IND Vs SA World Cup Final: ఎన్నో ఆటుపోట్లు.. మరెన్నో ఇబ్బందులు ఎదుర్కొని టీం ఇండియా వన్డే వరల్డ్ కప్ ఫైనల్ దాకా వచ్చేసింది. సెమి ఫైనల్ మ్యాచ్లో బలమైన ఆస్ట్రేలియా జట్టును ఓడించింది. అది కూడా క్రికెట్ వన్డే చరిత్రలోనే అతిపెద్ద టార్గెట్ ను ఫినిష్ చేసింది. అత్యంత బలమైన ఆస్ట్రేలియా బౌలింగ్ ను కకావికలం చేసింది. ఇప్పుడు ఇక ట్రోఫీ వేటలో పడింది. లీగ్ దశలో దక్షిణాఫ్రికా జట్టుతో ఎదురైన ఓటమికి గట్టి బదులు తీర్చుకోవాలని టీమ్ ఇండియా భావిస్తోంది.
సొంత మైదానంలో ఫైనల్ మ్యాచ్ ఆడుతుండడం.. సొంత ప్రేక్షకుల బలం విపరీతంగా ఉండడంతో భారత జట్టు టైటిల్ ఫేవరెట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. పైగా కెప్టెన్ నుంచి మొదలు పెడితే జెమీమా వరకు సూపర్ ఫామ్ లో ఉన్నారు. బౌలింగ్లో చరణి నుంచి మొదలుపెడితే రాధా యాదవ్ వరకు దుమ్ము రేపుతున్నారు. మొత్తంగా చూస్తే ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు నుంచి అద్భుతమైన ప్రదర్శన ఆశించవచ్చు. టీమ్ ఇండియా 2005, 2017లో వన్డే వరల్డ్ కప్ ఫైనల్ దాకా వెళ్ళింది. ఒకసారి ఆస్ట్రేలియా చేతిలో.. మరొకసారి ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. అయితే ఈసారి అలాంటి ఓటమికి అవకాశం ఇవ్వకుండా టీమిండియా బలమైన అడుగులు వేయాలని అభిమానులు భావిస్తున్నారు.
దక్షిణాఫ్రికా జట్టు లో కెప్టెన్ లారా భీకరమైన ఫామ్ లో ఉంది. ముఖ్యంగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో సూపర్ సెంచరీ తో అదరగొట్టింది. బ్యాటింగ్ బాగానే మొత్తం తను ఒక్కతే ఏమొస్తుంది. బౌలింగ్ లో మారి జాన్ కాప్ సత్తా చూపించింది. కాప్ బౌలింగ్ ను టీమ్ ఇండియా ప్లేయర్లు సమర్థవంతంగా ఎదుర్కుంటే ఇబ్బంది ఉండదు. మరోవైపు దక్షిణాఫ్రికా ప్లేయర్లు స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ టీమ్ ఇండియా స్పిన్ బౌలర్లు సత్తా చూపిస్తే ఫైనల్ మ్యాచ్లో ఫలితం అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది.
ఫైనల్ మ్యాచ్ జరిగే ముంబై నగరంలో వర్షం పడుతోంది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ కు కూడా వర్షం ముప్పు ఉంది. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం సాయంత్రం వర్షం కురిసే అవకాశం ఉంది. ఫైనల్ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగిస్తే రిజర్వ్ డే ఉంది. వర్షం వల్ల మ్యాచ్ రద్దు అయితే తర్వాతి రోజు మ్యాచ్ నిర్వహిస్తారు. ఆట గనక ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచి మరుసటి రోజు కొనసాగిస్తారు.
తుది జట్లు ఇవే
భారత్: హర్మన్ (కెప్టెన్), దీప్తి, రిచా, అమన్, రాధా/ స్నేహ్, శ్రీ చరణి, క్రాంతి, రేణుక, స్మృతి, జెమిమా, షఫాలి.
దక్షిణాఫ్రికా: లారా(కెప్టెన్), తజ్మిన్, బోష్, లూజ్, కాప్, సీసాలో జప్టో, ట్రయాన్, డి క్లెర్క్, ఖాఖా, ఎం లాబా.