Gautam Gambhir Birthday: ముక్కు మీదనే కోపం ఉంటుంది. దూకుడుగా ఆడతాడు. ఎంతటి బౌలర్ అయినా లెక్కపెట్టడు. మైదానంలో అనుక్షణం పరాక్రమాన్ని ప్రదర్శిస్తుంటాడు. అందువల్లే గౌతమ్ గంభీర్ ను మిస్టర్ అగ్రెసివ్ ప్లేయర్ అని పిలిచేవారు. ఇప్పుడు టీమ్ ఇండియాకు కోచ్ గా వ్యవహరిస్తున్న గౌతమ్ గంభీర్.. ఎన్నో అద్భుతాలు చేశాడు. వాస్తవానికి టీం ఇండియాకు సారథి కావలసిన అతడు మామూలు ఆటగాడిగానే మిగిలిపోయాడు. నేడు గౌతమ్ గంభీర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆధుని రికార్డులను ఒకసారి పరిశీలిస్తే..
ఢిల్లీలో పుట్టిన గౌతమ్ గంభీర్ టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆ తర్వాత వచ్చిన అవకాశాలను వినియోగించుకున్నాడు. మొదట్లో మిడిల్ ఆర్డర్లో ఆడే అతడు క్రమేపి ఓపెనర్ అయిపోయాడు. వీరేంద్ర సెహ్వాగ్ కు సరైన జోడిగా ముద్రపడ్డాడు. 2007 టి20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో స్ఫూర్తిదాయకమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ రెండు సిరీస్లలో టీమిండియా విజయం సాధించడంలో ముఖ్యపాత్ర పోషించాడు.. అయితే అతడు ఆడిన ఆటకు.. పోషించిన పాత్రకు మెరిట్ స్థానం లభించాల్సి ఉండేది. నాడు మేనేజ్మెంట్లో రాజకీయాల వల్ల ఆటగాడిగానే పరిమితమైపోయాడు. మేనేజ్మెంట్ లో వ్యవహారాలు చూడలేక ఆటగాడిగానే రిటైర్ అయిపోయాడు. ఐపీఎల్ లో కోల్ కతా జట్టులో ఆడాడు. జట్టుకు నాయకత్వం వహించి విజేతగా నిలిపాడు.. 2024 సీజన్లో మెంటార్ గా కోల్ కతా జట్టును విజేతగా నిలిపాడు.
గౌతమ్ గంభీర్ మొత్తం 242 అంతర్జాతీయ మ్యాచులు ఆడాడు. మొత్తంగా 10,324 పరుగులు చేశాడు. మొత్తంగా 20 అంతర్జాతీయ శతకాలు సాధించాడు. 2007 టి20 వరల్డ్ కప్ టీమ్ ఇండియా సాధించడంలో ముఖ్యపాత్ర పోషించాడు. 2011లో వన్డే వరల్డ్ కప్ ను టీమిండియా ఆదుకోవడంలో ముఖ్య భూమిక పోషించాడు.. టీమ్ ఇండియాకు ప్రధాన కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. భారత జట్టు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గింది. ఇటీవల ఆసియా కప్ కూడా సొంతం చేసుకుంది.
గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో టీమిండియా న్యూజిలాండ్ చేతిలో మూడు టెస్టుల సిరీస్ కోల్పోవడం, ఆస్ట్రేలియా చేతిలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోల్పోవడం ఒకరకంగా మాయని మచ్చలు. ఇదే విషయాన్ని తరచుగా గౌతమ్ గంభీర్ చెబుతుంటాడు. అందువల్లే జట్టులో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తున్నాడు. కొంతమందికి అవి నచ్చకపోయినప్పటికీ.. ఆ ఫలితాలు ప్రస్తుతం కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఇప్పుడు గౌతమ్ గంభీర్ 2027 వన్డే వరల్డ్ కప్, త్వరలో జరిగే టి20 వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ మీద దృష్టి సారించాడు. అందుకు తగ్గట్టుగానే జట్టును రూపొందిస్తున్నాడు.