https://oktelugu.com/

Border Gavaskar Trophy : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఆస్ట్రేలియా సై.. టీమిండియా ధీటుగా జట్టుకూర్పు..ప్లేయింగ్ -11 లో అన్ క్యాప్డ్ ఆటగాళ్లు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఆస్ట్రేలియా కూడా సిద్ధమవుతోంది. టీమిండియా కు దీటుగా జట్టు కూర్పు చేపట్టింది.. పెర్త్ టెస్ట్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా ప్లేయింగ్ -11 జట్టును ప్రకటించింది.

Written By: Anabothula Bhaskar, Updated On : November 19, 2024 9:36 pm
Border Gavaskar Trophy

Border Gavaskar Trophy

Follow us on

Border Gavaskar Trophy : గత రెండు సీజన్లలో ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా గెలవాలని ఆస్ట్రేలియా జట్టు భావిస్తోంది. స్వదేశంలో జరిగే ఐదు టెస్టుల సిరీస్ ను గెలవాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా ప్యాట్ కమిన్స్ తో 13 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. అయితే ఇందులో అనూహ్యంగా అన్ క్యాప్డ్ ఆటగాళ్లకు చోటు ఇచ్చింది. ఇక ఓపెనర్ వార్నర్ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు ప్రకటించడంతో.. ఈ మ్యాచ్లో ఉస్మాన్ ఖవాజా, యువ ఆటగాడు మెక్ స్వీనే ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. స్వీనే ఓపెనర్ గా బరిలో దిగడం ఇదే తొలిసారి. దేశవాళి క్రికెట్లో స్వీనే సత్తా చాటుతున్నాడు. ఆస్ట్రేలియా – ఏ జట్టు తరఫున అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో అతడికి ఓపెనర్ గా అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. లబుషేన్, స్టీవ్ స్మిత్, హెడ్ తదుపరి స్థానాలలో ఆడతారని తెలుస్తోంది. ఫాస్ట్ బౌలర్, ఆల్ రౌండర్ గా మిచెల్ మార్ష్ కు జట్టులో కీలకంగా ఉండనున్నాడు. అలెక్సీ కేరీ వికెట్ కీపర్ గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. నాథన్ లయన్ స్పిన్ బౌలింగ్ భారాన్ని మోయనున్నాడు. స్కాట్ బొలాండ్, జోస్ ఇంగ్లిస్ కు నిరాశ తప్పదని తెలుస్తోంది.

ఒక్క స్పిన్ బౌలర్ తో..

పెర్త్ మైదానం పేస్ బౌలింగ్ కు సహకరిస్తుంది. అందువల్లే ఆస్ట్రేలియా జట్టు లయన్ ను మాత్రమే స్పిన్ బౌలర్ గా తీసుకుంది. ఏకంగా నలుగురు పేస్ బౌలర్లతో రంగంలోకి దిగుతోంది. ఈసారి ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో ఈ ప్రణాళికతో బరిలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. గత రెండు సీజన్లలో ఆస్ట్రేలియా జట్టు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోల్పోయింది. అయితే ఈసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో అడుగుపెట్టి మరోసారి టెస్ట్ గదను దక్కించుకోవాలని ఆస్ట్రేలియా భావిస్తున్నది. ఇందులో భాగంగానే జట్టు కూర్పును సమర్థవంతంగా చేసినట్టు ఆస్ట్రేలియా మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా, ఇటీవల ఆస్ట్రేలియా జట్టు టెస్ట్ క్రికెట్లో అద్భుతమైన విజయాలు సాధిస్తున్నది. భారత్ న్యూజిలాండ్ చేతిలో మూడు టెస్టులు ఓడిపోవడం కూడా ఆస్ట్రేలియా జట్టుకు కలిసి వచ్చింది. అందువల్లే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ సైకిల్ లో నెంబర్ వన్ స్థానంలోకి వచ్చింది. భారత్ పై కూడా నెంబర్ వన్ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తోంది. ఇదే ఊపులో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లోకి వెళ్ళి గదను దక్కించుకోవాలని యోచిస్తోంది.

ఆస్ట్రేలియా జట్టు ఇదే

పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, ఉస్మాన్ ఖవాజా, లబు షేన్, కేరీ, ట్రావిస్ హెడ్, నాథన్ మెక్ స్వీనే, మిచెల్ మార్ష్, మిచెల్ స్టార్క్.