India Vs Pakistan: వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య ఒక భారీ మ్యాచ్ అనేది జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన ఇండియా టీమ్ మొదట బౌలింగ్ తీసుకోవడం జరిగింది. దాంతో మొదటగా బ్యాటింగ్ కు వచ్చిన పాకిస్తాన్ టీమ్ మొదట్లో కొద్దిసేపు బాగా ఆడినప్పటికీ ఇండియన్ బౌలర్ల దాటికి తట్టుకోలేక పాకిస్థాన్ బ్యాట్స్ మెన్స్ అందరూ చేతులెత్తేశారు. అయితే పాకిస్థాన్ ఓపెనర్లు మంచి కాన్ఫిడెంట్ గా కనిపించారు కొద్దిసేపు పర్లేదు అన్నట్టు గా ఆడారు కానీ ఓపెనర్ షఫీక్ 20 పరుగులు చేసి సిరజ్ బౌలింగ్ లో అవుట్ అవ్వడం జరిగింది…
ఇక సిరాజ్ వేసిన బాల్ ని కరెక్ట్ గా అంచనా వేయలేని షఫిక్ ఎల్బిడబ్ల్యుగా అవుట్ అయి వెనుతిరిగాడు…ఇక అప్పుడు క్రీజ్ లోకి వచ్చిన బాబర్ ఆజాం మరో ఓపెనర్ అయిన ఇమామ్ ఉల్ హక్ ఇద్దరు కలిసి కొద్దిసేపు ఇన్నింగ్స్ ని చక్కదిద్దే పనిలో పడ్డారు.కానీ బాబర్ అజమ్ నిదానంగా ఆడుతుంటే ఇమామ్ ఉల్ హక్ మాత్రం నిదానంగా ఆడుతూనే లూస్ గా వచ్చిన బాల్ ని బౌండరీకి తరలిస్తూ తనదైన రీతిలో ఒక క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు.ఇక వీళ్లిద్దరూ బాగా ఆడుతారు అని అనుకున్న టైమ్ లో పాండ్య వచ్చి ఇమామ్ ఉల్ హక్ ని ఔట్ చేశాడు. ఇక అప్పటికే 38 బంతుల్లో 36 పరుగులు చేసిన ఇమామ్ ఉల్ హక్ పాండ్య వేసిన బాల్ ని కవర్స్ మీది నుంచి బౌండరీ కి పంపిద్దాం అని అనుకున్నాడు. కానీ అది బ్యాట్ కి టిప్ అయి కీపర్ కేఎల్ రాహుల్ చేతిలో పడిపోయింది.
దాంతో ఇమామ్ ఉల్ హక్ అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన మహమ్మద్ రిజ్వాన్, బాబర్ అజమ్ తో కలిసి చాలా వరకు మ్యాచ్ ని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు. వీళ్ళిద్దరూ కలిసి దాదాపు 80 పరుగుల భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పారు. ఇక ఈ క్రమంలో ఆల్రెడీ వీళ్ళిద్దరూ క్రీజ్ పాతుకుపోయి ఉన్నారు. కాబట్టి వీరిద్దరిలో ఎవరో ఒకరిని అవుట్ చేయకపోతే ఇండియాకి భారీ నష్టం జరగబోతుందని కెప్టెన్ రోహిత్ శర్మ అనుకొని సిరాజ్ ని రంగంలోకి దింపాడు.దాంతో అప్పుడే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన బాబర్ అజమ్ సిరజ్ ని ఎదుర్కోవడంలో తడపడ్డాడు.దాంతో సిరజ్ బౌలింగ్ లో క్లీన్ బోల్డ్ అయ్యాడు. ఇక దాంతో పాకిస్తాన్ టీమ్ మీద చాలా భారం పడింది. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ లో పాకిస్థాన్ టీమ్ ని ఆదుకునే ప్లేయర్ లేకుండా పోయారు. ఇక సరిగ్గా అదే సమయానికి 49 పరుగులు చేసి మంచి ఫామ్ లో ఉన్నా రిజ్వన్ ని అవుట్ చేయడానికి రోహిత్ శర్మ ప్లాన్ ప్రకారం బుమ్రా ని రంగం లోకి దింపాడు.
ఇక బుమ్రా వేసిన ఇన్ సింగర్ ని కరెక్ట్ గా జడ్జ్ చేయాలేని బాల్ రిజ్వాన్ లోపలికి వస్తుంది అనుకున్నాడు కానీ అది బెల్స్ ని పడగొట్టింది.దాంతో రిజ్వాన్ కూడా ఔట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత వచ్చిన ప్లేయర్లు వచ్చినవాళ్ళు వచ్చినట్టుగా పెవిలియన్ కి క్యూ కట్టారు.కేవలం పాకిస్థాన్ 15 పరుగుల గ్యాప్ లోనే 5 వికెట్లను కోల్పోయింది…ఇక దాంతో 42 వ ఓవర్ ఐదవ బాల్ కి పాకిస్థాన్ టీమ్ 191 రన్స్ చేసి అలౌట్ అయింది…
ఇక ఈ మ్యాచ్ లో ఇండియన్ బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేయడం మన టీమ్ కి బాగా కలిసి వచ్చింది.మన బౌలర్లు అందరూ కూడా సమిష్టి గా రాణించి పాకిస్థాన్ బ్యాట్స్ మెన్స్ ను కోలుకోలేని దెబ్బ కొట్టారు…ఇక సిరజ్,బుమ్ర, రవీంద్ర జడేజా, హర్థిక్ పాండ్య ,కుల్దిప్ యాదవ్ లు అందరూ కూడా తల రెండు వికెట్లు తీశారు…భారత బౌలర్ల దెబ్బ కి చతికిల పడిన పాకిస్థాన్ టీమ్…