Wrestling: బిగ్ బ్రేకింగ్: భారత రెజ్లర్లకు ఎదురుదెబ్బ.. సస్పెన్షన్ వేటు

భారతీయ రెజ్లర్లు వరుస నిరసనలు తార స్థాయికి చేరడం, ఇందులో వివిధ రకాల రాజకీయ పార్టీలు కావడంతో ఈ వివాదం కాస్త చినికి చినికి గాలి వాన లాగా మారింది. దీంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపుతప్పింది.

Written By: Bhaskar, Updated On : August 24, 2023 5:48 pm

Wrestling:

Follow us on

Wrestling: మొన్నటి దాకా నిరసన ప్రదర్శనలు నిర్వహించి వార్తల్లో వ్యక్తులైన భారత రెజ్లర్లకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఎన్నికలు సకాలంలో నిర్వహించడంలో విఫలమైనందున రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సస్పెన్షన్ వేటు విధించింది. ఈ నిర్ణయం గురువారం నుంచే తక్షణమే అమలులోకి వచ్చేలా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సభ్యత్వాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది. తదుపరి గవర్నింగ్ బాడీ కి ఏడాది జూన్ నెలలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే పలువురు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్, భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు బ్రిజ్ భూషణ్ సింగ్ పై భారతీయ రెజ్లర్లు వరుస నిరసనలు చేపట్టారు.

భారతీయ రెజ్లర్లు వరుస నిరసనలు తార స్థాయికి చేరడం, ఇందులో వివిధ రకాల రాజకీయ పార్టీలు కావడంతో ఈ వివాదం కాస్త చినికి చినికి గాలి వాన లాగా మారింది. దీంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపుతప్పింది. పార్లమెంట్లోనూ ఈ ఈ విషయంపై విపక్ష పార్టీలు చర్చకు పట్టు పట్టడంతో అధికార భారతీయ జనతా పార్టీ తలదించుకోవాల్సి వచ్చింది. ఇక దీనికి తోడు భారతీయ రెజ్లర్లు వరుస నిరసనల కారణంగా ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాలేదు. మరోవైపు బ్రిజ్ భూషణ్ తాను దేనికైనా సిద్ధమే అని వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా రెజ్లర్లు వెనక్కి తగ్గారు. దీంతో ఆ వివాదం కాస్త సద్దుమణిగింది.

తాజాగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను యునైటెడ్ వరల్డ్ సస్పెండ్ చేయడంతో రాబోయే ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లలో భారత రెజ్లర్లు పోటీ పడలేరు. దీంతో తటస్థ రెగ్యులర్గా వాళ్ళు పోటీకి దిగాల్సి ఉంటుంది. సెప్టెంబర్ మూడో వారం నుంచి ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు జరగాల్సి ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ లో 45 రోజుల్లో ఎన్నికలు నిర్వహించేలాగా భారత ఒలంపిక్ సంఘం తాత్కాలిక ప్యానెల్ నియమించినట్లు తెలుస్తోంది. అడ్ హాక్ కమిటీ గడువులోగా ఎన్నికలు నిర్వహించలేని పక్షంలో చర్యలు తీసుకుంటామని అప్పట్లోనే యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ హెచ్చరించినప్పటికీ పట్టించుకోలేదు. ఈ మేరకు గడువులోగా ఎన్నికలు నిర్వహించని కారణంగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పై సస్పెన్షన్ విధిస్తున్నట్టు బుధవారం రాత్రి అడ్ హాక్ కమిటీకి సమాచారం ఇచ్చినట్టు భారత ఒలంపిక్ వెల్లడించింది. ఇక భారత రెజ్లింగ్ సమాఖ్యలో చోటు చేసుకున్న పరిణామాల కారణంగా ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో జరగాల్సిన ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ _2023 ను కజకిస్తాన్లోని ఆస్తానా కు మార్చారు. మే నెలలో భారతీయ రెజ్లర్లు మానవహారం పేరుతో నిరసన తెలపడం, భారత రెజ్లింగ్ సమాఖ్యకు చెందిన అధికారులను నిర్బంధించడాన్ని యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ తప్పు పట్టింది.