Rohit Sharma: సమకాలీన క్రికెట్లో రోహిత్ శర్మ అద్భుతమైన ఆటగాడు. ప్రస్తుతం అతడు వన్డేలలో మాత్రమే కొనసాగుతున్నాడు. ఇటీవల టెస్ట్, గత ఏడాది టీ20 లకు అతడు వీడ్కోలు పలికాడు. వన్డేలలో మాత్రం అదరగొడుతున్నాడు. బీభత్సంగా బ్యాటింగ్ చేస్తూ దుమ్మురేపుతున్నాడు. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో వీర విహారం చేసిన అతడు.. ఆస్ట్రేలియా టూర్ లో కూడా అదే స్థాయిలో అదరగొట్టాడు.
ఆస్ట్రేలియా మీద జోర్దార్ ఇన్నింగ్స్ ఆడిన నేపథ్యంలో రోహిత్ శర్మ ఒక్కసారిగా తన ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్ లో ఏకంగా మొదటి స్థానానికి చేరుకున్నాడు. దీంతో అతని అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదే సమయంలో గౌతమ్ గంభీర్ మీద విమర్శలు వచ్చాయి. గౌతమ్ గంభీర్ రోహిత్ శర్మను సరిగ్గా వాడుకోలేకపోయాడని.. పైగా అతడిని టెస్ట్ ఫార్మేట్ నుంచి తప్పించాడని.. ఇప్పుడు రోహిత్ బుల్లెట్ తరహాలో బ్యాటింగ్ చేస్తున్నాడని.. 37 సంవత్సరాల వయసులోనూ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడని అభిమానులు పేర్కొన్నారు. గౌతమ్ గంభీర్ తీరును ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో విమర్శలు చేశారు.
నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న రోహిత్ శర్మకు ఐసిసి ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ షాక్ కలిగించాయి. రోహిత్ వన్డేలలో తన నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోయాడు. మొదటి స్థానంలోకి న్యూజిలాండ్ ఆటగాడు మిచెల్ వచ్చాడు. 782 పాయింట్లతో అతడు అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.. 781 పాయింట్లతో రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ జట్టు తరఫున పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో నెంబర్ వన్ స్థానాన్ని సాధించిన రెండవ ఆటగాడిగా మిచెల్ రికార్డు సృష్టించాడు. చివరిసారిగా 1979లో న్యూజిలాండ్ జట్టు తరఫున టర్నర్ నెంబర్ వన్ ర్యాంక్ సాధించాడు. జోర్డాన్, గిల్, విరాట్ కోహ్లీ, బాబర్, ట్విట్టర్ టెక్టర్, అయ్యర్, అసలంక, హోఫ్ మూడు నుంచి 10 స్థానాలలో కొనసాగుతున్నారు.
రోహిత్ ప్రస్తుతం కుటుంబంతో కలిసి విహారయాత్రలో ఉన్నాడు. ఇటీవల తన కుమారుడి మొదటి జన్మదిన వేడుకను జరిపాడు రోహిత్. త్వరలో స్వదేశం వేదికగా జరిగే వన్డే సిరీస్ లో అతడు ఆడబోతున్నాడు. చాలా రోజుల తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడిన అతడు పూర్వపు ఫామ్ అందుకున్నాడు. తన సత్తా ఏమిటో నిరూపించాడు. ఇప్పుడు అతడు వెకేషన్ పూర్తయిన తర్వాత వన్డే జట్టులోకి ప్రవేశిస్తాడు. సౌత్ ఆఫ్రికా జుట్టుతో జరిగే వన్డే సిరీస్లో టీమిండియా తరఫున ఆడతాడు.