENTS

  1. […] Rain Update: అసలే ఎండాకాలం ఎండలు మండిపోతున్నా వాతావరణ శాఖ మాత్రం చల్లని కబురు చెబుతోంది. రాగల రెండు మూడు రోజుల్లో వర్షాలు పడతాయని అంచనా వేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడిందని తెలిపింది. దీంతో రాబోయే రోజుల్లో అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular