Border-Gavaskar Trophy 2023: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా ఇప్పటివరకు రెండు టెస్టులు ఆడాయి. ఈ రెండు టెస్టులు కూడా భారత్ గెలిచింది. నాగ్ పూర్, ఢిల్లీ లో టీమిండియా జయకేతనం ఎగురవేసింది.. ముఖ్యంగా నాగ్ పూర్ లో అయితే ఇన్నింగ్స్ తేడాతో ఆస్ట్రేలియా మీద విజయ పతాకం ఎగరేసింది.. ఢిల్లీలో కూడా రికార్డు స్థాయిలో విజయం సాధించింది.. అయితే ఇప్పుడు ఇదే భారత అభిమానులకు చికాకు తెప్పిస్తోంది.

వాస్తవానికి క్రికెట్ లో బౌన్సి పిచ్ లు గా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మైదానాలు పేరుపొందాయి.. ఒకటి రెండు మినహా మిగతావన్నీ బౌలర్లకు అనుకూలించేవే. ఈ మైదానాల మీద మహా అయితే నాలుగు రోజులకు మించి ఆడే పరిస్థితి ఉండదు.. ఒకవేళ తేమ కనుక లేకపోతే ఐదో రోజు ఆట కొనసాగించవచ్చు. అది కూడా కనా కష్టంగా.. కానీ ఇప్పుడు భారత్ లో మైదానాలు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాను మించిపోయాయి. తక్కువలో తక్కువ మూడున్నర రోజులకు మించి ఆడే పరిస్థితి లేకుండా పోయింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా మైదానాలు తొలిరోజు పేస్ కు, మిగతా రోజులు స్పిన్ కు అనుకూలిస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టుల్లో ఏ జట్టు కూడా భారీ స్కోర్ చేయలేదు అంటే బౌలింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు..
టికెట్లు అమ్మకండి
గతంలో ఎన్నడు లేని విధంగా మైదానాలు తయారు చేయడంతో భారత అభిమానులు పూర్తిస్థాయిలో క్రికెట్ ను ఆస్వాదించలేకపోతున్నారు.. మూడున్నర రోజుల్లోనే మ్యాచ్ ముగుస్తుండడంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు. వాస్తవానికి మిగతా దేశాల్లో టెస్ట్ క్రికెట్ చూసేందుకు భారీగా అభిమానులు రారు. కానీ ఇండియాలో ఆ పరిస్థితి లేదు. క్రికెట్ ను అమితంగా ఆరాధించే భారతదేశంలో మ్యాచ్ చూసేందుకు అభిమానులు భారీగా వస్తుంటారు.. ఈ క్రమంలో మైదానాలు పూర్తిగా మారడంతో మ్యాచులు ఐదు రోజులపాటు సాగడం లేదు.. మరోవైపు ఇండోర్లో మొదలైన మూడు టెస్టులోనూ భారత్ 109 పరుగులకు ఆల్ అవుట్ కావడం, ఆస్ట్రేలియా కూడా 4 వికెట్లు కోల్పోవడం.. భారత అభిమానులకు చిరాకు తెప్పిస్తోంది.” బీసీసీఐ… మీరు ఇలాగే బౌన్సీ మైదానాలు తయారు చేయండి.. అలాగే టెస్ట్ మ్యాచ్లో 4, 5 రోజులకు సంబంధించి టికెట్లు అమ్మడం మానుకోండి” అంటూ విమర్శిస్తున్నారు.. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది.
After see today's Pitch request to BCCI#INDvAUS #BGT2023 pic.twitter.com/9bcjGBTWGZ
— भाई साहब (@Bhai_saheb) March 1, 2023