Odi World Cup 2023: వరల్డ్ కప్ లో ప్రత్యర్థి బ్యాట్స్ మెన్స్ ని కట్టడి చేయాలంటే బౌలర్లు చాలా రకాలైన వ్యూహాలతో వాళ్ళని డామినేట్ చేస్తూ ముప్పు తిప్పలు పెట్టి కన్ఫ్యూజన్ లో పడేసి వాళ్ళని అవుట్ చేయడం ఒకటే దారి… కొంతమంది బ్యాట్స్ మెన్స్ అయితే చాలా దీటుగా బౌలర్లను ఎదుర్కొంటూ పరుగుల వరద పారిస్తారు. అయితే ఒక మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ ని వదిలేస్తే ఫీల్డింగ్ గురించి కూడా మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి… ఒక బౌలర్ వేసిన బంతిని సరిగ్గా క్యాలిక్యులేట్ చేయలేని బ్యాట్స్ మెన్స్ ఎక్స ట్రా షాట్ ఆడినప్పుడు అది క్యాచ్ రూపంలో గాల్లోకి లేచినప్పుడు దానిని కరెక్ట్ గా క్యాచ్ పట్టే వాళ్ళు కావాలి అంటే ప్లేయర్ ఎప్పుడు ఫీల్డ్ లో ఒక చిరుత పులి వేట కి వెళితే ఎంత షార్ప్ గా అయితే ఉంటుందొ అలా ప్లేయర్ కూడా బాల్ ని పట్టుకోవడం లో అంత షార్ప్ గా ఉండాలి.ఏ మాత్రం నిర్లక్ష్యం వహించి ఒక్క క్యాచ్ మిస్ చేసిన కూడా మ్యాచ్ మొత్తాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది…
ఇంతకుముందు అలా ఆడి ఓడిపోయిన టీమ్ లు చాలా ఉన్నాయి. అలాగే ప్రతి ప్లేయర్ కూడా బౌండర్ లైన్స్ దగ్గర ఎక్కువగా ఫోర్ లను ఆపుతూ టీం స్కోర్ ని సేవ్ చేస్తూ ఉండాలి, అలాంటి సమయంలో మాత్రమే టీమ్ విజయం సాధిస్తుంది.ఇక ఇలాంటి సమయంలో ఫీల్డర్ కీలకపాత్ర వహిస్తాడు తను ఆపిన ఆ ఒక్క రన్ వల్లే చివర్లో మ్యాచ్ గెలవవచ్చు అలా ఒకటి, రెండు పరుగులతో మ్యాచ్ లు గెలిచిన టీమ్ లు చాలానే ఉన్నాయి… క్యాచ్ లు మిస్ చేయడం వల్ల భారీ మూల్యాన్ని చెల్లించుకుంటు వరల్డ్ కప్ లో ఓడిపోయిన టీమ్ లు ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం…
ఇక 1990 వ సంవత్సరం లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియా టీమ్ ల మధ్య సూపర్ సిక్స్ లెవల్ లో ఒక మ్యాచ్ జరిగింది.ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా టీమ్ చాలా దాటి గా ఆడుతూ 271 పరుగుల భారీ స్కోరు అయితే చేసింది…ఇక సౌతాఫ్రికా టీమ్ లో హర్షల్ గిబ్స్ ఒక అద్భుతమైన సెంచరీ చేసి సౌతాఫ్రికా కి భారీ స్కోరు అందించాడు. అయినప్పటికీ 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా టీమ్ మొదట కొంత వరకు తడపడింది.ఇక అదే టైం లో స్టీవా క్రీజ్ లోకి వచ్చాడు ఆయన కొట్టిన ఒక షాట్ సరిగ్గా కనెక్ట్ అవ్వక పోవడం తో అది క్యాచ్ గా మారింది. అయితే ఆ క్యాచ్ ని సరిగ్గా అంచన వేయలేని గిబ్స్ దాన్ని మిస్ చేశాడు…ఇక దాంతో స్టీవా ఒక అద్భుతమైన సెంచరీ చేసి ఆస్ట్రేలియా కి ఒక అదిరిపోయే విజయాన్ని అందించాడు…అలా వాళ్ళు ఆ ఇయర్ వరల్డ్ కప్ ని కూడా సాధించారు…
ఇక 1992 వ సంవత్సరం లో పాకిస్థాన్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఒక భారీ మ్యాచ్ జరిగింది.ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ టీమ్ ఓపెనర్లు అయిన సొహైల్,రమీజ్ రజాలు ఇద్దరు కూడా ఇంగ్లాండ్ బౌలర్ అయిన డెరిక్ ప్రింగిల్ వేసిన బాల్స్ ని సరిగ్గా ఎదురుకొలేక ఔట్ అయి పెవిలియన్ చేరుకున్నారు…ఇక అప్పటికే పాకిస్థాన్ స్కోర్ రెండు వికెట్లను కోల్పోయి 24 పరుగులు చేసింది.ఇక ఆల్‌రౌండర్ అయిన పాకిస్తాన్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ క్రీజ్ లోకి రావడం జరిగింది. ఇక ఇంగ్లాండ్ బౌలర్ అయిన ఫిల్ డిఫ్రిటాస్ బౌలింగ్‌లో ఓ అనవసరపు షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ అది సరిగ్గా కనెక్ట్ అవ్వక పోవడంతో అది బ్యాట్ ఎడ్జ్ కి తాకి అక్కడే క్యాచ్ లేచింది కానీ కెప్టెన్ గ్రాహం ఆ క్యాచ్‌ను వదిలేసి భారీ తప్పు చేసాడు.ఒక లైఫ్ వచ్చిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ చాలా లాంగ్ ఇన్నింగ్స్ ఆడుతూ ఆ మ్యాచ్ లో 72 పరుగులు చేశాడు. వారి జట్టులో అతడే టాప్ స్కోరర్ ఇక ఈ మ్యాచ్ లో పాక్ మొత్తం 249 పరుగులు సాధించింది. ఇక 250 పరుగుల భారీ లక్ష్యం తో బరిలోకి దిగినప్పటికి పాకిస్థాన్ బౌలర్ల దెబ్బ కి ఇంగ్లాండ్ ప్లేయర్లు చేతులు ఎత్తేశారు ఇక దానితో పాకిస్థాన్ ఆ మ్యాచ్ గెలిచింది…
ఇక ఇది ఇలా ఉంటే 2015 వ సంవత్సరం లో వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ లో న్యూజిలాండ్, వెస్టిండీస్ టీమ్ ల మధ్య ఒక మ్యాచ్ జరిగింది.ఇందులో న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్స్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు ఆ ఇయర్ న్యూజిలాండ్ అన్ని మ్యాచ్ లు గెలుస్తూ వచ్చింది.ఇక న్యూజిలాండ్ ఓపెనర్ అయిన మార్టిన్ గప్తిల్ చాలా జోరు మీద కనిపించాడు.అయితే టేలర్ వేసిన ఒక బంతిని ఎలా ఆడాలో తెలియక గప్తిల్ బౌండరీ లైన్ మీదుగా ఒక షాట్ ఆడాలి అనుకున్నాడు కానీ అది అంత పర్ఫెక్ట్ గా మ్యాచ్ కాకపోవడంతో శ్యామూల్స్ దగ్గరికి క్యాచ్ వెళ్ళింది. కానీ కన్ ఫ్యూజ్ అయిన శ్యామూల్స్ ఆ క్యాచ్ ని వదిలేశాడు దాంతో గప్తిల్ ఆ మ్యాచ్ లో 237 పరుగుల భారీ స్కోరు చేసి ప్రపంచ కప్ హిస్టరీలో ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా గుర్తింపు పొందాడు…
ఇలా ఇక్కడ ఒక్క క్యాచ్ వదిలేయడం వల్ల వరల్డ్ కప్ నే కోల్పోయిన టీములు చాలానే ఉన్నాయి.కాబట్టి ఇండియన్ టీమ్ ఇక మీదట ఆడే సెమీ ఫైనల్ లో కానీ, ఫైనల్ మ్యాచ్ లో కానీ బ్యాటింగ్, బౌలింగ్ తో పాటు గా ఫీల్డింగ్ మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టాలి…అలా అయితేనే ఈసారి మనం వరల్డ్ కప్ కొట్టగలం…