Homeక్రీడలుHockey Asian Champions Trophy 2024: నాడు అట్టారీ సరిహద్దుల్లో వాటర్ బాటిళ్లు అమ్మాడు.. నేడు...

Hockey Asian Champions Trophy 2024: నాడు అట్టారీ సరిహద్దుల్లో వాటర్ బాటిళ్లు అమ్మాడు.. నేడు చైనా చేతిలో ఇండియాను గెలిపించాడు.. ఇదీ భారత హాకీ సంచలనం జుగ్ రాజ్ నేపథ్యం

Hockey Asian Champions Trophy 2024:  ఇటీవల హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీ జరిగింది. ఈ ట్రోఫీ ఫైనల్ లో భారత జట్టు చైనా ను 1-0 తేడాతో ఓడించింది. డిపెండింగ్ ఛాంపియన్ హోదాను సగర్వంగా నిలబెట్టుకుంది.. ఈ విజయానికి ప్రధాన కారణం జుగ్ రాజ్ సింగ్. హాకీ ఫైనల్ లో చైనా ఎత్తులను చిత్తులు చేస్తూ గోల్ సాధించాడు. ఇండియాను గెలిపించాడు. డిపెండింగ్ ఛాంపియన్ హోదాను సగర్వంగా నిలబెట్టాడు. ఏకైక గోల్ చేసి భారత జట్టును గెలిపించిన జుగ్ రాజ్ సింగ్ పై అభినందనలు వ్యక్తం అవుతున్నాయి. అతడిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి మొదలుపెడితే మాజీ క్రీడాకారుల వరకు ప్రశంసిస్తున్నారు.. మంగళవారం సాయంత్రం జరిగిన హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో ఆట 59వ నిమిషంలో జుగ్ రాజ్ సింగ్ గోల్ చేసి భారత జట్టును గెలిపించాడు. ఆతిధ్య చైనా జట్టును ఓడించాడు. దీంతో మోకిలో భారత జాతీయ గీతం ప్రతిధ్వనించింది. భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ ఇచ్చిన పాస్ ను గోల్ గా మలచడంలో జుగ్ రాజ్ విజయవంతమయ్యాడు. ఓవర్ నైట్ స్టార్ గా అవతరించాడు. ఈ సందర్భంగా జుగ్ రాజ్ కుటుంబ నేపథ్యం గురించి జాతీయ మీడియాలో విస్తృతంగా కథనాలు ప్రసారమవుతున్నాయి. వాటి ద్వారా జుగ్ రాజ్ గురించి ప్రపంచానికి తెలిసే అవకాశం కలిగింది.

హమాలీ కుమారుడిగా..

జుగ్ రాజ్ తండ్రి సుఖ్ జీత్ తన కుటుంబంతో కలిసి పాకిస్తాన్ సరిహద్దు గ్రామంలో ఉండేవాడు. అతడు ఒక హమాలీ పని చేసేవాడు. 2019 పుల్వామా దాడి తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుంచి ట్రక్కుల్లో వచ్చే డ్రై ఫ్రూట్ బస్తాలను సుఖ్ జీత్ దించేవాడు. అతడికి జుగ్ రాజ్ సహకరించేవాడు. అయితే అథ్లెటిక్స్ లో జుగ్ రాజ్ సామర్థ్యాన్ని చూసిన కోచ్ నవజీత్ సింగ్.. అతడికి సాన పెట్టడం మొదలుపెట్టాడు. అత్తారిలోని ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలలో జుగ్ రాజ్ కు హాకీ నేర్పించాడు.. ” అతడి వయసులో ఉన్న పిల్లలతో పోల్చితే జుగ్ రాజ్ ఉత్సాహంగా ఉండేవాడు. అతడు బరువులు ఎత్తడం వల్ల శరీరం దృఢంగా ఉండేది. నాకు తెలిసిన ఇంగ్లాండ్, కెనడా స్నేహితుల కు జుగ్ రాజ్ గురించి చెప్పాను. వారు అతడికి సహాయం చేశారు. అలా అతడు ఇంత స్థాయికి ఎదిగాడని” నవజీత్ పేర్కొన్నాడు. మరోవైపు జుగ్ రాజ్ తన కుటుంబ పోషణ కోసం అట్టారి వద్ద పర్యాటకులకు వాటర్ బాటిళ్లు అమ్మేవాడు. జాతీయ జెండాలు విక్రయించేవాడు. రోజు ఉదయం, మధ్యాహ్నం ప్రాక్టీస్ చేసేవాడు.

2005లో జీవితం ఒక్కసారిగా మారిపోయింది

2005లో అప్పటి పంజాబ్ స్పోర్ట్స్ డైరెక్టర్, భారత మాజీ కెప్టెన్ పరిగతి సింగ్ చొరవ చూపడంతో జుగ్ రాజ్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది.. ప్రస్తుతం నేవీ లో ఉన్న జుగ్ రాజ్ యువ ఆటగాళ్ల కోసం కిట్లను తీసుకొస్తాడు.. గోల్ చేసిన అనంతరం భారత్ జట్టు గెలిచింది.. ఆ తర్వాత జుగ్ రాజ్ తనకు ఇష్టమైన ఫ్రూటీ జ్యూస్ తాగాడు. జుగ్ రాజ్ ప్రదర్శన పట్ల అతడి చిన్ననాటి స్నేహితుడు దుగ్గల్ హర్షం వ్యక్తం చేశాడు. ” చిన్నప్పుడు జుగ్ రాజ్ జెండాలు అమ్మేవాడు. అతడికి ఇద్దరు అక్కలు, ఒక సోదరుడు ఉన్నాడు. కుటుంబాన్ని పోషించడంలో అతడి తండ్రికి సహాయపడ్డాడని” దుగ్గల్ వ్యాఖ్యానించాడు.

ఉత్తమ్ సింగ్ హాకీ అకాడమీలో..

2009లో జుగ్ రాజ్ బాబా ఉత్తమ్ సింగ్ నేషనల్ హాకీ అకాడమీలో జుగ్ రాజ్ చేరడంతో అతడి జీవితంలో మరో ఫేజ్ మొదలైంది. కోచ్ బాల్కర్ సింగ్ జుగ్ రాజ్ ఆట తీరును చూసి ఆశ్చర్య పోయేవాడు. అతడి ఆట తీరుని మెరుగుపరిచి ఇంతటి స్థాయి వాడిని చేశాడు. జుగ్ రాజ్ కు హాకీ అంటే చాలా ఇష్టం ఉండేది. చివరికి రాత్రి పడుకునే సమయంలోను హాకీ కిట్ తన తలపక్కనే పెట్టుకునే వాడు. నెహ్రూ కప్ లో భారత జట్టు విజయం సాధించిన తర్వాత జుగ్ రాజ్ కు BAS కంపెనీకి చెందిన కిట్ అతడికి లభించింది. అయినప్పటికీ అతడు తన పాత కిట్ ను మర్చిపోలేదు. దానికి ఎంతో విలువ ఇచ్చేవాడు. చైనా పై గోల్ చేసి టీమ్ ఇండియా ను గెలిపించిన జుగ్ రాజ్ హాకీ జట్టులో సంచలన ఆటగాడిగా మారిపోయాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular