Asia Cup 2023: ఆసియా కప్ టోర్నీ కీలక దశకు చేరుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ భారీ పరుగుల తేడాతో విజయం సాధించింది.. ఈ విజయంతో పాయింట్ల జాబితాలో మొదటి స్థానంలోకి దూసుకెళ్లింది. భారత్ తర్వాత మిగతా స్థానాల్లో శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్ కొనసాగుతున్నాయి. వాస్తవానికి సోమవారం జరిగిన మ్యాచ్లో భారత్ మీద పాకిస్తాన్ ఒకవేళ గెలిచి ఉంటే పాయింట్ల పట్టికలో అది మొదటి స్థానంలో ఉండేది. కానీ బంగ్లా జట్టు మీద చూపించిన ప్రతాపం.. భారత జట్టు విషయానికి వచ్చేసరికి చల్లారిపోయింది. ఫలితంగా పాకిస్తాన్ దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. అయితే ఆసియా కప్ లో పాకిస్తాన్ జట్టు ఫైనల్ చేరాలి అంటే.. అది భారత జట్టు ఆడే తీరుపై ఇప్పుడు ఆధారపడి ఉంది.
ఇక కీలకమైన సూపర్ _4 పోరులో శ్రీలంక జట్టుతో భారత్ తలపడనుంది. డిపెండింగ్ ఛాంపియన్ అయిన శ్రీలంకను ఓడించేందుకు భారత సర్వశక్తులు కూడ దీసుకుంది. అయితే ఈ మ్యాచ్లో శ్రీలంకను ఎలాగైనా ఓడించి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోవాలని భారత జట్టు భావిస్తోంది. టోర్నీ సూపర్ _4 దశలో భారత జట్టుతో పడక ముందు పాకిస్తాన్ జట్టు బంగ్లాదేశ్ తో ఆడి ఓడించింది.. అయితే సూపర్_4 దశలో పాకిస్తాన్ జట్టుకు మరొక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. తన చివరి మ్యాచ్ ను పాకిస్తాన్ జట్టు శ్రీలంకతో ఆడుతుంది. అయితే సూపర్ _4 స్టాండింగ్స్ లో పాకిస్తాన్ జట్టు కంటే శ్రీలంక వెనుకబడి ఉంది. ఇక వరుస ఓటములతో బంగ్లాదేశ్ గ్రూప్- 4 పాయింట్ల పట్టికలో అట్టడుగులో ఉంది. బంగ్లాదేశ్ జట్టు అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్లో విఫలమవుతోంది. అందుకే దారుణమైన పరాజయాలను మూట కట్టుకుంటున్నది.. కనీసం ప్రతిఘటించే ప్రయత్నం కూడా ఆ జట్టు ఆటగాళ్లు చేయడం లేదు. ఇది అంతిమంగా ఆ జట్టు విజయావకాశాలను దెబ్బతీస్తోంది. ఇక సూపర్_4 దశలో పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో బాంగ్లాదేశ్ ఆశించినంత ఆట తీరు కనబరచలేదు.
శ్రీలంకతో జరిగే మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తే.. పాయింట్లు పట్టికలో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటుంది. సూపర్ _4 పాయింట్ల పట్టికలో 2 పాయింట్లు, +4.560 నెట్ రన్ రేటు తో భారత జట్టు అగ్రస్థానంలో ఉంది. శ్రీలంక +0.420 నెట్ రన్ రేటు తో రెండవ స్థానంలో, పాక్ -1.892 రన్ రేటు తో మూడవ స్థానంలో ఉంది. అయితే ఈ ఆసియా కప్ రేసులో తన ఆశలు సజీవంగా ఉండాలంటే పాకిస్తాన్ కచ్చితంగా సూపర్ _4 మ్యాచ్లో శ్రీలంక జట్టును ఓడించాలి. ఇదే సమయంలో పాకిస్తాన్ ఆసియా కప్ ఫైనల్ రావాలి అంటే భారత జట్టు తన తదుపరి రెండు మ్యాచ్లను కూడా గెలుపొందాలి. ఈ విజయాలు సాధిస్తే భారత జట్టు పాయింట్లు పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఒకవేళ శ్రీలంక సూపర్ -4 దశలో భారత్, పాకిస్తాన్ లను అధిగమిస్తే ఫైనల్ చేరుకుంటుంది. ఒకవేళ భారత్ బంగ్లాదేశ్ చెట్టు చేతిలో ఓడిపోతే పాకిస్తాన్ జట్టుకు ఫైనల్ వెళ్లే అవకాశం ఉంటుంది. మంగళవారం జరిగే మ్యాచ్ లో భారత్ కనుక శ్రీలంక జట్టుపై విజయం సాధిస్తే పాకిస్తాన్ జట్టుకు ఫైనల్ వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అప్పుడు నెట్ రన్ రేట్ పరిగణలోకి రాదు. అప్పుడు ఫైనల్ వెళ్లే జట్టును నిర్ధారించేందుకు శ్రీలంకతో వర్చువల్ క్వార్టర్_ ఫైనల్ ఆడే అవకాశం ఉండొచ్చు.