Shubman Gill: వరల్డ్ కప్ లో భాగం గా ఇండియా రేపు ఆస్ట్రేలియా తో ఒక భారీ మ్యాచ్ ఆడుతుంది.ఇక ఇందులో భాగంగానే గత రెండు మూడు రోజుల నుంచి మొదటి మ్యాచ్ కి గిల్ దూరం అవుతున్నాడు అంటూ చాలా రకాలైన వార్తలు వస్తున్నాయి కారణం ఏంటి అంటే ఆయన కి డెంగ్యూ ఫీవర్ రావడం తో ఆయన హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు గా తెలుస్తుంది.అయితే గిల్ ప్లేస్ లో ఇషాన్ కిషన్ ని తీసుకొని ఆయన చేత ఓపెనర్ గా ఆడిస్తారు అంటూ వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీం హెడ్ కోచ్ అయిన రాహుల్ ద్రావిడ్ మాత్రం ఇండియన్ క్రికెట్ అభిమానులందరికి ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది.
అది ఏంటి అంటే శుభ్ మన్ గిల్ కోలుకున్నాడు రేపు జరగబోయే మ్యాచ్ కి అందుబాటులో ఉంటాడు అంటూ చెప్పడం జరిగింది. దింతో ఇండియన్ క్రికెట్ అభిమానులందరూ కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఇండియన్ టీం లో ఎంతమంది మంచి ప్లేయర్లు ఉన్న కూడా ప్రస్తుతం గిల్ ఉన్న ఫామ్ కి ఆయన టీం లో ఉండటం చాలా అవసరం.ఆయన ఈ వరల్డ్ కప్ లో కొన్ని మ్యాచ్ లని సైతం డిసైడ్ చేసేంత కెపాసిటీ ఉన్న ప్లేయర్ అంటూ చాలా మంది క్రికెట్ అభిమానులు కూడా చెప్తున్నారు.
ఇక ఆస్ట్రేలియా మ్యాచ్ లో మన ప్లేయర్లు అద్భుతం చేయాలి అలాగైతేనే ఇండియా ఘనమైన ఒక విక్టరీ ని నమోదు చేస్తుంది. ఇక రాహుల్ ద్రావిడ్ మాట్లాడుతూ మొదటి మ్యాచ్ చెన్నై లోని చిదంబరం స్టేడియం లో ఉండటం వల్ల ఆ పిచ్ పరిస్థితి ని బట్టి ప్లేయర్లని తీసుకుంటాం అంటూ ద్రావిడ్ మాట్లాడటం జరిగింది.ఇక ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఆల్రెడీ న్యూజిలాండ్ టీం ఒక మ్యాచ్ గెలిచింది. కాబట్టి ఇక ఇండియా కూడా ఒక మ్యాచ్ గెలిచి టాప్ పొజిషన్ కి చేరుకోవాలని చూస్తుంది.ఇక ఈ టీముల్లో టాప్ లో ఉన్న నాలుగు టీములు మాత్రమే సెమిస్ కి వెళ్తాయి. ఇక మిగిలిన టీములు అన్ని కూడా ఇంటికి వెళ్లి పోవాల్సిందే…
ఇక ఇండియా వరుసగా 8 వ తేదీన ఆస్ట్రేలియాతో ఒక మ్యాచ్ ఆడుతుండగా,11 వ తేదీన ఆఫ్గనిస్తాన్ తో ఒక మ్యాచ్ ఆడనుంది,అలాగే 14 వ తేదీన చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ తో కూడా ఒక మ్యాచ్ ఆడుతుంది.ఇలా ఒక వారం రోజుల్లోనే ఇండియా మూడు మ్యాచ్ లు ఆడనుంది.అందుకే ఇప్పుడు ఇండియా టీం ఈ మూడు మ్యాచుల్లో గెలిస్తే ఇక సెమిస్ కి వెళ్లడం చాలా ఈజీ అవుతుందనే చెప్పాలి…