
క్రికెట్ ఆటలో పిచ్ లు ప్రాధాన్యం సంతరించుకుంటాయి. కొన్ని పిచ్ లపై ఇడితే పరుగుల వరద సాగగా.. మరికొన్నింటిపై కనీసం వంద పరుగులు కూడా చేయలేని విధంగా ఉంటాయి. ఏ దేశమైనా ఆ దేశ జట్టుకు అనుగుణంగా పిచ్ ను రూపొందించుకుంటుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాల్లో పిచ్ లు పేస్ ను దృష్టిలో పెట్టుకొని నిర్మించారు. ఇటీవల ఇండియా పిచ్ ల గురించి తీవ్రంగా చర్చ జరుగుతోంది.
ఇటీవల ఇంగ్లండ్-ఇండియా టెస్ట్ సిరీస్ జరిగిన విషయం తెలిసిందే. ఈ టెస్ట్ లో తొలి మ్యాచ్ అహ్మదాబాద్లో ఆడిన పిచ్ టెస్ట్ వికెట్ కు అనుకూలం. అయితే ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ నెగ్గింది. రూట్ తన ప్రతాపాన్ని చూపి 200 పరుగులు చేశాడు. తొలి రెండు రోజులు బ్యాటింగ్ కు అనుకూలం ఆ తరువాత బౌలింగ్ కు అనుకూలంగా మారిందీ పిచ్.
రెండో టెస్ట్ కు చెన్నై, మూడో టెస్టుకు అహ్మదాబాద్ వికెట్ తీసుకోవాల్సింది. కానీ అహ్మదాబాద్ పిచ్ మరీ రెండు రోజులకే పూర్తయింది. బౌలర్లు తీవ్రంగా శ్రమించినా పరుగులను ఆపలేకపోయారు. ఐదురోజుల టెస్ట్ 140 ఓవర్లలో ముగియడం తప్ప ఇంకేం జరగలేదు. ఇక్కడున్న పిచ్ పై బౌలింగ్ వేస్తుంటే ఫుట్ ప్రింట్ పడడం.. దీంతో అక్కడ బంతి వేస్తే అదెలా టర్న్ అవుతుందో తెలియని పరిస్థితి దాపురించింది.
ఈ టెస్టులో ఇండియా గెలిచే అవకాశం ఉంది. కానీ పిచ్ పరిస్థితి చూస్తే మాత్రం ఇంగ్లండ్స్ బ్యాట్స్ మెన్ కన్నా మనవాళ్లే కాస్త బెటర్ గా ఆడారని అర్థమవుతుంది. ఏ దేశంలోనైనా పిచ్ లు ఆ దేశానికి అనుకూలంగా మార్చుకుంటాయి.కానీ మనదేశంలో ఇలాంటి పరిస్థితి చూసి కొందరు సినీయర్లు ఘాటుగా స్పందించారు.
ఇక విదేశీ ఆటగాళ్లు చెన్నై టెస్ట్ తరువాత కొందరు అసలు ఇది టెస్టుకు తగిన పిచ్ లు కానే కాదని అన్నారు. అయితే దీనిపై గవాస్కర్ మాట్లాడుతూ ఆస్ట్రేలియా ఇంగ్లండ్ వెళ్లినప్పుుడు అక్కడ భారత ప్లేయర్లు పచ్చిక బయళ్లపై పడాల్సి వస్తోందని కౌంటర్ ఇచ్చారు.