Homeక్రీడలుక్రికెట్‌Australia vs England: 847 బంతులేనా.. ఇది యాషెసా? కౌంటీ క్రికెట్టా ?

Australia vs England: 847 బంతులేనా.. ఇది యాషెసా? కౌంటీ క్రికెట్టా ?

Australia vs England: టెస్ట్ క్రికెట్.. ఐదు రోజులపాటు జరుగుతుంది. ఐదు రోజుల్లో ప్లేయర్లు తమలో ఉన్న ప్రతిభను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పడానికి పాటుపడుతుంటారు.. వాస్తవానికి ప్రస్తుత కాలంలో టెస్ట్ క్రికెట్ బోరింగ్ గా మారిపోయినప్పటికీ.. ఒక ఆటగాడి పూర్తి నైపుణ్యం టెస్ట్ క్రికెట్ ద్వారానే బయటపడుతుంది.

టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యున్నతమైన సిరీస్ గా యాషెస్ కు పేరుంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య దశాబ్దాలుగా ఈ టెస్ట్ సిరీస్ నడుస్తోంది. రెండు జట్ల ఆటగాళ్లు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతుంటారు.. యాషెస్ లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టులు సాగుతుంటాయి.. ఒక రకంగా ఈ సిరీస్ యుద్ధంలాగా నడుస్తూ ఉంటుంది.

ఐదు రోజులపాటు జరిగే ప్రతి టెస్ట్ రెండు జట్ల మధ్య రసవత్తరమైన పోటీకి కేంద్ర బిందువు అవుతుంది. చూసే ప్రేక్షకులకు అమితమైన క్రికెట్ ఆనందాన్ని అందిస్తుంది. ఇంతటి చరిత్ర ఉంది కాబట్టే యాషెస్ ఇప్పటికీ వెలుగొందుతూనే ఉంది. రెండు జట్ల నుంచి ఎంతో మంది ప్లేయర్లు యాషెస్ లో తమ సత్తా చూపించారు. చూపిస్తూనే ఉన్నారు.

యాషెస్ లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ ఉంటుంది. కంగారు జట్టుది పై చేయి లాగా కనిపిస్తున్నప్పటికీ.. ఇంగ్లాండ్ జట్టు అంత సులువుగా ఆస్ట్రేలియాకు యాషెస్ ను అప్పగించదు. ఎందుకంటే పోరాటం ఆ జట్టు రక్తంలో ఉంది. దూకుడు అనేది ఆస్ట్రేలియా కు పర్యాయపదంగా ఉంది. అందువల్లే ఈ రెండు జట్లు ఆడుతుంటే క్రికెట్ అభిమానులు ఆస్వాదిస్తూ ఉంటారు.

ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ చాలా డిఫరెంట్ గా సాగుతోంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. బౌలర్లకు ప్యారడైజ్ గా పేరుపొందిన పెర్త్ మైదానంలో రెండు రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్ ముగిసింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ 847 బంతుల్లోనే ముగిసింది. 20వ శతాబ్దం మొదలైన తర్వాత అతి తక్కువ బంతుల్లో ముగిసిన యాషెస్ మ్యాచ్ ఇదే కావడం విశేషం. 18 95లో సిడ్నీలో జరిగిన మ్యాచ్ 911 బంతుల్లో ముగిసింది. పెర్త్ టెస్టులో ఇంగ్లాండ్ బ్యాటర్లు 405 బంతులు మాత్రమే ఎదుర్కొన్నారు.. 1904 తర్వాత ఇంగ్లాండ్ జట్టు అతి తక్కువ ఓవర్లలో రెండు ఇన్నింగ్స్ లను ముగించడం ఇదే ప్రథమం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular