India vs Bangladesh: ప్రస్తుతం ఇండియా టీం హావ నడుస్తుంది.రీసెంట్ గా ఏషియా కప్ కొట్టిన ఇండియా టీం ఈనెల 8 వ తేదీన వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా తో మొదటి మ్యాచ్ ఆడుతుంది.ఇక వరల్డ్ కప్ పరిస్థితి ఇలా ఉంటె ఇప్పటీకే ఇండియా బి టీం చైనా లో ఏషియన్ గేమ్స్ ఆడుతూ అద్భుతమైన ఫామ్ ని కనబరుస్తూ ముందుకు దూసుకెళ్తుంది.మొన్న నేపాల్ తో ఆడిన మ్యాచ్ లో ఇండియన్ టీం అలవోక గా ఆ మ్యాచ్ గెలిచి మన టీం సత్తా ని చాటారు.ఇక దానికి తగ్గట్టు గానే ఇవాళ్ల బంగ్లాదేశ్ ఇండియా టీం లా మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ అనేది జరిగింది. ఇక అందులో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లకి 6 వికెట్లు కోల్పోయి 96 పరుగులు మాత్రమే చేసింది.ఇక దానికి తగ్గట్టు గా బంగ్లాదేశ్ ప్లేయర్లలో ఎవ్వరు కూడా పెద్దగా చెప్పుకోదగ్గ రన్స్ అయితే చేయలేదు.
ఇక ఇండియన్ బౌలర్లలో సాయి కిషోర్ మూడు వికెట్లు తీసాడు అలాగే వాషింగ్ టన్ సుందర్ రెండు వికెట్లు తీసాడు.అలాగే అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్, తిలక్ వర్మ, షాబాజ్ అహ్మద్ లు తలో వికెట్ తీశారు. 97 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన ఇండియన్ టీం కి మొదట్లోనే ఒక ఎదురు దెబ్బ తగిలింది. యశస్వి జైశ్వాల్ డకౌట్ అయ్యాడు ఇక అతని తర్వాత క్రీజ్ లోకి వచ్చిన తిలక్ వర్మ మరో ఓపెనర్ అయినా రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరు కలిసి రెండొవ వికెట్ కి 97 పరుగుల బాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇండియా మ్యాచ్ గెలిచేలా చేసారు.కేవలం తొమ్మిది ఓవర్లల్లోనే ఈ స్కోర్ ని ఛేదించటం జరిగింది.ఇక ఈ మ్యాచ్ గెలిచినా ఇండియా ఏషియన్ గేమ్స్ లో ఫైనల్ కి చేరుకుంది.ఇక సెమి ఫైనల్ మ్యాచ్ లో తిలక్ వర్మ ఒక అద్భుతమైన హాఫ్ సెంచరీ ని చేసాడు.కేవలం 26 బంతుల్లోనే 6 సిక్స్ లు, 2 ఫోర్లు కొట్టి 55 పరుగులు చేశాడు.ఇక మరో ప్లేయర్ అయినా గైక్వాడ్ కూడా 26 బంతుల్లో 4 ఫోర్లు,3 సిక్స్ లు కొట్టి 40 రన్స్ చేశాడు. దాంతో ఇండియా ఈ మ్యాచ్ లో విజయం సాధించి ఫైనల్ కి చేరుకుంది.
ఇక రేపు జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా తో తల పడే టీం ఏది అనేది ఇంకా తెలియదు కానీ ఈ మ్యాచ్ లో గెలిచి ఇండియా గోల్డ్ మెడల్ సాధించాలని చూస్తుంది.నిజానికి ఫైనల్ లో ఓడిపోతే రన్నరప్ గా ఉన్న వాళ్ళకి సిల్వర్ మెడల్ వస్తుంది, ఇక సెమీ ఫైనల్ లో ఓడిపోయినా రెండు జట్ల కి మరొక మ్యాచ్ పెట్టి దాంట్లో గెలిచినా వాళ్ళ కి బ్రెంజ్ మెడల్ ఇవ్వడం జరుగుతుంది…ఇక ఇండియన్ ఉమెన్స్ టీం ఇప్పటికే గోల్డ్ మెడల్ సాధించింది. ఇప్పుడు మెన్స్ టీం గోల్డ్ మెడల్ కొట్టడానికి రెడీ గా ఉంది…