https://oktelugu.com/

snakes : పాములు రైతులకు నేస్తాలు అంటారు ఎందుకు? పుట్టలో పాలు పోయడానికి కారణం ఏంటీ?

పాములు రైతులకు నేస్తాలు అని అంటారు. అందుకే రైతులు ఎంతో దట్టమైన అడవిలో పనిచేసినా కొందరిని కుట్టకుండా వదిలేస్తాయని చెబుతూ ఉంటారు. అయితే తమకు హాని చేసేవారిని పాములు పగబట్టి మరీ చంపుతాయని అంటారు. కొన్ని జీవులు మనుషులు కనిపిస్తే వెంటనే దాడి చేస్తాయి. కానీ పాములు మాత్రం ఆత్మ రక్షణలో పడితేనే కాటేస్తాయనేది వాస్తవం.

Written By:
  • Srinivas
  • , Updated On : August 9, 2024 10:23 am
    Follow us on

    snakes : పాములు అనగానే చాలా మంది భయపడిపోతుంటారు. అవి ఎక్కడ దాడి చేస్తాయోనని కొందరు వాటిని చంపుతూ ఉంటారు. తమపై ఎవరు దాడి చేస్తారోనని అవి మనుషులను కాటేస్తూ ఉంటాయి. అయినా పాములు, మనుషుల మధ్య దైవానుబంధం ఉంది. అందుకే ప్రతీ ఏడాది నాగుల పంచమి, నాగుల చవితి రోజున పాములను పూజిస్తుంటారు. పాములకు పూజ చేసే సంప్రదాయం భారతదేశంలో ఉంది. వీటిలో శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి రోజు నాగదేవతకు పూజలు చేయడం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. సంతానం కోరుకునేవారు, కాల సర్పదోషం తొలగిపోవాలనుకునేవారు నాగుల పంచమి రోజు పాములకు పాలు పోస్తుంటారు. అలాగే తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. అంతకుముందు మహిళలు సమీపంలోని పాముల పుట్ట వద్దకు వెళ్లి పుట్టలో పాలు పోస్తుంటారు. అయితే పాముల పుట్టలో పాలు పోయొద్దని, ఇలా చేయడం వల్ల పాములు ఇబ్బందులు ఎదుర్కొంటాయని అంటారు. అయినా కొందరు నాగదేవతపై ఉన్న భక్తితో నేరుగా పాముకు అభిషేకం చేయాలని పుట్టలో పాలు పోస్తుంటారు. ఆ తరువాత రోజంతా ఉపవాసం ఉండి నాగదేవత చరిత్ర వింటారు. ఈ సారి నాగుల పంచమి శుక్రవారం రావడంతో మహిళలు శ్రావణ మాస మొదటి శుక్రవారంతో పాటు నాగుల పంచమి వేడుకలు నిర్వహించుకుంటున్నారు. సాధారణంగా పామును చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. కానీ పాములు మనుషులకు ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా రైతులను ఇవి కాపాడుతాయంటే ఎవరూ నమ్మరు.. అది ఎలాగో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ స్టోరీ చదవండి..

    పాములు రైతులకు నేస్తాలు అని అంటారు. అందుకే రైతులు ఎంతో దట్టమైన అడవిలో పనిచేసినా కొందరిని కుట్టకుండా వదిలేస్తాయని చెబుతూ ఉంటారు. అయితే తమకు హాని చేసేవారిని పాములు పగబట్టి మరీ చంపుతాయని అంటారు. కొన్ని జీవులు మనుషులు కనిపిస్తే వెంటనే దాడి చేస్తాయి. కానీ పాములు మాత్రం ఆత్మ రక్షణలో పడితేనే కాటేస్తాయనేది వాస్తవం. అందువల్ల పామును అకారణంగా చంపకూడదని కొందరు పెద్దలు చెబుతూ ఉంటారు. రైతులకు పొలాల్లో ఎన్నోసార్లు పాములు కనిపిస్తూ ఉంటాయి. కానీ చాలా మంది రైతులు వాటి జోలికి వెళ్లకుండా ఉంటారు.

    పాములు కూడా రైతులకు మేలు చేస్తాయి. రైతులు ఎంతో శ్రమించి పంటలు పండిస్తారు. ముఖ్యంగా వరిపంట సమయంలో నీరు ఆగేందుకు మడులు ఏర్పాటు చేస్తుంటారు. కానీ ఎలుకలు, కొన్ని క్షీరదాలు వీటిని చెడగొడుతాయి. ఎలుకలు పొలం గెట్లకు రంధ్రాలు చేస్తుంటాయి. దీంతో నీరు ఆగకుండా వెళ్లిపోతుంది. కొన్ని క్షీరదాలు పంటలను నాశనం చేస్తాయి.అయితే వీటిని పాములు తింటూ ఉంటాయి. పొలాల్లో పాములు ఉంటే ఆ పంటకు రక్షణ ఉన్నట్లేనని కొందరి భావన. అయితే అన్నీ పాములు నేస్తాలు కాకపోవచ్చు. ముఖ్యంగా విష సర్పాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వాటికి దూరంగా ఉండడమే మంచిది. లేకుంటే ప్రాణాలకే ప్రమాదం..

    తమ పంటలను రక్షించాలని పాములను రైతులు వేడుకుంటారని చెబుతారు. అందుకే పాముకు ఇష్టమైన పాలను పోస్తుంటారు. అయితే కొందరు జంతు శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం పాములకు పాలు సమర్పించాలనుకునేవారు పుట్టలో పోయకుండా ఒక పాత్రలో పోసి దానిని పుట్ట వద్ద ఉంచాలని చెబుతున్నారు. పుట్టలో పాలు పోయడం వల్ల పాములు అసౌకర్యాన్ని ఎదుర్కొంటాయని చెబుతున్నారు. ఇక ఈ ఏడాది నాగుల పంచమి సందర్భంగా శుక్రవారం వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. పుట్టల వద్ద ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. అలాగే శివాలయాల్లోని నాగదేవత విగ్రహాలకు అభిషేకం నిర్వహిస్తున్నారు. తమకోరికలను నెరవేర్చాలని వేడుకుంటున్నారు.