GT vs PBKS : క్రికెట్లో ఏదైనా జరుగుతుంది. అప్పటిదాకా బ్యాటింగ్ కు సహకరించిన మైదానం ఒక్కసారిగా బంతివైపు టర్న్ అవుతుంది. అప్పటిదాకా బౌలింగ్ కు స్వర్గధామంలా మారిన స్టేడియం ఒక్కసారిగా బ్యాటింగ్ వైపు మళ్ళుతుంది.. గురువారం నాడు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్, పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లోనూ ఇదే తరహా సీన్ ఆవిష్కృతమైంది. ఈ మ్యాచ్లో భాగంగా ముందుగా టాస్ గెలిచి పంజాబ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ నాలుగు వికెట్లకు 199 పరుగులు చేసింది. గుజరాత్ కెప్టెన్ గిల్ 48 బంతుల్లో 89 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. అతడికి సాయి సుదర్శన్(33) సహకరించాడు. చివర్లో రాహుల్ తేవాటియ (23) అదరగొట్టాడు. దీంతో గుజరాత్ జట్టు స్కోరు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది.
200 పరుగుల విజయ లక్ష్యంతో పంజాబ్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. గుజరాత్ బౌలర్ల దాటికి ఆ జట్టు ప్రారంభంలోనే తడబడింది. కీలక వికెట్లను వెంటవెంటనే కోల్పోవడంతో కష్టాల్లో పడింది. ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ కేవలం ఒకే ఒక పరుగు చేసి ఉమేష్ యాదవ్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. కీలక సమయంలో జానీ బెయిర్ స్టో, ప్రభ సిమ్రాన్ సింగ్ అవుట్ కావడంతో పంజాబ్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే ఈ మైదానం ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టుకు అనుకూలించింది.. మైదానంపై తేమ ఉన్నప్పటికీ పంజాబ్ బౌలర్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు. వికెట్ టర్న్ అయ్యే విధంగా బంతులను సంధించలేకపోయారు. దీంతో గుజరాత్ బ్యాటర్లు పండగ చేసుకున్నారు.
ముఖ్యంగా ఈ మ్యాచ్లో నూర్ అహ్మద్ పంజాబ్ ఆటగాడు జానీ బెయిర్ స్టో వికెట్ తీసిన విధానం హైలెట్ గా నిలిచింది.. అప్పటికే పంజాబ్ జట్టు శిఖర్ ధావన్ క్రికెట్ కోల్పోయింది. దీంతో వన్ డౌన్ బ్యాటర్ గా ప్రభ సిమ్రాన్ సింగ్ క్రీజ్ లోకి వచ్చాడు. అతడు దాటిగా బ్యాటింగ్ చేయడం ప్రారంభించాడు.. బెయిర్ స్టో కూడా చూడ చక్కని షాట్లతో అలరించాడు. వీరిద్దరూ కుదురుకుంటున్న సమయంలో గిల్ నూర్ అహ్మద్ కు బౌలింగ్ ఇచ్చాడు. అయితే అతడు వేసిన ఐదో ఓవర్ తొలి బంతికే బెయిర్ స్టో దాన్ని డిఫెన్స్ ఆడాలని భావించాడు. కానీ ఆ బంతి అనూహ్యంగా టర్న్ అయింది. వికెట్లను గిరాటేసింది.. దీంతో బెయిర్ స్టో నిరాశగా మైదానాన్ని వీడాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో హల్ చల్ చేస్తోంది. స్లో బంతిని డిఫెన్స్ ఆడదామని బెయిర్ స్టో భావించాడు.. కానీ ఆ బంతి బుల్లెట్ లాగా దూసుకొచ్చి.. వికెట్లను పడగొట్టిందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Right Through The Defence \|/
Noor Ahmad gets Jonny Bairstow
Powerplay done, #PBKS are 54/2
Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema #TATAIPL | #GTvPBKS | @gujarat_titans pic.twitter.com/v60gkXe7Sh
— IndianPremierLeague (@IPL) April 4, 2024