Viral Video: ఇక మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 17 సీజన్ స్టార్ట్ అవబోతుండగా దానికోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సందడి చేస్తోంది. ఐపిఎల్ కి ఏ మాత్రం తగ్గకుండా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంది.ఇక ఇప్పుడు అందరి దృష్టి ఈ లీగ్ పైనే ఉంది. ఇక అందులో భాగంగానే అన్ని టీంలు తమ సత్తా చాటుతూ ముందుకు కదులుతున్నాయి. ముఖ్యంగా ఆర్సిబీ టీం ఈ సీజన్ లో దుమ్ము రేపుతుందనే చెప్పాలి.
సోమవారం ఆర్సిబీ vs వారియర్జ్ టీమ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్సిబీ భారీ విజయాన్ని అందుకుంది.ఇక దాంతో స్మృతి సేన చాలా సంబరాలను కూడా జరుపుకుంటుందనే చెప్పాలి… ఇక ఆర్సిబీ ఈ మ్యాచ్ లో గెలవడం ఒకేత్తు అయితే ఒక బ్యాటర్ కొట్టిన ఒక షాట్ కి డగౌట్ లో ఉన్న కార్ అద్దం పగలడం అనేది మరొక రేంజ్ అనే చెప్పాలి. ఇంతకీ ఆ షాట్ కొట్టిన బ్యాటర్ ఎవరో మనం ఒకసారి తెలుసుకుందాం…
ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సిబీ టీమ్ 198 పరుగులు చేసింది. ఇక ఈ టీం లో ఎవరు ఎలా ఆడినా కూడా ‘ఎల్లీస్ పెర్రీ‘(Ellyse Perry) మాత్రం అద్భుతమైన బ్యాటింగ్ తో బెంగళూరు టీం కి ఒక సూపర్ విక్టరీని సాధించి పెట్టింది. ఆమె కొట్టిన 58 పరుగులు ఒక ఎత్తు అయితే ఆమె కొట్టిన ఒక భారీ సిక్స్ కి కారు అద్దం పగిలిపోవడం అనేది నిజంగా ఒక వండర్ అనే చెప్పాలి. ఇప్పటివరకు మెన్స్ క్రికెటర్స్ ఎవరు కూడా ఇలాంటి ఫీట్ సాధించలేదు.. ఇక ఆమె మిడ్ వికెట్ లో పడిన బాల్ ని డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్స్ కొట్టింది దానికి అక్కడున్న కార్ అద్దం పగిలిపోయింది. ఇక ఇది చూసిన పెర్రీ ఎంత పని అయింది అంటూ తల పట్టుకుంది.
+
Ellyse Perry's powerful shot shattered the window of display car #TATAWPL #UPWvRCB #TATAWPLonJioCinema #TATAWPLonSports18 #HarZubaanParNaamTera#JioCinemaSports #CheerTheW pic.twitter.com/RrQChEzQCo
— JioCinema (@JioCinema) March 4, 2024
ఇక ఇది చూసిన ప్రేక్షకులు మాత్రం గ్రౌండ్ లో విపరీతంగా అరిచారనే చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ లో ఆర్సిబీ టీం మొదట 198 పరుగులు చేయగా, 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వారియర్జ్ టీం 20 ఓవర్లకి 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక 23 పరుగుల తేడాతో ఆర్సిబీ ఘన విజయాన్ని సాధించింది. ఇక ఇప్పటివరకు ఈ లీగ్ లో ఐదు మ్యాచ్ లు ఆడిన ఆర్సిబీ 3 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో 80 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన స్మృతి మందనా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచింది…