spot_img
Homeక్రీడలుక్రికెట్‌Chennai Super Kings Comeback IPL 2026: మొన్న ఢిల్లీ.. నిన్న కోల్ కతా.. CSK...

Chennai Super Kings Comeback IPL 2026: మొన్న ఢిల్లీ.. నిన్న కోల్ కతా.. CSK గట్టి సంకేతాలు పంపిస్తోంది.. మిగతా జట్లు బహుపరాక్..

Chennai Super Kings Comeback IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఐపీఎల్ లో ఘనమైన చరిత్ర ఉంది. ఐదుసార్లు ధోని నాయకత్వంలో విజేతగా నిలిచింది చెన్నై. గడిచిన రెండు సీజన్డ్ గా చెన్నై జట్టు అంత గొప్పగా ఆడటం లేదు. చెన్నై జట్టు సారధిగా ధోని తప్పుకున్న తర్వాత.. ఎందుకో ఆ జట్టులో క్రమశిక్షణలోపించినట్లు కనిపిస్తోంది. దీనికి తోడు ఆటగాళ్ల మధ్య ఐకమత్యం లేకపోవడం చెన్నై జట్టు స్థాయిని తగ్గించేసింది.

గత ఏడాది గైక్వాడ్ గాయం వల్ల సారధ్య బాధ్యత నుంచి తప్పుకోగా.. తాత్కాలిక నాయకుడిగా ధోని వ్యవహరించాడు. ధోని ఉన్నప్పటికీ కూడా చెన్నై జట్టు విజయాలు సాధించలేకపోయింది. దీంతో ఆటగాళ్ల ఆట తీరు మీద ధోని తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇటువంటి ఆటగాళ్లు ఉంటే విజయాలు ఎలా సాధ్యమవుతాయని బహిరంగంగానే తన ఆగ్రహాన్ని ప్రదర్శించాడు. ధోని ఆ తరహా వ్యాఖ్యలు చేసిన తర్వాత.. మెగా వేలంలో పనికిమాలిన ప్లేయర్లను మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. యంగ్ ప్లేయర్లకు అవకాశం ఇవ్వడం మొదలుపెట్టింది.

యంగ్ ప్లేయర్లు జట్టులోకి వచ్చినప్పటికీ ఈ సీజన్లో చెన్నై జట్టు రాత అంతగా మారలేదు. మొదట్లో వరుసగా ఓటములు పలకరించాయి. దీంతో చెన్నై జట్టు పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఈ క్రమంలోనే చెన్నై జట్టు ఒక్కసారిగా తన పునరాగమనాన్ని గట్టిగా చాటుకోవడం మొదలుపెట్టింది. సొంత మైదానంలో.. ఆశేషమైన ప్రేక్షకుల బలం మధ్య చెన్నై జట్టు వరుసగా రెండు విజయాలు సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ మీద 23 పరుగులతో గెలుపును అందుకుంది. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు పై 32 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.. దీంతో ఒకసారి గా ఈ ఐపీఎల్ పోరును పూర్తిగా మార్చేసింది.

ఈ సీజన్లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు ఆడిన చెన్నై జట్టు.. మూడు ఓటములు, రెండు విజయాలు సాధించింది. పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది. ఏప్రిల్ 18న చెన్నై జట్టు హైదరాబాద్ తో తలపడుతుంది. రాజస్థాన్ రాయల్స్ పై 8 వికెట్లు, బెంగళూరు పై 43 పరుగులు, పంజాబ్ జట్టుపై ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయిన నేపథ్యంలో.. చెన్నై జట్టు తీవ్రమైన ఒత్తిడిలో పడింది. ఈ దశలో ఢిల్లీ, కోల్ కతా పై విజయాలు సాధించిన నేపథ్యంలో ఒక్కసారిగా మళ్ళీ సీన్లోకి వచ్చింది. ఈ విజయాలను కొనసాగిస్తే చెన్నై జట్టు ట్రోఫీ రేసులోకి వస్తుంది. ఒకవేళ ఇక్కడితోనే ఆగిపోతే చెన్నై జట్టు మరో సీజన్ ను దారుణంగా ముగిస్తుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version