
బ్రిటీష్ వారిపై బ్రిటీష్ దేశంలో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ క్రికెట్ జట్టు ఆధిక్యంలోకి వచ్చింది. ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ మన భారత బ్యాట్స్ మెన్ పరుగులు సాధించారు. ముఖ్యంగా ఓపెనర్ కేఎల్ రాహుల్ 84, జడేజ 56 పరుగులతో రాణించడంతో పాటు చివర్లో బుమ్రా 28 ధాటిగా ఆడడంతో తొలి టెస్టులో ఇండియా లీడ్ లోకి వచ్చింది.
ఇక ఇంగ్లండ్ బౌలర్లు భారత వికెట్లు తీయడానికి చెమటోడ్చారు. రాబిన్ సన్ 5 వికెట్లు తీయగా.. అండర్సన్ నాలుగు వికెట్లు తీశాడు. కోహ్లీ డకౌట్ కాగా.. పూజారా 4, రహానే 5కే ఔట్ అయ్యి పూర్తిగా నిరాశపరిచాడు. ఇక అండర్సన్ టెస్టుల్లో స్పిన్నర్ కుంబ్లే 619 వికెట్ల రికార్డును ఈ మ్యాచ్ లో బద్దలు కొట్టాడు.
శుక్రవారం 125/4 వికెట్లతో మూడో రోజు ఆట ఆరంభించిన టీమిండియా మరో 153 పరుగులు చేసి మిగిలిన వికెట్లను కోల్పోయింది. వర్షం అంతరాయం కలిగిస్తున్న మ్యాచ్ లో రాహుల్, పంత్ నెమ్మదిగా ఆడుతూ జోరు పెంచారు. చివరలో జడేజా ఆఫ్ సెంచరీకి తోడు బుమ్రా మెరుపులతో భారత్ కు 95 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. మ్యాచ్ పై పట్టు బిగించింది.
ఇక రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ జట్టు ఓపెనర్లు ఆచితూచి ఆడుతున్నారు. 5 ఓవర్లకు 11 పరుగులే చేసి పోరాడుతున్నారు.