Ishan Kishan: అమితాబచ్చన్ కేబీసీ లో పాల్గొని టీమిండియాలో చోటు కోల్పోయిన యంగ్ క్రికెటర్…

ఇషాన్ కిసాన్ ని సెలెక్ట్ చేయకపోవడానికి కారణం ఏంటి అంటే ఆయన సౌతాఫ్రికా తో సిరీస్ ఆడుతున్నప్పుడు తనకు మానసిక అలసట ఉందని కొద్ది రోజులు రెస్ట్ కావాలని అలాగే తన ఫ్యామిలీ తో కొద్ది రోజులు స్పెండ్ చేయాలని చెప్పి ఆ సిరీస్ మధ్యలో నుంచే తప్పుకొని ఇండియాకి వచ్చేసాడు.

Written By: Gopi, Updated On : January 11, 2024 11:20 am

Ishan Kishan

Follow us on

Ishan Kishan: ఆఫ్ఘనిస్తాన్ తో ఆడే టి20 సీరీస్ కోసం యంగ్ ప్లేయర్ అయిన ఇషాన్ కిషాన్ ని సెలెక్ట్ చేయలేదు. అయితే దీని మీద ఇప్పుడు చాలా రకాల చర్చలు అయితే జరుగుతున్నాయి.ఇషాన్ కిసాన్ ని సెలెక్ట్ చేయకపోవడానికి కారణం ఏంటి అంటే ఆయన సౌతాఫ్రికా తో సిరీస్ ఆడుతున్నప్పుడు తనకు మానసిక అలసట ఉందని కొద్ది రోజులు రెస్ట్ కావాలని అలాగే తన ఫ్యామిలీ తో కొద్ది రోజులు స్పెండ్ చేయాలని చెప్పి ఆ సిరీస్ మధ్యలో నుంచే తప్పుకొని ఇండియాకి వచ్చేసాడు.

కానీ ఆయన రెస్ట్ తీసుకోకుండా దుబాయ్ కి వెళ్లి పార్టీ చేసుకున్నాడు.అలాగే అమితాబచ్చన్ షో అయిన కౌన్ బనేగా కరోడ్ పతి షోలో స్మృతి మందాన తో కలిసి పాల్గొన్నాడు అయితే ఈ విషయం మీద బీసీసీఐ ఇషాన్ కిషన్ మీద కోపం తో ఉందనే న్యూస్ బయటికి వచ్చింది.
ఇక అందువల్లే అతన్ని ఆఫ్గనిస్తాన్ సిరీస్ కోసం సెలెక్ట్ చేయలేదని వార్తలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇక దీని మీద రీసెంట్ గా ఇండియన్ టీం ప్రధాన కోచ్ అయిన రాహుల్ ద్రావిడ్ స్పందిస్తూ ఇషాన్ కిషన్ సౌతాఫ్రికా టూర్ నుంచి తప్పుకున్న తర్వాత ఆయన ఆఫ్ఘనిస్తాన్ టీం కి అందుబాటులోకి రాలేదు అందువల్లే అతన్ని సెలెక్ట్ చేయలేదు.

అంతే తప్ప మీరందరూ అనుకుంటున్నట్టు ఏమీ లేదు అంటూ తన క్లియర్ కట్ గా ఎక్స్ ప్లెయిన్ చేశాడు.ఇక అయినప్పటికీ ఇసాన్ కిషన్ రెస్ట్ తీసుకుంటానని చెప్పి దుబాయ్ లో పార్టీలు చేసుకోవడం, టివీ షో లో పాల్గొనడం పట్ల బిసిసిఐ కోపంతో ఉండటమే దానికి ప్రధాన కారణం అంటూ మరి కొంతమంది సీనియర్ ప్లేయర్లు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా అమితాబచ్చన్ షో ఇషాన్ కిషన్ కొంపముంచిందనే చెప్పాలి. మరి యంగ్ ప్లేయర్ వరల్డ్ కప్ వరకు అయిన అందుబాటులో ఉంటాడా అతన్ని అప్పుడు కూడా సెలెక్ట్ చేస్తారా లేదా అనే విషయం కూడా తెలియాల్సి ఉంది.
అయితే ఆఫ్ఘనిస్తాన్ తో టి20 సిరీస్ కి ఇషాన్ కిషన్ ప్లేస్ లో జితేష్ శర్మ, సంజు శాంసన్ లాంటి ప్లేయర్లను సెలెక్ట్ చేశారు…