Odi World Cup 2023: ఎప్పుడూ లేనంతగా టీమిండియా బౌలింగ్ అంత స్ట్రాంగ్ గా ఎలా తయారయింది..?

ఒకప్పుడు ఇండియన్ టీం లో పేస్ బౌలింగ్ చేయాలి అంటే జహీర్ ఖాన్ పేరు ఎక్కువగా వినిపించేది. జహీర్ ఖాన్ అద్భుతమైన బౌలింగ్ తో ఇండియన్ టీం కి చాలా విజయాల్ని కూడా అందించాడు.

Written By: Gopi, Updated On : November 3, 2023 10:33 am

Odi World Cup 2023

Follow us on

Odi World Cup 2023: 2023 వరల్డ్ కప్ లో భాగంగా నిన్న ఇండియా, శ్రీలంకతో ఆడిన మ్యాచ్ లో భారీ విజయాన్ని అందుకొని అఫీషియల్ గా సెమీఫైనల్ కి క్వాలిఫై అయింది. ఇక ఈ క్రమంలో ఇండియా 7 వ విజయాన్ని దక్కించుకుంది.ఇక 2015 వ సంవత్సరంలో ధోనీ కెప్టెన్ గా ఉన్నప్పుడు వరుసగా 7 విజయాలను సాధించాడు ఇక ఇప్పుడు రోహిత్ శర్మ ఈ ఘనతని సాధించాడు. ఇక ధోనీ తర్వాత రోహిత్ శర్మ ఈ ఘనత సాధించిన రెండోవ ఇండియన్ కెప్టెన్ గా పేరు సంపాదించుకున్నాడు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఇండియన్ టీం వరల్డ్ కప్ లో ఎవ్వరు ఊహించని విధంగా అద్భుతమైన రీతిలో పెర్ఫార్మన్స్ ఇస్తూ అటు బ్యాటింగ్ లోను, ఇటు బౌలింగ్ లోను చాలా వరకు స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఒక సంవత్సరం కిందటి వరకు కూడా ఇండియన్ టీం బౌలింగ్ లో చాలా వరకు తడబడుతూ ఉండేది ఎంత బాగా బ్యాటింగ్ చేసినప్పటికీ బౌలింగ్ లో మాత్రం కొంచెం వీక్ గా కనిపించేది.కానీ ఇప్పుడు ఇండియన్ టీం బ్యాటింగ్ లో ఎంత పవర్ఫుల్ గా ఉందో బౌలింగ్ లో అంతకుమించి పవర్ఫుల్ గా కనిపిస్తుంది. గత ఆరు నెలలు గా చూసుకుంటే ఇండియన్ టీమ్ బౌలింగ్ లో అద్భుతాలు క్రియేట్ చేస్తూ వస్తుంది…అయితే దీని అంతటికి కారణం ఏంటి, ఇండియన్ బౌలింగ్ ఇంత స్ట్రాంగ్ గా కావడానికి రీజన్ ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…

ఒకప్పుడు ఇండియన్ టీం లో పేస్ బౌలింగ్ చేయాలి అంటే జహీర్ ఖాన్ పేరు ఎక్కువగా వినిపించేది. జహీర్ ఖాన్ అద్భుతమైన బౌలింగ్ తో ఇండియన్ టీం కి చాలా విజయాల్ని కూడా అందించాడు. అప్పుడు ప్రపంచ నెంబర్ వన్ బౌలర్ గా కొనసాగే ఆస్ట్రేలియన్ పేస్ బౌలర్ బ్రెట్లీ లాంటి బౌలర్ కి సైతం పోటీని ఇస్తూ జహీర్ ఖాన్ వాళ్ళ సరసన నిలిచాడు.ఇక ఆ తర్వాత అలాంటి బౌలర్లు ఇండియన్ టీం లోకి వచ్చినప్పటికీ వాళ్లు కొంతవరకు మాత్రమే వాళ్ల ప్రభావాన్ని చూపించారు. కానీ ప్రస్తుతం ఉన్న ఇండియన్ టీమ్ బౌలర్లు ప్రపంచ దేశాల క్రికెట్ టీం లో ఏ టీం లో లేని విధంగా తయారయ్యారు.

ప్రపంచంలోనే దిగ్గజ బ్యాట్స్ మెన్స్ ,బౌలర్లను కలిగి ఉన్న ఆస్ట్రేలియా లాంటి టీం కూడా ఇండియన్ టీం బౌలర్లు చూపిస్తున్న ప్రతిభకు ఫిదా అయిపోయింది. వాళ్ళ మాజీ కెప్టెన్ అయిన రికీ పాంటింగ్ సైతం ఇండియన్ టీం బౌలింగ్ అద్భుతంగా ఉంది. ప్రపంచ దేశాల క్రికెట్ టీములు ఏవి కూడా ఇండియన్ టీం బౌలింగ్ ముందు పనికిరావు అనే కామెంట్లను కూడా చేశాడు అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇండియన్ టీం బౌలింగ్ డెప్త్ ఎంతవరకు మెరుగైందనేది… ఇక ఈ వరల్డ్ కప్ లో అనుకోకుండా టీమ్ లోకి వచ్చిన మహమ్మద్ షమీ గురించి ప్రత్యేకంగా చెప్పాలి.ఎందుకంటే మూడు మ్యాచ్ ల్లో 14 వికెట్లు తీసి ప్రపంచ చరిత్రలోనే ఏ ప్లేయర్ కు సాధ్యం కానీ రికార్డ్ ను నెలకొల్పాడు. మూడు మ్యాచ్ ల్లో రెండుసార్లు 5 వికెట్లు తీయడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి ఘనతని సాధించి చూపించాడు…

ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఇండియన్ టీం బౌలింగ్ లో ఇంత డెప్త్ రావడానికి కారణం ఏంటి అంటే ఒకప్పుడు ఇండియన్ టీమ్ కి ఎదురైన పరిస్థితులే మన టీమ్ ను చాలా స్ట్రాంగ్ గా మార్చాయి.అంటే ఒకప్పుడు బ్యాట్స్ మెన్స్ ఎక్కువ బ్యాటింగ్ చేస్తూ టీం కి అద్భుతమైన స్కోర్ అందించేవారు కానీ బౌలర్లు ఆ స్కోర్ ని కాపాడుతూ ప్రత్యర్థి బ్యాట్స్ మెన్స్ ని కట్టడి చేస్తు టీంకు విజయాన్ని అందించడంలో చాలా వరకు వెనుకబడిపోయేవారు. ఇలాంటి సమయం లో ఐపీఎల్ అనేది మన బౌలర్లలో ఉన్న కాన్ఫిడెంట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది అనే చెప్పాలి. తక్కువ ఓవర్లలో బ్యాట్స్ మెన్స్ ని కట్టడి చేస్తూ వాళ్ళకి ఏ స్పెల్ వేయాలి ఎలా వేస్తే వాళ్ళని కట్టడి చేయగలం అనే మెళుకువలు నేర్చుకోవడానికి ఐపిఎల్ అనేది కూడా చాలా వరకు ప్లస్ అయింది…

ఇక ఐపిఎల్ లో వాళ్ల బౌలింగ్ తో అద్భుతాన్ని క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి ప్లేయర్ కూడా ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ ని కట్టడి చేయడం ఎలా అనేదానిమీద ఫోకస్ చేసి అద్భుతంగా బౌలింగ్ చేయడం స్టార్ట్ చేశారు అందుకే ఇండియన్ టీం లో ఉన్న చాలామంది బౌలర్లు ప్రత్యర్థి బ్యాట్స్ మెన్స్ వికెట్ తీయడమే కాకుండా డాట్ బాల్స్ ఎక్కువగా వేసేందుకు ప్రిఫరెన్స్ ని చూపిస్తున్నారు.ఒక బ్యాట్స్ మెన్ ని ఇన్ స్వింగర్ వేస్తు, ఔట్ స్వింగార్ వేస్తూ , కటర్స్ వేస్తూ వాళ్ల మీద ప్రెజర్ పెరగేలా చేస్తూ వాళ్లని అవుట్ చేయడంలో భారత బౌలర్లు చాలా ముందు వరుసలో ఉంటున్నారు. బౌలర్లలో కూడా ఇండియన్ టీమ్ దగ్గర ఒక అరడజన్ బౌలర్లు అద్భుతంగా స్పెల్ వేసే బౌలర్లు ఉన్నారు.అందులో బుమ్రా, మహమ్మద్ షమీ,మహమ్మద్ సిరాజ్ లాంటి టాప్ క్లాస్ బౌలర్లు ఉండడం ఇండియా చేసుకున్న అదృష్టమనే చెప్పాలి.మొన్నటి దాకా బుమ్రా ఒక్కడే అద్భుతమైన స్పెల్ వేయగలడు అని పేరు సంపాదించుకున్నారు కానీ షమీ , సిరాజ్ లు ఎవరి ఊహలకు అందని విధంగా వాళ్ల బౌలింగ్ లో వైవిధ్యాన్ని చూపిస్తూ బ్యాట్స్ మెన్స్ ఎక్స పెక్ట్ చేయకుండా బాల్ తో మ్యాజిక్ లు చేస్తూ ప్రత్యర్థిని భయపెడుతూ బౌలింగ్ చేస్తున్నారు…

ఒకప్పుడు టాప్ క్లాస్ బౌలర్ గా చెప్పుకునే మన జహీర్ ఖాన్ వరల్డ్ కప్ లో 23 మ్యాచ్ ల్లో 44 వికెట్లు తీశాడు,కానీ మహమ్మద్ షమీ మాత్రం 14 మ్యాచుల్లోనే 45 వికెట్లు తీసి తన బౌలింగ్ లో ఉన్న డెప్త్ ని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు… ఇక ఇండియన్ టీం బౌలింగ్ విభాగంలో అసలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే బ్యాకప్ లో 5,6 పేసర్లు ఉన్నారు. ఇక ఇండియన్ టీమ్ బౌలింగ్ లో స్ట్రాంగ్ అవ్వడానికి ముఖ్య కారణం మాత్రం ఐపిఎల్ అనే చెప్పాలి దీని ద్వారానే అందరికీ అవకాశం రావడం తో అందరూ చాలా బాగా పెర్ఫాం చేస్తూ ఇండియన్ టీమ్ లో చోటు సంపాదించుకున్నారు. ఎప్పుడైతే ఐపిఎల్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇండియన్ టీమ్ లోకి టాలెంటెడ్ బౌలర్లు రావడం జరిగింది…