spot_img
Homeక్రీడలుక్రికెట్‌Sachin Tendulkar inspiring act: క్రికెట్ గాడ్ చేసిన పనికి సెల్యూట్ కొట్టాల్సిందే.. సచిన్ టెండూల్కర్...

Sachin Tendulkar inspiring act: క్రికెట్ గాడ్ చేసిన పనికి సెల్యూట్ కొట్టాల్సిందే.. సచిన్ టెండూల్కర్ లు ఊరికే అవ్వరు

Sachin Tendulkar inspiring act: ఎదిగినప్పుడు ఒదిగి ఉండాలి. శిఖరాగ్రానికి చేరుకున్న తర్వాత.. మూలం కూడా తెలిసి ఉండాలి. అలాంటి వ్యక్తులే సమాజానికి దిక్సూచిలుగా ఉంటారు. టార్చ్ బేరర్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా ఉంటారు.. అలా అవ్వాలంటే నిగ్రహం ఉండాలి. దేవుడి విగ్రహాన్ని పట్టుకునే సందర్భంలో ఆత్మశుద్ధి మాత్రమే కాదు.. దేహశుద్ధి కూడా చేసుకోవాలి. ఇదిగో ఇలాంటి పని చేశాడు క్రికెట్ గాడ్.

విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ శతవసంతాల వేడుక ను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ గవర్నర్ , ఇంకా అనేకమంది వ్యక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి కొద్దిసేపు సచిన్ మాట్లాడారు. విద్యార్థుల్లో సానుకూల దృక్పథం పెంచే విధంగా.. తన జీవితంలో ఎదురైన సంఘటనలను వారితో పంచుకున్నారు.

వచ్చిన అతిధుల ప్రసంగాలు పూర్తయిన తర్వాత.. సచిన్ టెండూల్కర్ కు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్ఞాపికను బహుకరించారు. ఈ సమయంలో సచిన్ స్వామి వారి విగ్రహాన్ని అందుకోడానికి ముందుకు వచ్చారు. తన కాళ్లకు బూట్లు ఉన్నాయని విషయాన్ని గుర్తించిన సచిన్.. కొద్దిసేపు ఆగి.. తన బూట్లను విప్పారు. ఆ తర్వాత పాదాలతో నడుచుకుంటూ వెళ్లి.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రతిమను స్వీకరించారు.

సచిన్ చేసిన పని పట్ల సోషల్ మీడియాలో ప్రశంసలు లభిస్తున్నాయి..”అతడు క్రికెట్ గాడ్. అంతకుమించి కూడా. ఎంత ఎదిగినా సరే అతడు ఒదిగి ఉంటాడు. అందుకు నిదర్శనమే ఈ సంఘటన. ప్రతి ఒక్కరు క్రికెట్ ఆడవచ్చు. కొందరు మాత్రమే అందులో విజయవంతమవుతారు. ఇందులో అతికొద్ది మంది మాత్రమే స్టార్ ప్లేయర్లు అవుతారు. సచిన్ మాత్రం ఒక్కడే అవుతాడు. అందువల్లే అతడు ఈ స్థాయిలో ఉన్నాడని” సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version