2025 India Sports Journey: మరికొద్ది రోజుల్లో 2025 కాలగర్భంలో కలిసిపోనుంది. 2026 ప్రారంభం కానుంది. సాధారణంగా ఒక ఏడాది ముగింపు దశలో ఉన్నప్పుడు.. కచ్చితంగా ఆ ఏడాదిలో జరిగిన విషయాలను నెమరు వేసుకోవడం సర్వసాధారణం. ఈ నేపథ్యంలోనే 2025 లో భారత క్రీడారంగం ఎలాంటి వృద్ధిని సాధించింది.. ఏ స్థాయిలో ప్రపంచ యవనిక మీద మెరిసింది.. అనే విషయాలను ఒకసారి మననం చేసుకుంటే..
ఇంద్ర గాంధీ ఇండోర్ స్టేడియం న్యూఢిల్లీ వేదికగా జరిగిన తొలి ఖో ఖో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో నేపాల్ పై భారత్ 54-36 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రీడలో భారత జట్టుకు ఇది తొలి ప్రపంచ కప్.
పురుషుల మాదిరిగానే స్త్రీలు కూడా నేపాల్ జట్టును ఓడించి ప్రపంచ కప్ సొంతం చేసుకున్నారు. ఈ మ్యాచ్ కూడా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగింది.
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025లో భారత్ విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో 76 పరుగులు చేసి.. టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సిరీస్ లో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా విజేతగా నిలిచింది.
బ్యాడ్మింటన్ ఆసియా మిక్స్ డ్ టీం ఛాంపియన్ షిప్ లో భారత్ ఓటమిపాలైంది. చైనాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో తలపడి రన్నర్ అప్ గా నిలిచింది.
ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ 2025లో భారత్ విజేతగా నిలిచింది. న్యూఢిల్లీలో జరిగిన సింగిల్స్, డబుల్స్ లో భారత ప్లేయర్లు సత్తా చూపించారు.
డేవిస్ కప్ లో స్విట్జర్లాండ్ జట్టును 3-1 తేడాతో ఓడించి భారత్ ట్రోఫీ సొంతం చేసుకుంది.
సుదీర్ మాన్ కప్ లో భాగంగా నిర్వహించిన బ్యాడ్మింటన్ పోటీలలో భారత్ సత్తా చూపించలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా ప్లేయర్లు పాల్గొన్న ఈ టోర్నీలో భారత్ తొమ్మిదవ స్థానంలో నిలిచింది.
ఆర్చరీ ఛాంపియన్ షిప్ లో భారత్ మూడు మెడల్స్ అందుకుంది. పురుషుల కాంపౌండ్ ఆర్చరీలో రిషబ్ యాదవ్ కాంస్యం సాధించాడు. ఇది ఆర్చరీ విభాగంలో భారతదేశం తరఫున అత్యుత్తమ ప్రదర్శన.
వరల్డ్ ఆర్చరీ యూత్ ఛాంపియన్ షిప్ పోటీలో భారత్ ఎనిమిది మెడల్స్ అందుకుంది. ఇందులో నాలుగు స్వర్ణం.. రెండు రజతం, రెండు కాంస్య పతకాలు ఉన్నాయి. మొత్తంగా ఈ టోర్నీలో మెడల్స్ పరంగా భారత్ మూడవ స్థానంలో నిలిచింది.
పురుషుల హాకీ ఆసియా కప్ లో డిపెండింగ్ ఛాంపియన్ దక్షిణ కొరియాను భారత్ ఓడించి ట్రోఫీని అందుకుంది. తద్వారా 2026 హాకీ ప్రపంచ కప్ పోటీలకు భారత్ క్వాలిఫై అయింది.
జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ క్వార్టర్ ఫైనల్ చేరింది. కానీ, టైటిల్ మాత్రం అందుకోలేకపోయింది. జపాన్ చేతిలో టీమ్ ఇండియా ఓటమిపాలైంది.
ఇండియా ఓపెన్ గోల్ఫ్ టోర్నీలో భారత్ ఆతిథ్యం ఇచ్చినప్పటికీ.. విజేతగా మాత్రం నిలువలేకపోయింది.
చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇచ్చినప్పటికీ.. మన ప్లేయర్లు ఆశించిన స్థాయిలో సత్తా చూపించలేకపోయారు.
ఢిల్లీ ఓపెన్ టెన్నిస్ లో కూడా భారత ప్లేయర్లు అంచనాలకు మించి ఆకట్టుకోలేకపోయారు. భారత్ ఆతిథ్యం ఇవ్వడం ద్వారా ఢిల్లీ ఓపెన్ గురించి ప్రపంచానికి మరోసారి తెలిసింది.
ఇండియా ఓపెన్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ లో అంతర్జాతీయ, భారత అథ్లెట్ లు పాల్గొన్నారు. కాకపోతే అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయారు.
సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీ నవంబర్ 25 నుంచి 30 వరకు లక్నోలో జరిగింది. ఈ టోర్నీలో భారత్ ప్లేయర్లు ఆకట్టుకున్నారు.
ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ షూటింగ్ సీజన్ లో భారత షూటర్లు ఆరు మెడల్స్ అందుకున్నారు. ఇందులో రెండు స్వర్ణం, మూడు రజతం, ఒక కాంస్య పతకం ఉన్నాయి.
ఆసియా షూటింగ్ ఛాంపియన్ షిప్ లో భారత ప్లేయర్ల బృందం స్వర్ణ పతకం గెలుచుకుంది.
స్కాష్ ప్రపంచ కప్ లో భారత్ చైనాను ఓడించి విజేతగా నిలిచింది. భారత్ తొలిసారిగా ఈ ప్రపంచకప్ అందుకుంది.
ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ను భారత జట్టు సొంతం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టుపై 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా టీమిండియా తొలి మహిళల వరల్డ్ కప్ అందుకొని రికార్డు సృష్టించింది.
సెంట్రల్ ఆసియా ఫుట్ బాల్ నేషన్స్ కప్ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో తజకిస్తాన్ జట్టును ఓడించి రికార్డు సృష్టించింది.
ఎస్ఏఎఫ్ఎఫ్ అండర్ 17 ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ లో భారత జట్టు ఫైనల్ మ్యాచ్ తో బంగ్లాదేశ్ లో ఓడించింది. తద్వారా విజేతగా నిలిచింది.
ఆస్ట్రేలియాతో జరిగిన స్నేహపూర్వక హాకీ సిరీస్ లో భారత్ ఓటమిపాలైంది. నాలుగు మ్యాచ్ ల ఈ సిరీస్ లో భారత్ మూడు ఓడిపోయింది. ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది.
ఇక ఇవే కాకుండా ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టును ఓడించి సరికొత్త రికార్డు సృష్టించింది.
వన్డేలు, టి20ల పరంగా టీమ్ ఇండియాకు తిరుగు లేకపోయినప్పటికీ.. టెస్టులలో మాత్రం టీం ఇండియా దారుణంగా ఆడుతోంది. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోల్పోయిన టీమ్ ఇండియా.. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ ను సమం చేసుకుంది. ఆ తర్వాత వెస్టిండీస్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా తో జరిగిన టెస్ట్ సిరీస్ లో వైట్ వాష్ కు గురైంది. తద్వారా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ రేటింగ్స్ లో ఆరవ స్థానంలో కొనసాగుతోంది. పాకిస్తాన్ కంటే కూడా భారత్ దిగువ స్థానంలో ఉండడం అభిమానులకు ఏమాత్రం మింగుడు పడటం లేదు.