Akash Deep Vs Deep Ben Duckett: నిప్పుతో చెలగాటం ఆడకూడదు. నీరుతో పరాచకాలు ఆడకూడదు. గాలిలో విన్యాసాలు చేయకూడదు. ఇవి ఎంత ప్రమాదకరమో.. ప్రాణాలకు ఇంత హానికరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే క్రికెట్లో కొంతమంది ఆటగాళ్లతో పరిహాసాలు ఆడకూడదు. వారిని అసలు గెలక కూడదు. గెలికితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Also Read: సిక్స్ కొట్టగానే అమ్మాయిలను ఎందుకు చూపిస్తారంటే..
సమకాలీన క్రికెట్లో విరాట్ కోహ్లీ జోలికి ఏ ఆటగాడు వెళ్లడు. ఎందుకంటే సొంత జట్టు ఆటగాళ్లనే విరాట్ కోహ్లీ వదిలిపెట్టడు. అలాంటిది ప్రత్యర్థి జట్టు ఆటగాడు గెలికితే ఊరుకోడు కదా.. విధ్వంసం సృష్టించి వస్తాడు. పైగా తనని గెలికిన వారికి డబుల్ డోస్ ఇస్తాడు. ఇప్పుడు ఆ స్థానాన్ని ఆకాష్ దీప్ ఆక్రమించినట్టున్నాడు. కాకపోతే విరాట్ కోహ్లీ మాదిరిగా వైల్డ్ గా రియాక్ట్ కావడం లేదు. స్లో పాయిజన్ లాగా రియాక్ట్ అవుతూ.. ప్రత్యర్థి ఆటగాళ్లకు చుక్కలు చూపిస్తున్నాడు.
ఐదో టెస్టులో ఆకాష్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. నైట్ వాచ్మెన్ గా వచ్చిన అతడు.. హాఫ్ సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు. మూడో వికెట్ కు యశస్వి జైస్వాల్ తో సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సూపర్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. షార్ట్ పిచ్ బాల్ అంచనా వేయడంలో విఫలమై.. అవుట్ అయిన ఆకాష్.. ఒకవేళ ఆ బంతిని కనుక క్లెవర్ గా జడ్జ్ చేసి ఉంటే.. భారత్ పరిస్థితి మరో విధంగా ఉండేది. ఏది ఏమైనప్పటికీ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చిన అతడు.. పటిష్టమైన స్థితిలో నిలిపి వెళ్లిపోయాడు.
అంతకంటే ముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో ఆకాష్ మైదానంలో అద్భుతమైన చేశాడు. డకెట్ అప్పటికే వీరవిహారం చేస్తున్నాడు. ఈ దశలో నన్ను ఈ మైదానంలో అవుట్ చేయడం అంత ఈజీ కాదు అంటూ ఆకాష్ కు ఛాలెంజ్ విశిరాడు. దానిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆకాష్.. అద్భుతమైన బంతివేసి డకెట్ ను అవుట్ చేశాడు. దీంతో డకెట్ నిరాశతో మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు. అదే సమయంలో డకెట్ భుజం పైన చెయ్యి వేసి ఆకాష్ ఏదో మాట్లాడాడు. వాస్తవానికి డకెట్ ఆకాష్ ను అలా గెలికి ఉండకుండా ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఎందుకంటే తొలి ఇన్నింగ్స్ లో కీలకమైన డకెట్ వికెట్ పడగొట్టిన ఆకాష్.. ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్ లో సూపర్ ఆఫ్ సెంచరీ చేసి టీమ్ ఇండియాకు అద్భుతమైన బలాన్ని అందించాడు. అందుకే కొందరు ఆటగాళ్లను గెలగకూడదు. రెచ్చగొట్టకూడదు. అన్నింటికీ మించి పరిహాసం ఆడకూడదు. ఎందుకంటే అది చాలా విలువైనదిగా మారుతుంది. జట్టుకు కోలుకోలేని నష్టాన్ని చేకూర్చుతుంది.