Homeక్రీడలుIndia Vs Australia 2nd Odi: వీళ్ల ఆటతీరే వరల్డ్ కప్ లో చోటిస్తుంది.. అసీస్...

India Vs Australia 2nd Odi: వీళ్ల ఆటతీరే వరల్డ్ కప్ లో చోటిస్తుంది.. అసీస్ తో నేటి రెండో వన్డే లో ఆడకపోతే చోటు గల్లంతే!!

India Vs Australia 2nd Odi: టీమిండియా కీలక ఆటగాళ్లు లేకపోయినా ఇండోర్‌ వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో సమష్టిగా రాణించి.. బలమైన కంగారూలను ఓడించింది. తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌.రాహుల్‌ చివరి వరకూ క్రీజ్‌లో ఉండి జట్టును గెలిపించాడు. ఈ క్రమంలోనే వన్డేల్లోనూ భారత్‌ నంబర్‌ వన్‌ ర్యాంకు దక్కింది. వన్డే సిరీస్‌లో బ్బందిపడిన సూర్యకుమార్‌ శుభపరిణామం. బ్యాటింగ్‌లో ఒకరు.. బౌలింగ్‌లో ఒకరు మినహా మిగతావారు రాణించారు. వరల్డ్‌ కప్‌ ముంగిట ఆ ఇద్దరి విషయంలోనే మేనేజ్‌మెంట్‌తోపాటు అభిమానుల్లో సందిగ్ధత నెలకొంది.

ఎవరా ఇద్దరు?
ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో నలుగురు భారత బ్యాటర్లు అర్ధశతకాలు అలరించారు. ఆసీస్‌ పేస్‌ను ఎదుర్కొని ఓపెనర్లుగా వచ్చిన శుభ్‌మన్‌ గిల్, రుతురాజ్‌ గైక్వాడ్‌ కూడా హాఫ్‌ సెంచరీలు సాధించారు. ఇక రెండో వన్డేలోనూ వీరిద్దరే ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తారు. ఈ మ్యాచ్‌కు కూడా రోహిత్, విరాట్‌ అందుబాటులో ఉండరు. అయితే, మొదటి వన్డేలో వన్డే డౌన్‌లో వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌ ఘోరంగా విఫలమయ్యాడు. బ్యాటింగ్‌లో ఓపెనర్లు శుభారంభం ఇచ్చినా.. శ్రేయస్‌ మాత్రం స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేయలేకపోయాడు. అటు ఫీల్డింగ్‌ లోనూ చురుగ్గా ఉండలేకపోయాడు. క్యాచ్‌లను జారవిడిచాడు. దీంతో అసలు అయ్యర్‌ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడా..? లేదా..? అనే అనుమానం కలుగుతోంది. అందుకే, రెండో వన్డే అతడికి చాలా కీలకం. ఈసారి ఆడకపోతే మాత్రం మూడో వన్డేతోపాటు వరల్డ్‌ కప్‌లో స్థానం గల్లంతు కావడం ఖాయం. ఈ మ్యాచ్‌లో సరిగా ఆడకపోతే మాత్రం.. మూడో వన్డే నాటికి విరాట్‌ కోహ్లి వచ్చేస్తాడు. అప్పుడు శ్రేయస్‌పై వేటు పడే అవకాశాలు మెండుగా ఉంటాయి.

ఈ ఆల్‌ రౌండర్‌ పరిస్థితీ అంతే..
మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాపై షమీ, బుమ్రా, అశ్విన్, జడేజా రాణించారు. షమీ ఏకంగా ఐదు వికెట్లు తీసి సంచలన బౌలింగ్‌ చేశాడు. అయితే, ఒకే ఒక్క బౌలర్‌ మాత్రం భారీగా పరుగులు సమర్పించాడు. అతడే శార్దూల్‌ ఠాకూర్‌. ఆసీస్‌పై తొలి వన్డేలో వికెట్‌ తీయకుండా 78 పరుగులు సమర్పించాడు. హార్దిక్‌ పాండ్యతోపాటు పేస్‌ ఆల్‌రౌండర్‌గా అక్కరకొస్తాడని భావించినా.. శార్దూల్‌ మాత్రం తనస్థాయి ఆటను ప్రదర్శించలేకపోతున్నాడు. రెండో వన్డేలోనూ ఇదే ప్రదర్శన పునరావృతమైతే మాత్రం వరల్డ్‌ కప్‌ ఛాన్స్‌ చేజారే ప్రమాదం లేకపోలేదు. మూడో వన్డేలో హార్ధిక్‌ రంగంలోకి దిగుతాడు. దీంతో శార్దూల్‌కు తుది జట్టులో స్థానం కష్టమే. వరల్డ్‌ కప్‌లో ఆడే పూర్తిస్థాయి జట్టు ఎలా ఉంటుందో.. మూడో వన్డేలో బరిలోకి దిగే టీమ్‌ కూడా దాదాపు అలాగే ఉండొచ్చని ఇప్పటికే ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే.

అశ్విన్‌ ఈసారి కూడా..
దాదాపు ఏడాదిన్నర తర్వాత వన్డే జట్టులోకి వచ్చినా సరే.. తనకేమీ కొత్త ఫార్మాట్‌ కాదన్నట్లుగా అశ్విన్‌ బౌలింగ్‌ ఉంది. పది ఓవర్ల కోటాను అలవోకగా పూర్తి చేసేశాడు. అందుకు కారణం కూడా టెస్టుల రోజుల తరబడి బౌలింగ్‌ చేసిన అనుభవం అశ్విన్‌ సొంతం. తన పది ఓవర్ల కోటాలో 47 పరుగులు మాత్రమే ఇచ్చిన అశ్విన్‌ కీలకమైన లబుషేన్‌ వికెట్‌ తీశాడు. దీంతో అక్షర్‌ పటేల్‌ లేని లోటును తీర్చేసినట్లే. ఆసీస్‌తో చివరి వన్డే నాటికి అక్షర్‌ పటేల్‌ కోలుకుని వచ్చి జట్టుతోపాటు చేరితేనే ప్రపంచకప్‌ స్క్వాడ్‌లో కొనసాగుతాడు. ఒకవేళ గాయం నుంచి కోలుకోకపోతే మాత్రం అక్షర్‌ స్థానంలో అశ్విన్‌కు మేనేజ్‌మెంట్‌ చోటు కల్పించడం ఖాయం. అందుకే, ఆసీస్తో రెండో వన్డేలోనూ అశ్విన్‌ రాణిస్తే మరో ఆప్షన్‌ వైపు చూసే అవకాశం ఉండదు. ఎందుకంటే యువ స్పిన్‌ ఆల్‌ రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ కూడా రేసులో ఉన్నాడు. కానీ, ఆసియా కప్‌ ఫైనల్‌తోపాటు ఆసీస్‌తో సిరీస్‌కు ఎంపికైనా ఒక్క మ్యాచ్లో ఆడే అవకాశం రాలేదు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular