https://oktelugu.com/

ఇండియా, పాకిస్తాన్ ఫైట్.. చూసి తీరాల్సిందే?

ప్రపంచ క్రికెట్ లో శత్రుదేశాలైన భారత్, పాకిస్తాన్ ఎప్పుడు తలపడినా అది హైఓల్టేజ్ మ్యాచ్ గా కనిపిస్తుంది. ఈ రెండు జట్లు హోరాహోరీగా యుద్ధం చేస్తున్నట్టే తలపడుతాయి. ఈ మ్యాచ్ ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులంతా వేయికళ్లతో చూస్తారు. క్రికెట్ అభిమానులంతా ఈ మ్యాచ్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తారు. ఇటీవల కాలంలో రెండు దేశాల మధ్య వైరం, యుద్ధం, ఉగ్రవాదం కారణంగా ప్రత్యక్ష మ్యాచులు లేకుండా పోయాయి. ఈ రెండు జట్లు ఎప్పుడు తలపడుతాయా? […]

Written By:
  • NARESH
  • , Updated On : August 4, 2021 / 07:15 PM IST
    Follow us on

    India’ 

    ప్రపంచ క్రికెట్ లో శత్రుదేశాలైన భారత్, పాకిస్తాన్ ఎప్పుడు తలపడినా అది హైఓల్టేజ్ మ్యాచ్ గా కనిపిస్తుంది. ఈ రెండు జట్లు హోరాహోరీగా యుద్ధం చేస్తున్నట్టే తలపడుతాయి. ఈ మ్యాచ్ ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులంతా వేయికళ్లతో చూస్తారు. క్రికెట్ అభిమానులంతా ఈ మ్యాచ్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తారు.

    ఇటీవల కాలంలో రెండు దేశాల మధ్య వైరం, యుద్ధం, ఉగ్రవాదం కారణంగా ప్రత్యక్ష మ్యాచులు లేకుండా పోయాయి. ఈ రెండు జట్లు ఎప్పుడు తలపడుతాయా? అన్న ఆసక్తికి తెరదించుతూ తాజాగా భారత్ , పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ తేదిని ఖరారు చేశారు.

    అక్టోబర్ 24న ఈ రెండు జట్లు తలపడనున్నట్టు సమాచారం. అన్ని మ్యాచ్ లషెడ్యూల్ లను ఈనెల రెండో వారంలో ప్రకటించనున్నారు. టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు ఒమన్, యూఏఈలో జరుగనుంది. దీంతో అక్టోబర్ 24న భారత్ , పాకిస్తాన్ మ్యాచ్ ను సెట్ చేసినట్టు సమాచారం.

    గత రెండేళ్లుగా ప్రపంచ పోటీల్లో మాత్రమే ఇండియా, పాకిస్తాన్ తలపడుతున్నాయి. 2019 వన్డే ప్రపంచకప్ లో చివరి సారిగా తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ గెలిచింది. మళ్లీ రెండేళ్ల తర్వాత ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది.