T20 World Cup 2024: ఇండియా పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని కూడా ఆసక్తిగా ఆ మ్యాచ్ ని చూస్తాడు ఎందుకంటే ఈ రెండు టీములు చిరకాల ప్రత్యర్థులుగా ప్రతిసారి బరిలోకి దిగుతూ ఉంటాయి. ఇక అందులో చాలా సార్లు ఇండియానే పాకిస్తాన్ మీద అధిపత్యాన్ని చెలాయిస్తూ వస్తుంది. ఇక రీసెంట్ గా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో కూడా ఇండియా తన సత్తాను చాటుకుంది…
ఇక వచ్చే సంవత్సరం జూన్ లో అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా టి 20 వరల్డ్ కప్ కి అతిధ్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే టి20 వరల్డ్ కప్ కోసం ప్రతి టీం కూడా తమదైన రీతిలో కసరత్తులు చేస్తుంది. ఇక ఇప్పటికే ఈ టోర్నీ లో కూడా ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ హైలైట్ గా నిలువబోతుంది. ఇక ఇప్పటికే వన్డే వరల్డ్ కప్ లో ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య ఒక హోరాహోరీ మ్యాచ్ అయితే జరిగింది. ఇక ఇప్పుడు టి20 వరల్డ్ కప్ లో కూడా ఈ జట్ల మధ్య మ్యాచ్ చూడటానికి చాలా మంది క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ కి వేదికని ఎక్కడ డిసైడ్ చేయాలి అనే విధంగా ఐసిసి నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇండియా పాకిస్తాన్ కి సంబంధించిన గ్రూప్ లెవెల్ మ్యాచ్ ని న్యూయార్క్ లో నిర్వహించే విధంగా ఐసిసి ప్లానింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. న్యూయార్క్ లో ఉన్న ఈ స్టేడియం యొక్క కెపాసిటీ 34,000 అయితే న్యూయార్క్ లో సెటిల్ అయిన భారతీయ సంతతికి చెందిన జనాభా 7 లక్షల పైనే ఉంటుంది. అలాగే పాకిస్తాన్ జనాభా లక్ష దాకా ఉంటుంది ఇలాంటి క్రమంలో ఆ మ్యాచ్ అక్కడ నిర్వహిస్తే మాత్రం జనాలు విపరీతంగా ఈ మ్యాచ్ ను చూడడానికి ఆసక్తి చూపిస్తారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ని కరేబియన్ దీవుల్లోని బార్బడోస్ లో నిర్వహించనున్నట్టుగా తెలుస్తుంది.
అయితే టి20 వరల్డ్ కప్ కోసం 20 జట్లు బరిలోకి దిగుతున్నాయి వాటిని 4 గ్రూపులుగా విడగొట్టి ఒక్కో గ్రూపులో 5 టీం లను వేసి ఆడించి అందులో నుంచి టాప్ 2 లో ఉన్న టీమ్ లతో సూపర్ 8 నిర్వహించి అందులో టాప్ లో ఉన్న నాలుగు టీం లను సెమీస్ కి క్వాలిఫై చేసే విధంగా ఐసీసీ ప్రణాళికలు రూపొందిస్తుంది. అయితే ఒకే గ్రూపులో ఇండియా పాకిస్తాన్ టీంలు ఉండే విధంగా ప్రణాళికలైతే రూపొందించారు. ఎందుకంటే ఈ మ్యాచ్ కి ఉన్నంత క్రేజ్ గాని ఈ మ్యాచ్ వల్ల ఐసీసీ కి జరిగే బిజినెస్ గానీ మరే మ్యాచ్ కి జరగదు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశక్తి లేదు కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఐసీసీ ఈ రెండు టీం లను ఒకే గ్రూపులో వేసినట్టుగా తెలుస్తుంది…