Azam Khan: క్రికెట్ లో ఆటగాడు ఎంత చురుకుగా ఉంటే.. అంత మెరుగ్గా రాణించగలడు. లేకుంటే అది జట్టు విజయావకాశాలను ప్రభావితం చేస్తుంది. అందుకే క్రికెట్ లో ఫిట్ నెస్ కు ప్రాధాన్యమిస్తారు. ఆస్ట్రేలియా, ఇండియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ వంటి క్రికెట్ బోర్డులు ప్రత్యేక అకాడమీలు నిర్వహిస్తుంటాయి. ఇక్కడ ఆటగాళ్లకు ఫిట్ నెస్ తో పాటు ఇతర పరీక్షల నిర్వహిస్తుంటాయి. అందులో ఓకే అయితేనే టోర్నీలకు ఎంపిక చేస్తాయి. మిగతా క్రికెట్ బోర్డులు ఈ స్థాయిలో కాకున్నా.. వాటి ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఆటగాళ్లకు అకాడమీలను కొనసాగిస్తుంటాయి. కానీ అదేం దురదృష్టమో.. లేక నిర్లక్ష్యమో.. పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఫిట్ నెస్ సరిగ్గా లేని ఆటగాడిని ఇంగ్లాండ్ జట్టుతో టీ20 టోర్నీకి ఎంపిక చేసింది. ఇంగ్లీష్ దేశంలో పరువు పోగొట్టుకుంది.
పాకిస్తాన్ జట్టు 4 t20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ దేశంలో పర్యటిస్తోంది. రెండు టీ20లు వర్షం వల్ల రద్దయ్యాయి. మిగతా రెండు మ్యాచ్ లను ఇంగ్లాండ్ గెలుచుకుంది. ఆ రెండు మ్యాచ్ లలో చివరి t20 లో ఇంగ్లాండ్ గెలిచింది అనే దానికంటే.. పాకిస్తాన్ చేజేతులా ఓడిపోయిందనడం సబబు. ముఖ్యంగా గురువారం జరిగిన చివరి t20 మ్యాచ్లో పాకిస్తాన్ వికెట్ కీపర్ అజాం ఖాన్ అవుట్ అయిన తీరు విమర్శలకు దారితీస్తోంది. అటు వికెట్ కీపింగ్, ఇటు బ్యాటింగ్ లో అతడు పూర్తిగా విఫలమయ్యాడు. పాకిస్తాన్ జట్టుకు ఓటమికి కారణమయ్యాడు. అతడు అవుటైన తీరు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ కు కారణమవుతోంది..
Absolute savagery from Mark Wood #EnglandCricket | #ENGvPAK pic.twitter.com/zrrksjNF95
— England Cricket (@englandcricket) May 30, 2024
గురువారం జరిగిన ఆఖరి t20 మ్యాచ్లో పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేసింది. 19.5 ఓవర్లలో 157 రన్స్ కు ఆల్ అవుట్ అయింది. పాకిస్తాన్ ఆటగాళ్లలో ఉస్మాన్ ఖాన్ 38, బాబర్ అజాం 36 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో లివింగ్ స్టోన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఆర్చర్, జోర్డాన్, మోయిన్ అలీ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.. పాకిస్తాన్ విధించిన ఈ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ కేవలం మూడు వికెట్లు కోల్పోయి, 15.3 ఓవర్లలో చేదించింది.. హరీస్ రౌఫ్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 45, బట్లర్ 39, బెయిర్ స్టో 28*, బ్రూక్ 17 పరుగులు చేసి, ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
అయితే ఈ మ్యాచ్లో పాకిస్తాన్ వికెట్ కీపర్ అజాం ఖాన్ దారుణమైన తప్పులు చేశాడు. ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఫిలిప్ సాల్ట్, జాక్స్ ఇచ్చిన క్యాచ్ లను నేలపాలు చేశాడు. భారీ కాయంతో అజాం ఖాన్ చురుకుగా కదల లేకపోయాడు.. మహమ్మద్ రిజ్వాన్ ఆశించినంత వేగంతో కీపింగ్ చేయడం లేదనే ఆజాం ఖాన్ కు అవకాశం ఇచ్చారు. కానీ వికెట్ కీపింగ్ లో అతడు కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. అంతేకాదు బ్యాటింగ్ లోనూ ఇంగ్లాండ్ బౌలర్ మార్క్ వుడ్ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసి, దారుణంగా అవుట్ అయ్యాడు. “అతన్ని వికెట్ కీపర్ గా పెట్టుకుంటే అంతే సంగతులని” సోషల్ మీడియాలో అజాం ఖాన్ పై ట్రోల్స్ మోత మోగుతోంది.
Azam Khan is an embarrassment to international cricket pic.twitter.com/Ferp0ys5nf
— yang goi (@GongR1ght) May 30, 2024