Asia Cup 2023 Team India : ఆసియా కప్ 2023 కు 17 మంది సభ్యులతో కూడిన టీం ఇండియా జట్టును సెలెక్టర్లు నిన్న ప్రకటించడం జరిగింది. అయితే ఈ సెలక్షన్ ఊహకి అందని విధంగా ఉంది అని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటినుంచి జట్టులో స్థానం దక్కుతుంది అని ఆశిస్తున్న ధావన్, చాహల్, ,యశస్వి,శాంసన్ లకు నిరాశే మిగిలింది. గత కొద్దికాలంగా గాయాల కారణంగా మ్యాచ్లకు దూరంగా ఉన్న సీనియర్లు కోలుకోవడంతో వీళ్లకు రావలసిన ఛాన్స్ కాస్త మిస్ అయిపోయింది.
సీనియర్ ప్లేయర్స్ కేర్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఎంట్రీ కారణంగా జట్టులో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. సెలక్షన్ కమిటీ తిలక్ వర్మ,సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్,ప్రసిద్ధ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ లాంటి ప్లేయర్లకు ప్రిఫరెన్స్ ఇవ్వడంతో మిగిలిన వాళ్లకు డిసప్పాయింట్మెంట్ మిగిలింది. ట్రావలింగ్ రిజర్వ్ కింద సంజూ శాంసన్ను ఎంపిక చేసినప్పటికీ అది కేవలం నామమాత్రమే.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో మాత్రం పరిస్థితి డిఫరెంట్ గా ఉంది. కొందరు ఆసియా కప్ కోసం సెలక్షన్ కమిటీ ఎన్నిక చేసిన 17 మంది సభ్యుల భారత జట్టుకు ధీటుగా ప్రస్తుతం ఉన్న ప్లేయర్స్ తో ఒక ఊహాజనికమైన జట్టును తయారు చేశారు. అయితే ఈ జట్టుకు కెప్టెన్ శిఖర్ ధావన్.. ఓపెనర్లుగా ధవన్,రుతురాజ్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇస్తే.. వన్ డౌన్ లో యశస్వి జైస్వాల్,ఆతర్వాత సంజూ శాంసన్,రింకూ సింగ్, శివమ్ దూబే, స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చహల్, పేసర్ల కోటాలో దీపక్ చాహర్, అర్షదీప్ సింగ్,భువనేశ్వర్ కుమార్
జట్టులో ఉన్నారు.
అయితే ప్రస్తుతం ఈ ఆసియా కప్ ఆశావహుకులతో రూపొందించబడిన టీం డీటెయిల్స్ చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ధవన్ కెప్టెన్సీలో ఈ జట్టు ఎంతో సులభంగా బంగ్లాదేశ్ ,నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ ,శ్రీలంక ,పాకిస్తాన్ జట్లను ఓడించగలరని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. సెలక్షన్ కమిటీ ఆసియా కప్ కు ఎంచుకున్న టీమిండియా జట్టుకు ఇది ఏ మాత్రం తీసిపోదని కొందరు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. బీసీసీఐ సెలెక్ట్ చేసిన టీం తో పోల్చుకుంటే ఈ టీం ఎంతో బ్యాలెన్స్ గా మెరుగ్గా ఉంది అని కూడా కామెంట్స్ వస్తున్నాయి.
సెలక్టర్లు సెలెక్ట్ చేసిన టీమ్ ఇండియా….
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ కృష్ణ
ట్రావెలింగ్ రిజర్వ్: సంజూ శాంసన్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫ్యాన్ మేడ్ టీం ఇండియా…
శిఖర్ ధవన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, శివమ్ దూబే, దీపక్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చహల్
ఇంతకీ రెండు జట్లపై మీ అభిప్రాయం ఏమిటి..?