Argentina vs France : అర్జెంటీనా, ఫ్రాన్స్ ఫైనల్ ప్రయాణం సాగింది ఇలా..

Argentina vs France : చిన్న జట్ల సంచలనాలు, పెద్ద జట్ల పతనాలు.. యువ కెరటాల అద్భుతాలు అన్నీ ఈ సాకర్ కప్ లో చూసాం.. ఆ నిర్వచనీయ అనుభూతులతో ఉర్రూ తలూగిపోయాం. ప్రపంచ ఫుట్ బాల్ ప్రేమికులందర్నీ మునివేళ్లపై నిలబెట్టే సమరానికి ఇక రంగం సిద్ధమైంది.. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు తలపడే అర్హత టోర్నీ అనే క్రతువు పూర్తిచేసుకుని.. 32 జట్లు పోటీపడే అసలు టోర్నీ లోకి అడుగుపెట్టి.. నెలరోజుల హోరాహోరీ, ఉత్కంఠ భరిత పోరాటాల […]

Written By: NARESH, Updated On : December 18, 2022 10:14 am
Follow us on

Argentina vs France : చిన్న జట్ల సంచలనాలు, పెద్ద జట్ల పతనాలు.. యువ కెరటాల అద్భుతాలు అన్నీ ఈ సాకర్ కప్ లో చూసాం.. ఆ నిర్వచనీయ అనుభూతులతో ఉర్రూ తలూగిపోయాం. ప్రపంచ ఫుట్ బాల్ ప్రేమికులందర్నీ మునివేళ్లపై నిలబెట్టే సమరానికి ఇక రంగం సిద్ధమైంది.. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు తలపడే అర్హత టోర్నీ అనే క్రతువు పూర్తిచేసుకుని.. 32 జట్లు పోటీపడే అసలు టోర్నీ లోకి అడుగుపెట్టి.. నెలరోజుల హోరాహోరీ, ఉత్కంఠ భరిత పోరాటాల అనంతరం.. కప్ కోసం మిగిలిన ఆ రెండు జట్ల మధ్య అంతిమయుద్ధం ఆదివారమే.. తొలి మ్యాచ్ లో దిమ్మతిరిగే షాక్ తిని, నిష్క్రమణ కత్తి వేలాడుతుండగా, ఉత్కంఠ భరిత క్షణాలను అధిగమిస్తూ, ఒక్కో అడ్డంకిని దాటుతూ ఫైనల్ చేరిన అర్జెంటీనా.. నాకౌట్ బెర్త్ ఖరారు చేసుకున్నాక.. గ్రూప్ దశలో ట్యునిసియా చేతిలో అనూహ్య ఓటమి ఎదురైనా.. ఆ తర్వాత స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తూ ఫైనల్లో అడుగుపెట్టిన ఫ్రాన్స్… మొత్తానికి ఈ రెండు జట్లు ఫిఫా కప్ కోసం హోరాహోరీగా కొట్లాడబోతున్నాయి. ఈ టోర్నీలో బ్రెజిల్, జర్మనీ, స్పెయిన్, ఇంగ్లాండ్ ఇలా అన్నీ వెనుదిరిగాయి..ఇప్పుడు మిగిలింది కేవలం ఫ్రాన్స్, అర్జెంటీనా. రెండు జట్లలో ఎది కప్ గెలిచినా చరిత్రే అవుతుంది. కానీ ఈ రెండు జట్లు ఫైనల్ అంత ఆషామాషీగా చేరలేదు. వాటి ప్రయాణం అంత కేక్ వాక్ కాలేదు.

-ప్రయాణం సాగింది ఇలా

అర్జెంటీనా తన తొలి మ్యాచ్ సౌదీ అరేబియా తో ఆడింది. 1_2 గోల్స్ తేడాతో ఓడిపోయింది. రెండో మ్యాచ్ మెక్సికో తో ఆడి 2_0 గోల్స్ తేడాతో గెలిచింది.. మూడో మ్యాచ్ పోలెండ్ తో ఆడి 2_0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ప్రి క్వార్టర్స్ లో ఆస్ట్రేలియాపై 2_1 గోల్స్ తేడాతో విజయం సాధించింది.. క్వార్టర్స్ లో డచ్ జట్టు పై 2_2(4_3) గోల్స్ తేడాతో గెలిచింది. సెమీస్ లో క్రొయేషియా పై 3_0 గోల్స్ తేడాతో గెలుపొందింది.

-ఫ్రాన్స్ ఇలా..

ఫ్రాన్స్ జట్టు తన తొలి మ్యాచ్ ఆస్ట్రేలియా తో ఆడింది. 4_1 గోల్స్ తేడాతో గెలుపొందింది. డెన్మార్క్ తో ఆడిన మ్యాచ్లో 2_1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ట్యునేషియా తో జరిగిన మ్యాచ్ లో 1-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. పోలాండ్ తో జరిగిన మ్యాచ్ లో 3_1 గోల్స్ తేడాతో గెలుపొందింది. ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 2_1 గోల్స్ తేడాతో విజయ పతాకం ఎగరేసింది. మొరాకోతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో 2-0 గోల్స్ తేడాతో గెలుపొందింది. ఇక ప్రపంచ కప్ లో ఫ్రాన్స్ తో జరిగిన మూడు మ్యాచ్ లలో అర్జెంటీనా 1930, 1978 లో రెండుసార్లు, 2018 ప్రీ క్వార్టర్స్ లో మాత్రం ఫ్రాన్స్ విజయం సాధించాయి. అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య ఇప్పటివరకు 12 మ్యాచ్ లు జరిగాయి.. వీటిల్లో అర్జెంటీనా ఆరు, ఫ్రాన్స్ మూడింట్లో విజయాలు సాధించాయి. మూడు మ్యాచ్ లు డ్రా గా ముగిశాయి. ఇక ప్రపంచ కప్ లో అర్జెంటీనా 47 మ్యాచ్ లో గెలుపొందింది.. వీటిలో 16 డ్రా గా ముగిశాయి. 24 మ్యాచ్ ల్లో ఓటమి చెందింది. ఇక ఫ్రాన్స్ 39 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. 13 మ్యాచ్ లను డ్రా చేసుకుంది. 20 మ్యాచ్ ల్లో ఓటమిపాలైంది.