spot_img
Homeక్రీడలుక్రికెట్‌CSK Biggest Mistake IPL 2025 Players Released: జడేజా నే కాదు.. ఈ ఇద్దరినీ...

CSK Biggest Mistake IPL 2025 Players Released: జడేజా నే కాదు.. ఈ ఇద్దరినీ వదులుకుని.. సీఎస్ కే పెద్ద తప్పు చేసింది

CSK Biggest Mistake IPL 2025 Players Released: వజ్రాల వేటలో పడి బంగారాన్ని కోల్పోవద్దు. అలా కోల్పోతే వజ్రాలు దొరకవు. కోల్పోయిన బంగారం ఎప్పటికీ లభించదు.. బిజినెస్ సర్కిల్స్లో ఈ నానుడి విస్తృతమైన ప్రచారంలో ఉంటుంది. దీనిని స్పోర్ట్స్ సర్కిల్స్ లో అన్వయిస్తే బాధిత స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఉంటుంది.

ఐపీఎల్ లో ఐదు సార్లు విజేతగా నిలిచిన ఘనత చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకుంది. ధోని నాయకత్వంలో చెన్నై జట్టు ముంబై ఇండియన్స్ తో సమానంగా ఐదుసార్లు ట్రోఫీలు అందుకుంది. ఇంతటి చరిత్ర ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పుడు దారుణమైన ఆట తీరుతో విమర్శలు ఎదుర్కొంటున్నది. జట్టులో ధోని ఉన్నప్పటికీ ఆడే పరిస్థితి లేదు. నాయకుడిగా గైక్వాడ్ విఫలమవుతున్నాడు. 2024 లో అతడు అంతగా ఆకట్టుకోలేదు. 2025లో గాయం వల్ల దూరమయ్యాడు. ఇప్పుడు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నప్పటికీ అతని ప్రణాళికలు.. వ్యూహాలు అట్టర్ ప్లాప్ అవుతున్నాయి.

మేనేజ్మెంట్ తీరు కూడా ఏమాత్రం బాగోలేదు. మెగా వేలంలో బీభత్సమైన ప్లేయర్లను చెన్నై జట్టు నిలుపుకోలేదు. దీంతో వారిని ఇతర జట్లు కొనుగోలు చేశాయి. ఈ ఐపీఎల్లో సీఎస్కే జట్టు వదిలేసిన ఆటగాళ్లు సత్తా చూపిస్తున్నారు. ఇందులో రాజస్థాన్ జట్టు తరఫున ఆడుతున్న రవీంద్ర జడేజా సత్తా చూపిస్తున్నాడు.. ఇటీవల చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో అతడు రెండు వికెట్లు తీయడం మాత్రమే కాదు.. ఆ జట్టు పతనాన్ని శాసించాడు. వికెట్లు తీసిన తర్వాత గన్ ఫైర్ సెలబ్రేషన్ చేశాడు.

రవీంద్ర జడేజా స్టోరీ అలా ఉంటాయి.. సమీర్ రిజ్వి తుఫాన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకుంటున్నాడు. ఈ ఐ పి ఎల్ లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా ఉన్నాడు. హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు (క్రితం ఐపిఎల్ చివరి మ్యాచ్ తో కలిపి), హ్యాట్రిక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాలతో సంచలనం ప్రశ్నించాడు.

శనివారం నాటి రాజస్థాన్, గుజరాత్ మ్యాచ్లో చివరి ఓవర్లో తుషార్ దేశ్ పాండే మెరుపు వేగంతో బంతులు వేశాడు. వికెట్ తీయడం మాత్రమే కాకుండా.. పరుగులు ఇవ్వకుండా కట్టడి చేశాడు. దీంతో రాజస్థాన్ జట్టు విజయం సాధించింది. రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వి, తుషార్ దేశ్ పాండే.. ముగ్గురిని వదులుకొని చెన్నై జట్టు భారీ మూల్యాన్ని చెల్లించుకుంది.. అందుకే అంటారు వజ్రాల వేటలో పడి బంగారాన్ని కోల్పోవద్దని.. బంగారం లాంటి ప్లేయర్లను కోల్పోయి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ ఐపీఎల్ లో ఏడవని రోజంటూ లేదు. అందు గురించే యద్భావం తద్భవతి అంటారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...

NTR: కీలక నిర్ణయం దిశగా జూనియర్ ఎన్టీఆర్!

NTR: తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాతే ఎవరూ అంటే మాత్రం చటుక్కున లోకేష్ పేరు వస్తుంది. ప్రస్తుతం ఆయన అనధికార అధినేత తెలుగుదేశం పార్టీకి. పైగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అన్ని తానై...

Tammineeni Seetharam: ఏపీలో మారిన అరెస్టుల స్టైల్!

Tammineeni Seetharam: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అరెస్టు భయం వెంటాడుతోంది. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం కేసుల రూపంలో వెంటాడింది. కానీ కొందరు తమ వ్యవహార శైలితో ఏరి కోరి కేసులు తెచ్చుకున్నారు....

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...
Oktelugu Epaper
Exit mobile version