https://oktelugu.com/

IND vs SL: ఆఖరి టీ20కి ముందు భారత్ కు మరో షాక్

  శ్రీలంకతో తలపడుతున్న యువ భారత్ కు ఏదీ కలిసి రావడం లేదు. కష్టాల మీద కష్టాలు వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే కృనాల్ పాండ్యాకు కరోనా సోకి అతడితోపాటు 8 మంది కీలక ఆటగాళ్లు క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. దీంతో 6 బౌలర్లతో బరిలోకి దిగిన టీమిండియా రెండో టీట్వంటీలో బలం సరిపోక ఓడిపోయింది. ఇక ఈరోజు జరిగే ఫైనల్ టీ20 కు ముందు టీమిండియాకు మరో షాక్ తగిలింది. రెండో టీ20 సందర్భంగా టీమిండియా స్టార్ పేసర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : July 30, 2021 10:46 am
    Follow us on

     

    శ్రీలంకతో తలపడుతున్న యువ భారత్ కు ఏదీ కలిసి రావడం లేదు. కష్టాల మీద కష్టాలు వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే కృనాల్ పాండ్యాకు కరోనా సోకి అతడితోపాటు 8 మంది కీలక ఆటగాళ్లు క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. దీంతో 6 బౌలర్లతో బరిలోకి దిగిన టీమిండియా రెండో టీట్వంటీలో బలం సరిపోక ఓడిపోయింది.

    ఇక ఈరోజు జరిగే ఫైనల్ టీ20 కు ముందు టీమిండియాకు మరో షాక్ తగిలింది. రెండో టీ20 సందర్భంగా టీమిండియా స్టార్ పేసర్ నవదీప్ సైనీ గాయపడ్డ సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు బీసీసీఐ వైద్య బృందం పరిశీలనలో ఉన్నాడు. నిన్నటి మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ సైనీ భుజానికి గాయమైంది. అతడు అప్పుడే మ్యాచ్ మధ్యలోంచి వైదొలిగాడు.

    గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో నేటి ఫైనల్ టీ20 నుంచి నవదీప్ సైనీ తప్పుకున్నట్టు టీమిండియా తెలిపింది. అసలే ఆటగాళ్లు లేక సతమతమవుతున్న యువ జట్టుకు సైనీ తప్పుకోవడంతో మరింత ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం 11 మంది కూడా అందబాటులో లేరు. కరోనా కారణంగా 9 మంది క్వారంటైన్ లో వెళ్లిపోయారు.

    నిన్నటి మ్యాచ్ కు స్టాండ్ బై ఆటగాళ్లతో బరిలోకి దిగిన టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. ఇక ఈ ఫైనల్ లో నెట్ బౌలర్ గా ఉన్న తమిళనాడు లెఫార్మ్ స్పిన్నర్ సాయి కిషోర్ కు చాన్స్ దక్కే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక అర్షదీప్ లాంటి బౌలర్ మాత్రమే టీమిండియాకు మిగిలి ఉన్నాడు. ఇంతటి ఆటగాళ్ల కొరతతో టీమిండియా ఎలా పోరాడుతుందనేది వేచిచూడాలి.