Rishabh Pant Viral Video: టెస్ట్ అయినప్పటికీ అతడు వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తాడు. అన్ని కుదిరితే టి20 తరహాలో పరుగులు సాధిస్తాడు. మైదానంతో అతనికి సంబంధం ఉండదు. బౌలర్ తో పని ఉండదు. రంగంలోకి దిగాడు అంటే శివతాండవం చేస్తాడు. బంతి మీద దీర్ఘకాలిక శత్రుత్వం ఉన్నట్టు బ్యాటింగ్ చేస్తాడు. అతడు మైదానంలో ఉన్నంత సేపు ప్రత్యర్థి బౌలర్లు భయపడి పోతారు. అతడు చేస్తున్న విన్యాసాలు చూసి ఆశ్చర్యపోతారు. సాధారణంగా బ్యాటింగ్ ఎవరైనా కుదురుగా చేస్తారు. అతడు మాత్రం యోగాసనాలు వేసుకుంటూ బ్యాటింగ్ చేస్తాడు. అందువల్లే అతడు టీమ్ ఇండియాలో ప్రత్యేకంగా నిలిచాడు. ఇప్పటికి ప్రత్యేకంగానే కొనసాగుతున్నాడు. అతడే రిషబ్ పంత్. రోడ్డు ప్రమాదానికి గురై.. సుదీర్ఘకాలం ఆసుపత్రి పాలై.. గత ఏడాది నుంచి క్రికెట్ ఆడుతున్న అతడు తనదైన మార్క్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకుంటున్నాడు.
ప్రస్తుతం ఇంగ్లీష్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడుతున్న పంత్.. తొలి టెస్ట్ లో రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీలు చేశాడు. ఇక రెండవ టెస్టులోనూ దూకుడు గానే ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు.. ఈ మ్యాచ్లో కూడా సెంచరీ ఖాయం అనుకుంటుండగా.. బషీర్ బౌలింగ్లో భారీ షాట్ కొట్టాడు. అయితే అనూహ్యంగా జాక్ క్రాలి చేతిలో క్యాచ్ అవుట్ అయ్యాడు. క్యాచ్ అవుట్ అయిన తర్వాత రిషబ్ పంత్ మైదానాన్ని వీడిపోయేంతవరకు బాగానే ఉన్నాడు. డ్రెస్సింగ్ రూమ్ చేరుకున్న తర్వాత ఒక్కసారిగా తన కోపాన్ని వ్యక్తం చేశాడు. డ్రెస్సింగ్ రూమ్ చేరుకున్న తర్వాత ఒక్కసారిగా తన ధరించిన హెల్మెట్ ను నేలకు కొట్టాడు. ఈ దృశ్యాలు సిసి కెమెరాలలో రికార్డ్ అయ్యాయి. అవి సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.
రిషబ్ పంత్ ఆవేశంగా ఉంటాడు. దూకుడుగా కనిపిస్తాడు. అతడి స్వభావం అభిమానులకు మొత్తం తెలుసు. అందువల్లే అతడు అవుట్ అయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో ఆ విధంగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం పట్ల అభిమానులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు..” ఇంత ఆవేశపడి హెల్మెట్ బద్దలు కొట్టే బదులు.. బాధ్యతయుతంగా ఆడితే అయిపోతుంది కదా.. రిషబ్ అవుట్ అయిన వెంటనే కేవలం మూడు పరుగుల వ్యవధిలోనే నితీష్ కుమార్ రెడ్డి రూపంలో భారత్ మరో వికెట్ కోల్పోయింది. ఆ సమయంలో రవీంద్ర జడేజా రంగంలోకి దిగాడు. బాధ్యతాయుతమైన బ్యాటింగ్ చేశాడు. ఫలితంగా భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. లేకుంటే పరిస్థితి మరో విధంగా ఉండేది.. ఏది ఏమైనప్పటికీ రిషబ్ పంత్ బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి ఉంటే బాగుండేదని” అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా రిషబ్ పంత్ తన ఆగ్రహం తగ్గించుకోవాలని.. టెస్ట్ తరహా లోనే బ్యాటింగ్ చేయాలని.. అవసరం అయినప్పుడు మాత్రమే దూకుడు ప్రదర్శించాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. రిషబ్ పంత్ ఆగ్రహానికి గురై వికెట్ పడేసుకుంటే అది జట్టుకే నష్టమని సూచిస్తున్నారు.
Pant holes out to Zak Crawley at long-on!
“Cheerio, cheerio, cheerio” shouts The Hollies
2️⃣0️⃣8️⃣-4️⃣ pic.twitter.com/qM8ZoX8ZwI
— England Cricket (@englandcricket) July 2, 2025