Asia Cup 2025 Shubman Gill: ఆసియా కప్ లో భాగంగా టీమ్ ఇండియా, పాకిస్తాన్ ఆదివారం సూపర్ 4 లో తలపడబోతున్నాయి. ఇప్పటికే లీగ్ దశలో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించింది. విజయం సాధించిన అనంతరం భారత జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఇది వివాదంగా మారింది. రోజులపాటు మీడియాలో చర్చ జరిగింది.
ఈ వివాదం తర్వాత టీమిండియా, పాకిస్తాన్ తల పడబోతున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ పై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఈ మ్యాచ్ గెలిస్తే టీమిండియా కప్ వేటలో మరో అడుగు ముందుకు వేసినట్టే. వాస్తవానికి ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా విజయం లాంచనమే అయినప్పటికీ… కొన్ని విషయాలలో ఇబ్బంది ఎదురవుతున్నది. ముఖ్యంగా ఓపెనర్ గిల్ ఫామ్ లేమి జట్టును తీవ్రంగా ఇబ్బంది పడుతున్నది. అతడు సరైన ఫామ్ లో లేకపోవడంతో పరుగులు తీయలేకపోతున్నాడు. ఫ్లైటేడ్ డెలివరీలను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. ఒమన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అతడు ఆ డెలివరీకి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇప్పటివరకు ఆసియా కప్ లో టీం ఇండియా మూడు మ్యాచ్లు ఆడగా.. మూడు మ్యాచ్ లలోనూ గిల్ చెప్పుకోదగ్గ స్థాయిలో ఇన్నింగ్స్ ఆడ లేకపోయాడు. ఆసియా కప్ కంటే ముందు టీమిండియా ఇంగ్లాండ్ లో పర్యటించింది. ఐదు టెస్టుల సిరీస్ ఆడింది. ఈ సిరీస్లో గిల్ పరుగుల ప్రవాహాన్ని కొనసాగించాడు. సెంచరీల మీద సెంచరీలు కొట్టాడు. కానీ ఇప్పుడు మాత్రం విఫలమవుతున్నాడు.
ఒమన్ తో జరిగిన మ్యాచ్లో టీమిండియా విజయం సాధించిన తర్వాత.. ప్రాక్టీస్ చేయలేదు. ఆప్షనల్ నెట్ సెషన్స్ కావడంతో టీమిండియా ఆటగాళ్లు బయటికి రాలేదు. అయితే గిల్ మాత్రం బయటికి వచ్చాడు. తీవ్రంగా సాధన చేశాడు. తనని ఇబ్బంది పెడుతున్న బంతులను పదేపదే వేయించుకొని తన లోపాన్ని అధిగమించే ప్రయత్నం చేశాడు. అభిషేక్ శర్మతో ఫ్లైటేడ్ డెలివరీలు వేయించుకొని ప్రాక్టీస్ చేశాడు. అయితే ఆ బంతులను ఎదుర్కోవడంలో గిల్ తీవ్రంగా తడబడ్డాడు. మరోవైపు వరుణ్ చక్రవర్తి కూడా ప్రాక్టీస్ చేశాడు. ఒమన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి రిజర్వ్ బెంచుకు పరిమితమయ్యాడు. పాకిస్తాన్ జట్టుతో జరిగే మ్యాచ్లో అతడికి అవకాశం లభించినట్టే. గిల్ కనుక ఈ మ్యాచ్లో తన ఫామ్ ను దొరకబుచ్చుకుంటే టీమిండియా కు ఇబ్బంది ఉండదు.
Shubman Gill on the grind
Putting in extra hours with coach Sitanshu Kotak ahead of the big Pakistan clash in the Asia Cup.
Watch: https://t.co/Yid6FHQjv7 pic.twitter.com/eYpPDZh9z7
— TOI Sports (@toisports) September 21, 2025