Pakistani And Bangladesh: ఎన్ని రకాల డ్రామాలు ఆడినప్పటికీ.. ఎన్ని రకాల వేషాలు వేసినప్పటికీ.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దిగిరాక తప్పలేదు. ఐసీసీ విధించిన నిబంధనల ముందు తలవంచక తప్పలేదు. దీంతో టీమ్ ఇండియా తో మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒప్పుకుంది.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒప్పుకోవడంతో ఫిబ్రవరి 15న భారత్ తో పాకిస్తాన్ తలపడుతోంది. కొలంబో వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. సాయంత్రం ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. కొలంబోలో వర్షం కురుస్తున్న నేపథ్యంలో మ్యాచ్ నిర్వహణకు కాస్త అంతరాయం ఏర్పడవచ్చు అని తెలుస్తోంది.
మ్యాచ్ ప్రారంభం కాకముందుకే పాకిస్తాన్ జట్టుకు.. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు గుండె పగిలే వార్త ఒకటి మీడియాలో కనిపిస్తోంది. ఆ వీడియో కాస్త ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది.
టి20 వరల్డ్ కప్ కంటే ముందు బంగ్లాదేశ్ ప్లేయర్ ను ఐపీఎల్ నుంచి బీసీసీఐ తొలగించింది. దీంతో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మొత్తానికే టి20 వరల్డ్ కప్ నుంచి తప్పుకుంది. భారతదేశంలో తమ ప్లేయర్లకు సరైన భద్రత ఉండదని ఆరోపించింది. అందువల్లే తమ జట్టు ఆడే మ్యాచ్ లు తటస్థ వేదికలలో నిర్వహించాలని డిమాండ్ చేసింది.
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చేసిన డిమాండ్లో వాస్తవం లేకపోవడంతో ఐసిసి పక్కన పెట్టింది. దీంతో బంగ్లాదేశ్ ఒంటరి పోరాటం చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఇక ప్రస్తుతం బంగ్లాదేశ్ టి20 వరల్డ్ కప్ లో ఆడకుండా అలానే ఉండిపోయింది. అటు ఇన్ని రోజుల పాటు సపోర్ట్ చేసిన పాకిస్తాన్ దర్జాగా t20 వరల్డ్ కప్ ఆడుతోంది.
వాస్తవానికి భారత్ అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ కు మొదటి నుంచి కూడా మంటే. అందువల్లే ఏదో ఒక రకంగా అక్కసు తీర్చుకోడానికి ప్రయత్నాలు చేస్తుంటాయి. టీమిండియా వేదికగా టి20 వరల్డ్ కప్ జరుగుతుండడాన్ని తట్టుకోలేక.. లేనిపోని ఆరోపణలు చేశాయి పాకిస్తాన్, బంగ్లాదేశ్.
ఇప్పుడు పాకిస్తాను, బంగ్లాదేశ్ కు గుండె పగిలే వార్త ఒకటి బయటికి వచ్చింది. టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లాండ్ క్రికెటర్లు వారి మ్యాచ్లు మనదేశంలో ఆడుతున్నారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ క్రికెటర్లు ముంబై వీధులలో స్వేచ్ఛగా సంచరిస్తున్నారు. ఇంగ్లాండ్ క్రికెటర్లు జోప్రా ఆర్చర్, డాసన్ ముంబైలోని సముద్రం ఎదురుగా ఉన్న మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో కూర్చున్నారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు.
” భారతదేశంలో భద్రత లేదన్నారు. మా ఆటగాళ్లకు సెక్యూరిటీ లేదని నోరు కొట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. మొన్నటికి మొన్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా విదేశీ మహిళా క్రికెటర్లు మా దేశంలో స్వేచ్ఛగా విహరించారు. ఇప్పుడు ఇంగ్లాండ్ క్రికెటర్లు సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. వారి దేశానికి అంటే మిన్నగా మా దేశంలో స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. ఇంతటి స్వేచ్ఛ మీ దేశంలో దొరుకుతుందా.. ఇలాంటి భద్రత ఇవ్వడం మీ వల్ల అవుతుందా” అంటూ భారత నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Another crying moment for Pakistani and Bangladeshi fans
Jofra Archer and Liam Dawson are enjoying themselves at Marine Drive in Mumbai without any security. This shows how safe India is for everyone
But just a few days ago, BCB and PCB were raising concerns about… pic.twitter.com/VDXhcALiMe
— Sonu (@Cricket_live247) February 15, 2026