IND Vs NZ: ఫిబ్రవరిలో జరిగే టి20 వరల్డ్ కప్ కంటే ముందు టీమిండియా న్యూజిలాండ్(IND vs NZ) జట్టుతో వన్డే, టి20 సిరీస్ లో తలపడబోతోంది. ఈ సిరీస్ కు సంబంధించి బీసీసీఐ(BCCI) శనివారం భారత జట్టును ప్రకటించనుంది. వర్క్ లోడ్ వంటి కారణాలతో ఇప్పటికే బుమ్రా(Jaspreet bumrah), హార్దిక్ పాండ్యా(Hardik Pandya)కు మేనేజ్మెంట్ రెస్ట్ ఇచ్చింది.
చాలాకాలంగా షమీ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. మేనేజ్మెంట్ అతడిని ఎంపిక చేయడం లేదు. వన్డే వరల్డ్ కప్ లో అతడు అద్భుతమైన ప్రదర్శన చూపించాడు. అయితే ఆ తర్వాత అతడికి శస్త్ర చికిత్స జరిగింది. ఫలితంగా కొంతకాలం అతడు ఆస్పత్రికే పరిమితమయ్యాడు. ఆ తర్వాత డొమెస్టిక్ క్రికెట్లో సత్తా చూపించినప్పటికీ సెలెక్టర్లు అతని మీద కరుణ చూపించలేదు. ఐపీఎల్ లో కూడా అతడు అంతగా ఆకట్టుకోలేదు. ఇప్పుడిక న్యూజిలాండ్ జట్టుతో జరిగే సిరీస్లో అతనికి అవకాశం దక్కుతుందని తెలుస్తోంది.
రిషబ్ పంత్ స్థానంలో షమీని ఎంపిక చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు ఇటీవల డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతమైన ప్రతిభ చూపిస్తున్న ఇషాన్ కిషన్ ను జట్టులోకి తీసుకుంటారని తెలుస్తోంది. మరోవైపు దేవదత్ పడిక్కల్, సర్ఫ రాజ్ ఖాన్ డొమెస్టిక్ క్రికెట్ లో అదరగొడుతున్న నేపథ్యంలో.. వారికి అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. మరోవైపు రుతు రాజ్ గైక్వాడ్ ఇటీవల జరిగిన దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ లో సెంచరీ చేసి అదరగొట్టాడు. దీంతో అతడికి కూడా జట్టులో చోటు లభిస్తుందని తెలుస్తోంది. బౌలింగ్ విభాగాన్ని హర్షిత్ రాణా, అర్ష్ దీప్ సింగ్ ముందుండి నడిపిస్తారు. న్యూజిలాండ్ సిరీస్ లో గిల్ మళ్లీ జట్టులోకి వస్తాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడటం ఖాయమే. జైస్వాల్ ను ఎంపిక చేయడం కూడా లాంచన ప్రాయమే. ఒకవేళ అయ్యర్ గనుక పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని సంపాదించుకుంటే.. జట్టులోకి వస్తాడు. ఒకవేళ అయ్యర్ ను ఎంపిక చేయకపోతే అతడి స్థానంలో గైక్వాడ్ ఆడతాడు.