Odi World Cup 2023: ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కి మధ్య జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ మీద ఆఫ్ఘనిస్తాన్ భారీ విజయాన్ని సాధించడం జరిగింది. ఈ లెక్కన ఆఫ్ఘనిస్తాన్ పాక్ కి అతిపెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి.ఇక వరల్డ్ కప్ లో ఇప్పటివరకు ఇండియా, సౌతాఫ్రికా,న్యూజిలాండ్ టీంలు వరుస విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో ఈ మూడు టీములు కూడా ఇప్పటికే సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకునే విధంగానే ముందుకు దూసుకెళ్తున్నాయి.ఇక ఈ క్రమంలో సెమీస్ కి వెళ్లే 4 వ జట్టు ఏది అనేదాని మీదనే చాలా వరకు చర్చలు జరుగుతున్నాయి.ప్రస్తుతానికి అయితే ఆస్ట్రేలియా, పాకిస్థాన్, ఆఫ్గనిస్తాన్ టీమ్ లు 2 విజయాలను సాధించి రన్ రేట్ పరంగా 4,5,6 వ స్థానాల్లో కొనసాగుతున్నాయి.
ఇక ఇప్పటికే వరుసగా మూడు స్థానాల్లో ఉన్న ఇండియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా టీం లు ఆల్మోస్ట్ సెమిస్ కి వెళ్ళినట్టే…ఇక పాకిస్తాన్ మొదటి రెండు మ్యాచ్ లలో విజయం సాధించి సెమిస్ రేస్ లో మొదటి ముందు వరుసలో ఉన్నాము అని ప్రపంచ దేశాలకు సవాల్ విసిరినప్పటికీ ఆ తర్వాత ఆడిన మూడు మ్యాచ్ ల్లో మాత్రం మూడు మ్యాచ్ లు ఓడిపోయి కష్టాల్లో పడింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాలుగు పాయింట్లతో పాకిస్తాన్ టీం ఐదో పొజిషన్ లో కొనసాగుతుంది. ఇంకా ఆఫ్గనిస్తాన్ టీం కూడా నాలుగు పాయింట్లు తో ఆరవ పోజిషన్ లో కొనసాగుతుంది. ఇక పాకిస్తాన్ టీం, ఆఫ్గనిస్తాన్ టీమ్ రెండు కూడా ఒకే పాయింట్లతో ఉన్నప్పటికీ వాళ్ళు రెండింటి లో ఉన్న తేడాని బట్టి పొజిషన్స్ అనేవి మారడం జరిగింది. ఇక ఈ క్రమంలో పాకిస్తాన్ నెక్స్ట్ మ్యాచ్ లు వరుసగా బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్,ఇంగ్లాండ్ టీం లతో మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.
ఇక బంగ్లాదేశ్ కొంచెం వీక్ గా కనిపించినప్పటికీ కూడా మిగిలిన మూడు జట్లు కూడా చాలా స్ట్రాంగ్ టీమ్ లు కాబట్టి పాకిస్తాన్ వీటి మీద విజయం సాధించి తమ రన్ రేట్ మెరుగుపరచుకొని ముందుకు తీసుకెళ్తే తప్ప పాకిస్తాన్ టీం సెమీస్ కి వెళ్ళడం కష్టమనే చెప్పాలి. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ టీం ఈ టీమ్ ల మీద గెలవడం చాలా కష్టమనే చెప్పాలి. ఇక ఇప్పటికే రెండు విజయాలు సొంతం చేసుకొని మంచి ఫామ్ లో ముందుకు తీసుకెళ్తున్న ఆఫ్ఘనిస్తాన్ టీమ్ కూడా తను ఆడాల్సిన ఇంకో నాలుగు మ్యాచ్ ల్లో శ్రీలంక ,నెదర్లాండ్ ,ఆస్ట్రేలియా ,సౌతాఫ్రికా తో ఆడాల్సి ఉంది. ఈ నాలుగు మ్యాచ్ ల్లో శ్రీలంక ,నెదర్లాండ్ టీమ్ లను ఆఫ్ఘనిస్తాన్ ఈజీగా ఓడించవచ్చు. ఇక ప్రస్తుతం అఫ్గాన్ టీమ్ ఉన్న ఫామ్ కి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా టీముల్లో ఏదో ఒక జట్టు కి కూడా షాక్ ఇచ్చిన ఆశ్చర్య పోవాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే ఇప్పటికే నెదర్లాండ్ టీమ్ మీద సౌతాఫ్రికా టీం ఓడిపోయి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది…