Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవంబర్ 21న మంగళవారం ద్వాదశ రాశులపై శతభిషా నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో వృషభం, మిథునం రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉండనున్నాయి.12 రాశుల వివరాలు ఎలా ఉన్నాయంటే?
మేషరాశి:
కార్యాలయాల్లో ఉన్నతాధికారులతో వాదనలకు దిగొద్దు. స్నేహితులతో ప్రయాణాలు ఉంటాయి. ప్రియమైన వారితో ఉల్లాసంగా ఉంటారు. ఈరోజు కొత్త శక్తి ఉంటుంది.
వృషభం:
ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూల సమయం. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు అనుకూల సమయం. కొత్త ప్రణాళికలు వేస్తారు.
మిథునం:
వైవాహిక జీవితంలో గొడవలు ఉంటాయి. ప్రియమైన వారితో సంయమనం పాటించడి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. కొత్త ఉద్యోగాల కోసం చూసేవారికి అనుకూల సమయం.
కర్కాటకం:
వ్యాపారంలో పెట్టుబడి పెట్టేవారికి అనుకూల సమయం. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ఎవరైనా విమర్శలు చేస్తే పట్టించుకోవద్దు. అనవసర వాదనలకు దిగొద్దు.
సింహం:
ఉద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారులు విజయం సాధించడానికి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
కన్య:
కొత్త పనులు చేపట్టేవారికి అనుకూల సమయం. ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఏదైనా పని పూర్తి కావాలంటే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది.
తుల:
కొన్ని సమస్యలపై ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది. సాయంత్రం పర్యటనకు వెళ్లే అవకాశం ఉంటుంది. పనిచేసే వ్యక్తులు జీతం గరించి ఆలోచిస్తారు.
వృశ్చికం:
అధికారులతో ఆహ్లదమైన వాతావరణం ఉంటుంది. సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. కొత్త పనులు చేపట్టేవారికి అనుకూలమైన సమయం.
ధనస్సు:
ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతో సరదాగా గడుపుతారు.
మకరం:
విదేశీ ప్రయాణాలకు ప్లాన్ వేదస్తారు. జీవిత భాగస్వామితో కలిసా షాపింగ్ చేయొచ్చు. బంధువులకు డబ్బు సాయం చేస్తారు. తల్లిదండ్రులతో విభేదాలుంటే మౌనంగా ఉండాలి.
కుంభం:
భాగస్వామితో ఉల్లాంగా గడుపుతారు. విధుల విషయంలో సందేహాలుంటే కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవచ్చు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి.
మీనం:
పిల్లల విషయంలో సమస్యలు ఉంటే పరిష్కారం కనుగొంటారు. వాతావరణంలో మార్పు కారణంగా ఆరోగ్యంలో సమస్యలు వచ్చే అవకాశం. ఆందోళన చెందకుండా సమస్య పరిష్కారం గురించి ఆలోచించాలి.