Telugu News » Sports » Can australia be stopped victory only if top order success
WTC Final india Vs Australia : ఆస్ట్రేలియాను నిలువరించేనా.. టాపార్డర్ రాణిస్తేనే విజయం..!
చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ ఆస్ట్రేలియాపైనే ఒత్తిడి పెంచారు. ఇక మూడో రోజు తొలి స్పెల్ అత్యంత కీలకం కానుంది. 100 పరుగుల్లోపు ఆస్ట్రేలియా జట్టును ఆలౌట్ చేయగలిగితే భారత జట్టుకు మెరుగైన ఫలితం సాధించే అవకాశం ఉంది.
WTC Final india Vs Australia : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో 469 పరుగులు చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు 296 పరుగులకు పరిమితమైంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్ కొనసాగుతోంది. 123 పరుగులకు నాలుగు వికెట్ల నష్టపోయి ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తోంది. ప్రస్తుతం 296 పరుగుల ఆధిక్యంలో ఆస్ట్రేలియా ఉంది.
డబ్ల్యూటిసి ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోతోంది. బౌలింగ్ విభాగంలో ఓ మోస్తారుగా రాణించిన భారత జట్టు బ్యాటింగ్ లో పూర్తిగా తేలిపోవడంతో ఆస్ట్రేలియా ఆధిక్యం దక్కించుకుంది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాను భారత బౌలర్లు గట్టిగానే కట్టడి చేశారు. స్వల్ప స్కోర్ కే నాలుగు వికెట్లను పడగొట్టి ఆస్ట్రేలియాను భారత బౌలర్లు ఇబ్బంది పెట్టారు. ప్రస్తుతం 123 పరుగులకు నాలుగు వికెట్ల నష్టపోయి ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ చేస్తోంది. మరో 100 పరుగుల లోపు ఆస్ట్రేలియా జట్టును కట్టడి చేయగలిగితే భారత జట్టు పోరాడేందుకు అవకాశం ఉంటుంది.
296 పరుగుల ఆధిక్యంలో ఆస్ట్రేలియా..
ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు 296 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత జట్టు 296 పరుగులకు ఆల్ అవుట్ అయిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టుకు 173 పరుగుల ఆధిక్యం లభించింది. అయితే, రెండో ఇన్నింగ్స్ లో మాత్రం భారత్ బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన చేయడంతో స్వల్ప పరుగులకే నాలుగు వికెట్లను పడగొట్టారు. కట్టుదిట్టమైన బంతులు వేయడంతో పరుగులు తీసేందుకు కూడా ఆస్ట్రేలియా బ్యాటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓపెనర్లు వార్నర్ (1), కవాజా (13) ఆరంభంలోనే వెనుదిరిగారు. తొలి వికెట్ సిరాజ్ తీయగ, ఖవాజాను ఉమేష్ అవుట్ చేశాడు. కానీ, మిడిల్ ఆర్డర్ నుంచి చక్కటి సహకారం లభించడంతో ఆస్ట్రేలియా జట్టు మెరుగైన స్కోర్ దిశగా సాగింది. లబుషేన్ ను సిరాజ్ బౌన్సర్ తో బెంబేలెత్తించైనా అతను ఓపిగ్గా క్రీజులో నిలిచాడు. అతడికి స్మిత్ (34) జత కలవడంతో మూడో వికెట్ కు (62) పరుగులు చేరాయి. కీలక దశలో స్మిత్, హెడ్ (18) వికెట్లను తీసిన జడేజా భారత్ కు రిలీఫ్ ఇచ్చాడు. అటు లబుషేన్ (41) బ్యాటింగ్ లో పట్టుదల కనబర్చడడంతో గ్రీన్ (7)తో కలిసి మరో వికెట్ కోల్పోకుండా భారీ ఆధిక్యంతో మూడో రోజుని ముగించారు.
ఇంకా మిగిలి ఉన్న రెండు రోజుల ఆట..
మరో రెండు రోజులు ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ టెస్ట్ పై ఆసక్తి నెలకొంది. ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికీ 300 పరుగుల ఆధిక్యంలో ఉంది. మరో నలుగురు ఆటగాళ్లకు బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉండడంతో ఎంత స్కోర్ చేస్తుందో అన్నదానిపై ఆసక్తి
నెలకొంది. ఆస్ట్రేలియా జట్టు 400కుపైగా పరుగులు చేస్తే మాత్రం భారత జట్టుకు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. ఒకవేళ 400కుపైగా పరుగులు సాధించిన టాపార్డర్ రాణిస్తే మాత్రం విజయాన్ని సాధించేందుకు అవకాశం ఉంది. అయితే, అరవీర భయంకరమైన ఆస్ట్రేలియా బౌలింగ్ ను ఎదుర్కొని భారీ స్కోరును చేదించడం కొంత కష్టంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అద్భుత పోరాట పటిమతో భారీ స్కోరు..
తొలి ఇన్నింగ్స్ లో టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ రహానే అద్భుతమైన పోరాట పటిమతో శార్దూల్ ఠాకూర్ స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్ తో భారత జట్టు 300 పరుగుల దగ్గరకు వచ్చింది.
టాపార్డర్ విఫలమైన తరువాత భారత జట్టు 200 పరుగులు చేయడం కూడా కష్టంగా కనిపించింది. అయితే, రహనే, శార్దూల్ ఠాకూర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత జట్టుకు మంచి భాగస్వామ్యాన్ని అందించారు. వీరిద్దరూ కలిసి ఏడో వికెట్ కు ఏకంగా శతక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. బౌన్సర్లు శరీరానికి తాకుతున్న మొండి పట్టుదలతో ఈ ఇద్దరు క్రీజులో నిలిచారు. అటు చక్కగా కుదురుకున్న రహానేకు అండగా నిలవాలనే ఆలోచనతో శార్దూల్ నొప్పిని భరిస్తూనే అద్భుత ప్రదర్శన కనబరిచాడు. కఠినమైన ఆస్ట్రేలియా ఫేస్ దళాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటూనే తొలి సెషన్ లో 109 పరుగులు జత చేశారు. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ ఆస్ట్రేలియాపైనే ఒత్తిడి పెంచారు. ఇక మూడో రోజు తొలి స్పెల్ అత్యంత కీలకం కానుంది. 100 పరుగుల్లోపు ఆస్ట్రేలియా జట్టును ఆలౌట్ చేయగలిగితే భారత జట్టుకు మెరుగైన ఫలితం సాధించే అవకాశం ఉంది.