Odi World Cup 2023: వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా సౌతాఫ్రికా టీముల మధ్య ఒక భారీ మ్యాచ్ అనేది జరగనుంది. ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనే దానిపైన ప్రతి ఒక్కరు తీవ్రమైన ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.ఇక ఇలాంటి క్రమంలో ఇండియా సౌతాఫ్రికా టీం రెండు జట్లు కూడా సమ ఉజ్జీలుగా మారాయి ఎందుకంటే ఇప్పటివరకు ఇండియా టీం ఏడు మ్యాచ్ లు ఆడితే ఏడు మ్యాచ్ ల్లో గెలిచింది. ఇక సౌతాఫ్రికా మాత్రం ఏడు మ్యాచులు ఆడితే అందులో ఆరు మ్యాచ్ ల్లో గెలిచి ఒక మ్యాచ్ లో ఓడిపోయి పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 2 పొజిషన్ లో కొనసాగుతుంది.
ఇక ఈ రెండు టీములు కూడా సెమీస్ కి క్వాలిఫై అయినట్టే…కాబట్టి ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వాళ్లు టేబుల్ లో నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతారు…సౌతాఫ్రికా టీమ్ కి ఇండియా కంటే కూడా రన్ రేట్ ఎక్కువ గా ఉండటం తో ఇండియా ఫస్ట్ పొజిషన్ లో ఉండాలి అంటే ఈ మ్యాచ్ లో తప్పకుండా గెలవాలి…ఇక ఇలాంటి క్రమంలో రెండు టీం ల బలాబలాలను ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే…
సౌతాఫ్రికా టీంలో ఎలాగైతే సిక్స్ మెంబర్స్ బ్యాట్స్ మెన్స్ ఉన్నారో, ఇండియా టీం లో కూడా అలాగే సిక్స్ మెంబర్స్ బ్యాట్స్ మెన్స్ ఉన్నారు.ఇక సౌతాఫ్రికాలో ఒక ఆల్ రౌండర్ ఉంటే ఇండియన్ టీం లో కూడా ఒక అల్ రౌండర్ ఉన్నాడు.అలాగే సౌతాఫ్రికా టీమ్ లో నలుగురు మంచి బౌలర్లు ఉంటే ఇండియా టీమ్ లో కూడా నలుగురు బౌలర్లు ఉన్నారు. ఇక ఈ క్రమంలో సౌతాఫ్రికా కి గెలవడానికి ఎంత అవకాశం ఉందో ఇండియన్ టీం కి కూడా గెలిచే అవకాశాలు అంతే ఉన్నాయి…సౌతాఫ్రికా ఓపెనర్ అయిన డికాక్ అద్భుతమైన సెంచరీలు చేసి ఆ టీమ్ కి వరస విజయాలను అందించడంలో కీలకపాత్ర వహిస్తున్నాడు. అలాగే క్లాసెన్, వండర్ డసెన్, మిల్లర్ లాంటి ప్లేయర్లు మంచి ఫామ్ లో ఉండటమే కాకుండా ఇండియా మీద వీళ్ళందరికీ మంచి రికార్డులు కూడా ఉన్నాయి…
2015 కు ముందు ఇండియన్ టీం వరల్డ్ కప్ లో సౌతాఫ్రికా మీద పెద్దగా గెలిచింది అయితే లేదు. ఎందుకంటే 2011వ సంవత్సరంలో ఇండియా వరల్డ్ కప్ గెలిచినప్పటికీ సౌతాఫ్రికా మీద ఆడిన మ్యాచ్ లో మాత్రం ఓడిపోయింది. సచిన్ టెండూల్కర్ సెంచరీ చేసి ఇండియన్ టీం 296 పరుగుల భారీ స్కోరు అందించినప్పటికి సౌతాఫ్రికా టీం 297 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసింది. వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా చేజ్ చేసిన హైయెస్ట్ స్కోర్ కూడా అదే కావడం విశేషం… ఇక 2015 వ సంవత్సరంలో శిఖర్ ధావన్ అద్భుతమైన సెంచరీ చేశాడు. 2019లో రోహిత్ శర్మ ఒక అద్భుతమైన నాక్ ఆడడం జరిగింది. ఇలా సౌతాఫ్రికా మీద మనవాళ్లు కొన్ని మ్యాచ్ లు గెలిచి, కొన్ని మ్యాచ్ ల్లో ఓడిపోయినప్పటికీ ఇక గతాన్ని పక్కన పెడితే మాత్రం ఈ మ్యాచ్ లో చాలా టఫ్ ఫైట్ అనేది జరగబోతున్నట్టు గా తెలుస్తుంది… ఇక సౌతాఫ్రికా మీద వరల్డ్ కప్ లో ఇండియా ఆడిన ప్రతి మ్యాచ్ లో ఇండియన్ టీమ్ ఓపెనర్ లలో ఎవరో ఒకరు అద్భుతమైన ఇన్నింగ్స్ ని ఆడుతూ వస్తున్నారు కాబట్టి ఇండియన్ టీమ్ కి ఈరోజు కూడా ఓపెనర్లు బలంగా మారబోతున్నట్టుగా తెలుస్తుంది…
ఇక ఇలాంటి క్రమంలో ఇండియన్ టీం ఈ మ్యాచ్ లో గెలిచి తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటుందా లేదా సౌతాఫ్రికా ఈ మ్యాచ్ లో గెలిచి నెంబర్ వన్ పొజిషన్ ని చేరుకుంటుదా అనేది తెలియాలి.ఇక ఇప్పటివరకు అయితే రెండు టీముల్లో కూడా ఉన్న ప్లేయర్లు అందరూ మంచి ఫామ్ లో ఉండటం రెండు జట్లకు కలిసి వచ్చే అంశం అనే చెప్పాలి…ఇక ఈడెన్ గార్డెన్ పిచ్ కూడా బ్యాటింగ్ కి అద్భుతంగా అనుకూలిస్తుంది అలాగే బౌలింగ్ కూడా బాగా పని చేస్తుంది.ఇక ఇలాంటి నేపథ్యం లో ఈ మ్యాచ్ లో ఏదైనా జరగొచ్చు ఇండియన్ టీం బ్యాట్స్ మెన్స్ లలో రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్ల లలో ఏ ఒక్క ముగ్గురు ప్లేయర్లు అద్భుతమైన నాక్ ఆడిన కూడా ఇండియన్ టీమ్ భారీ స్కోరు అయితే చేయగలుగుతుంది.
అలాగే సౌతాఫ్రికాని కట్టడి చేయాలంటే మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్ర ఇద్దరు కూడా చాలా కీలకపాత్ర వహించాలి. వీళ్లు సౌతాఫ్రికా టీమ్ మీద ఒత్తిడి తెస్తేనే తప్ప ఇండియా సౌతాఫ్రికా టీమ్ మీద ఆధిపత్యాన్ని చెలాయించలేదు.ఇక డికాక్ ఇప్పటికే నాలుగు సెంచరీలు చేసి అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు అతన్ని ఎదుర్కోవడం కొంత వరకు కష్టమైనప్పటికీ బుమ్రా,షమీ లు ఎదురు దాడి చేస్తే మాత్రం కొద్ది వరకు మనం వాళ్లని కట్టడి చేయవచ్చు…మరి ఈ మ్యాచ్ లో ఎవరు పై చేయి సాధిస్తారు అనేది తెలియాలంటే మ్యాచ్ జరిగేంత వరకు వెయిట్ చేయాల్సిందే…