Marco Jansen bowling: గుహవాటి మైదానంలో సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు అదరగొట్టిన వేళ.. టీమిండియా బ్యాటర్లు తేలిపోతున్నారు. భీకరమైన బ్యాటర్లుగా పేరుపొందిన జూరెల్ (0), రవీంద్ర జడేజా (6), నితీష్ కుమార్ రెడ్డి (10), రిషబ్ పంత్(7) దారుణంగా విఫలమయ్యారు. వాస్తవానికి ఈ నలుగురు సమర్థవంతంగా ఆడుతారు.. కానీ బౌన్సర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడతారు.. సరిగా ఆ లోపాన్ని గుర్తించిన యాన్సన్ అదే తీరుగా బంతులు వేశాడు.. చూస్తుండగానే ఇండియా బ్యాటింగ్ లైన్ అప్ మొత్తాన్ని సర్వనాశనం చేశాడు.
యాన్సన్ దాదాపు 6 ఫీట్ల ఏడు ఇంచుల ఎత్తు ఉంటాడు. బంతిని అద్భుతంగా బౌన్స్ చేస్తాడు. ముఖ్యంగా జీవంలేని పిచ్ మీద బంతిని రకరకాలుగా తిప్పడంలో ఇతడి తర్వాతే ఎవరైనా. అందువల్లే దక్షిణాఫ్రికా జట్టు టీమిండియాతో టెస్ట్ సిరీస్ అనగానే ఇతడికి అవకాశం ఇచ్చింది. పైగా ఇతడికి ఐపీఎల్ లో పంజాబ్ జట్టులో ఆడిన అనుభవం ఉంది.. ఆ అనుభవం ప్రస్తుత టెస్ట్ సిరీస్ లో విపరీతంగా ఉపయోగపడుతుంది. టీమిండియా బౌలర్ల లోపం, బ్యాటర్ల వీక్నెస్ తెలుసుకున్న యాన్సన్ గుహవాటి పిచ్ మీద సంచలనం సృష్టిస్తున్నాడు. బ్యాటింగ్ లో తొమ్మిదవ నెంబర్ స్థానంలో వచ్చిన అతడు 93 పరుగులు చేశాడు. అంతేకాదు బౌలింగ్లో కీలకమైన నాలుగు వికెట్లను పడగొట్టాడు. అతడు ఈ స్థాయిలో సత్తా చూపించడానికి ప్రధాన కారణం డెల్ స్టెయిన్.
గుహవాటి పిచ్ మీద మూడవరోజు ఆట ప్రారంభానికి ముందు డెల్ స్టెయిన్ గంటల తరబడి యాన్సన్ తో మాట్లాడాడు. బంతులు ఎటువైపు వేయాలి? బౌన్సర్లు ఏ దిశలో సంధించాలి? ఏ బ్యాటర్ కు ఎలా వేస్తే ఇబ్బంది పడతాడు? ముఖ్యంగా పంత్ ను ఎలా బోల్తా కొట్టించాలి? అనే విషయాలపై సుదీర్ఘంగా అతడికి హితబోధ చేశాడు. అతడు చెప్పినట్టుగానే యాన్సన్ బంతులు వేశాడు. దానికి తగ్గట్టుగానే ఇండియన్ బ్యాటర్లు బ్యాట్లు ఎత్తేశారు. ఫలితంగా టీమ్ ఇండియా వెంట వెంటనే కోల్పోయింది. ముఖ్యంగా చివరి ఆరు వికెట్లను కేవలం 40 కోల్పోవడం విశేషం. డెల్ స్టెయిన్ కు ఇండియన్ పిచ్ ల మీద విపరీతమైన అనుభవం ఉంది. అందువల్లే తన అనుభవాన్ని యాన్సన్ కు చెప్పాడు. దానిని యాన్సన్ పాటించాడు.
Dale Steyn had a brief chat with Marco Jansen earlier this morning. pic.twitter.com/JRwtXRhv9D
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 24, 2025