Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్టోబర్ 19 గురువారం కొన్ని రాశుల వారికి ధన లాభం కలిగే అవకాశం ఉంది. మరికొందరు ఇతరులతో మాట్లాడకపోయినా మాటలు పడాల్సి వస్తుంది. 12 రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
కుటుంబ సభ్యుల మధ్య చికాకులు ఏర్పడవచ్చు. బ్యాంకు లావాదేవీలతో జాగ్రత్తగా ఉండాలి. మంచి ప్రవర్తన ద్వారా పనులు ఈజీ గా పూర్తి చేయగలుగుతారు. కొన్ని పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. అనవసర వాదనలు దిగొద్దు.
వృషభం:
ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కొన్ని అక్రమాల ద్వారా డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ తెలివిగా వాటిని నివారిస్తే సమస్యలు రాకుండా ఉంటాయి. కొన్ని పనులు వాయిదా పడుతూ ఉంటాయి.
మిథునం:
ఈ రాశివారికి ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఎవరిని నొప్పించక పోయినా మాటలు పడాల్సి వస్తుంది. దూకుడు స్వభావం తగ్గించుకుంటే మంచిది. కష్టపడి పనిచేసినా ఫలితం రాకపోయేసరికి నిరాశ ఉంటుంది.
కర్కాటకం:
కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి. లాభం కోసం ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువ.
సింహం:
ఇంట్లో వస్తువులను కొనుగోలు చేస్తారు. కొన్ని విషయాల్లో ధన లాభం పొందే అవకాశం ఉంది. ఉద్యోగవర్గానికి చెందిన వారు కొన్ని సమస్యలో చిక్కుకుంటారు. ఆశించిన స్థాయిలో విజయాలు ఉండకపోవచ్చు.
కన్య:
కొత్త వివాదాలు ఏర్పడుతాయి. ఇతరులతో మాట్లాడే ముందు ఆచితూచి వ్యవహరించాలి. ధనలాభం ఉన్నా.. అదే స్థాయిలో ఖర్చులు ఉంటాయి. అనవసర విషయాల జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిది.
తుల:
ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా వృద్ధి సాధిస్తారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇదే సమయంలో చెడు ధోరణులు కూడా పెరుగుతాయి. ఎవరి సహాయం లేకుండా పనులు పూర్తి చేస్తారు.
వృశ్చికం:
ఒక సమాచారం నిరాశ ను కలిగిస్తుంది. ఆర్థిక ప్రయోజనాలు పొందడం కష్టంగా ఉంటుంది. అనారోగ్యం కారణంగా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులకు కార్యాలయాల్లో అసౌకర్యంగా ఉంటారు.
ధనస్సు:
కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పెండింగ్ పనుల్లో చలనం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఉల్లాసంగా ఉండగలుగుతారు.
మకరం:
గతంలో మొదలు పెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అధిక పనిభారంతో కనిపిస్తారు. కొన్ని పనులు సాధించినా విజయం దక్కకపోవచ్చు. ఇంట్లో వాతావరణం చికాకుగా ఉంటుంది.
కుంభం:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలను నడిపేందుకు అనువైన సమయం. కుటుంబంలోనూ ఆప్యాయత పెరుగుతుంది. ఆర్థికంగా స్వల్ప ప్రయోజనాలే ఉంటాయి.
మీనం:
పై అధికారుల సహకారం ఉంటుంది. మనసు ఉల్లాసంగా మారుతుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఖర్చులు పెరిగే అవకాశం.