Shubman Gill Century: టీమిండియా టి20, టెస్ట్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు బద్దలైంది. టీమిండియా లెజెండరీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ ఘనత పటా పంచలైంది. మన్సూర్ అలిఖాన్ పటౌడీ లాంటి ప్లేయర్ సరసన అతడికి చోటు లభించింది. ఎందుకంటే అతడు సృష్టించిన విధ్వంసం అలా ఉంది మరి. బలమైన ఇంగ్లాండ్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ.. చాప కింద నీరు లాగా ఇన్నింగ్స్ నిర్మిస్తూ.. టీమిండియా టెస్ట్ సారథి గిల్ సరికొత్త రికార్డులు సృష్టించాడు. రెండవ టెస్ట్ తొలి రోజు సెంచరీ చేసిన అతడు.. రెండవ రోజు ఈ కథనం రాసే సమయం వరకు 165 పరుగులు చేశాడు. డబుల్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. మరో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి ఆరో వికెట్ కు 203 పరుగులు జోడించాడు. తద్వారా భారత్ ఈ కథనం రాసే సమయం వరకు ఆరు వికెట్ల నష్టానికి 414 పరుగులు చేసింది.. వాషింగ్టన్ సుందర్ (0*) క్రీజ్ లో ఉన్నాడు.
Also Read: బుమ్రా ఆడతాడా? లేదా? రెండో టెస్టుకు ఎటూ తేల్చుకోలేక టీమ్ ఇండియా మేనేజ్మెంట్ సతమతం!
ఇంగ్లీష్ జట్టు పై సెంచరీ చేయడం ద్వారా గిల్ అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. 26 సంవత్సరాలు నిండకముందే 150+ పరుగులు చేసిన భారత జట్టు మూడవ సారథిగా నిలిచాడు. సచిన్ టెండూల్కర్, మన్సూర్ అలీ ఖాన్ పటౌడి (రెండుసార్లు) తర్వాత గిల్ ఈ ఘనత అందుకున్నాడు. టెస్టులలో ఏడు సెంచరీలు పూర్తి చేసుకున్నాడు.. గిల్ వన్డేలలో 8 శతకాలు సాధించాడు. టి20 లో ఒక సెంచరీ చేశాడు. మొత్తంగా 16 అంతర్జాతీయ శతకాలను 25 సంవత్సరాల వయసులోనే గిల్ సాధించడం విశేషం..
25 ఏళ్ల వయసులో సచిన్ 40, విరాట్ 26 శతకాలు సాధించారు..గిల్ ఇప్పటివరకు 16 సెంచరీలు చేశాడు.ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో గిల్ వన్డేలో సెంచరీ చేశాడు. జూన్ నెలలో టెస్ట్ సెంచరీ అందుకున్నాడు. జూలై నెలలోనూ టెస్ట్ సెంచరీ చేశాడు. తద్వారా ఈ ఏడాది ఇప్పటివరకు అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. సారధిగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ చరిత్రలో 69 ఇన్నింగ్స్ లలో రోహిత్ 9 సెంచరీలు చేయగా..గిల్ 62 ఇన్నింగ్స్ లలో ఏడు సెంచరీలు చేశాడు. మరోవైపు 150+ కి పైగా పరుగులు చేయడం ద్వారా.. ఇంగ్లీష్ జట్టుపై ఇంగ్లాండ్ వేదికగా ఘనత సాధించిన టీమ్ ఇండియా రెండవ సారధిగా నిలిచాడు.
Also Read: గిల్, జడేజా మరో అద్భుతం చేశారు
అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో 300 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా గిల్ రికార్డు సృష్టించాడు..గిల్ రెండో టెస్టులో మైదానంలోకి వచ్చేనాటికి ఇండియా 95/2 వద్ద ఉంది. జైస్వాల్ తో మూడో వికెట్ కు 66, రిషబ్ పంత్ తో నాలుగో వికెట్ కు 47, జడేజాతో ఆరో వికెట్ కు 203 పరుగుల భాగస్వామ్యాన్ని గిల్ నెలకొల్పాడు. తద్వారా టీమిండియా 418/6 వద్ద రెండవ రోజు బ్యాటింగ్ చేస్తోంది.