
ఇండియా, ఇంగ్లండ్ ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండు జట్ల బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. కానీ భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ మాత్రమే అడ్డంగా నిలబడ్డాడు. సెంచరీని తృటిలో మిస్ చేసుకున్నాడు. ఇంగ్లండ్ పై ఇండియా లీడ్ లోకి రావడానికి రాహుల్ ఆడిన ఇన్నింగ్స్ యే కారణం..
అయితే కేఎల్ రాహుల్ ఆటతో విసిగిపోయిన ఇంగ్లండ్ బౌలర్లు అతడిని కవ్వించే ప్రయత్నంచేశారు. రాహుల్ ను ఔట్ చేసేందుకు ఇంగ్లండ్ బౌలర్లు తీవ్రంగా ప్రయత్నించారు. చివరకు మాటల దాడికి దిగారు.
కేఎల్ రాహుల్ 57 పరుగుల వద్ద ఉన్నప్పుడు రాబిన్ సన్ మాటల యుద్ధానికి దిగాడు. రాహుల్ భుజాన్ని ఢీకొడుతూ వెళ్లాడు. దీనికి కేఎల్ రాహుల్కూడా ఘాటుగానే సమాధానమిచ్చాడు. వీరిద్దరి మధ్య మైదానంలో సాగిన ఈ ఫైట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇంగ్లండ్ తో తొలి ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ 84 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో 11.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 25/0తో ఆడుతోంది. వర్షం అంతరాయంతో మ్యాచ్ ముగిసింది.
https://twitter.com/rishobpuant/status/1423603872031932424?s=20