India vs Australia: ఇంగ్లడ్–ఆస్ట్రేలియా మధ్య జరిగే యాషెస్ సిరీస్ తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్న సిరీస్ బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ఈ సిరీస్ ఒక ఏడాది ఆస్ట్రేలియాలో.. తర్వాతి ఏడాది ఇండియాలో జరుగుతుంది. ప్రస్తుతం టీమిండియా సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఈ సిరీస్‌లో ఐదు టెస్టులు, ట్రయాంగిల్ వన్డే క్రికెట్ మ్యాచ్‌లు ఆడుతుంది. ఇక సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ శుక్రవారం(నవంబర్ 22న) ప్రారంభమైంది. ఇందులో టీమిండియా డామినేసన్ కొనసాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా 150 పరగులకే ఆల్‌ఔట్ అయింది. తర్వాత ఆస్ట్రేలియాను బారత బౌలర్లు కేవలం 104 పరుగులకు కట్టడి చేసి 46 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్టోర్ చేసింది యశస్వి జైశ్వాల్ 161 పరుగులు, కోహ్లీ 100 నాటౌట్, కెఎల్ రాహుల 60 పరుగులతో రాణించారు. దీంతో టీమిండియా 487 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ముందు 534 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
టపటపా వికెట్లు..
ఇక భారీ లక్ష్యంలో రెండో ఇన్నింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. బూమ్రా రెండు వికెట్లు, సిరాస్ ఒక వికెట్ పడొట్టాడు. ఆస్ట్రేలియా నాలుగో రోజు మూడు సెషన్లలో ఆడే ఆటపైనే మ్యాచ్ డ్రా ఆధారపడి ఉంటుంది. ఆస్ట్రేలియా వికెట్ల పడకుండా ఆటగాళ్లు ఎక్కువ సేపు క్రీజ్‌లో ఉండేందుకు యత్నిస్తారు. ఇక పిచ్ బౌలర్లకు సహకరిస్తున్న నేపథ్యంలో మన సీమర్లు ఆస్ట్రేలియాను నాలుగో రోజే ఆల్‌ఔట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఆసిస్‌కు సీనియర్ల సూచన..
ఇక నాలుగో రోజు ఎలా ఆడాలో సీనియర్ ఆటగాళ్లు ఆసిస్ జట్టుకు సూచిస్తున్నారు. ఆస్ట్రేలియా మూడు సెషన్ల కోసం ఎక్కువసేపు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. స్టీవ్ స్మిత్ జట్టు కోసం విరాట్ కోహ్లీ లాంటి పాత్ర పోషించినట్లయితే, ఆట ఐదవ రోజుకు వెళుతుంది. ఈ సిరీస్‌లో కనీసం మూడు పరీక్షలు ఐదు రోజులు వెళ్లాలని కోరుకుంటున్నామని పేర్కొంటున్నారు. ‘ఇది సుదీర్ఘ సిరీస్, ఆధిపత్యం ఒక జట్టు నుంచి∙మరొక జట్టుకు సంప్ అపుతుంది. ఆస్ట్రేలియాకు వారి రోజులు ఉంటాయి, కొన్ని రోజుల్లో భారతదేశం కూడా ఆధిపత్యం చెలాయిస్తుంది’ అని మాథ్యూ హేడెన్ చెప్పారు.
– భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కూడా తన అంచనాను ఇచ్చారు. ‘భారతదేశం మొదటి టెస్ట్ గెలవబోతోంది. టీ వరకు ఆస్ట్రేలియా ఆల్‌ఔట్ అయ్యే అవకాశం ఉంది అని తెలిపారు.
– కొనసాగుతున్న సరిహద్దు–గవాస్కర్ ట్రోఫీ 2024–25 ఐదు టెస్ట్ మ్యాచ్‌లను కలిగి ఉంది, మరియు ఇండియా నేషనల్ క్రికెట్ జట్టు 4–0తో గెలవాలి, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్స్ ఫైనల్‌కు అర్హత సాధించాలి.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: India vs australia live cricket score day 4 1st test jasprit bumrah picks travis head aus 168 6 vs ind in perth
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com