https://oktelugu.com/

Today horoscope in telugu : లక్ష్మీనారాయణ రాజయోగం.. ఈ రాశులకు ఈరోజు వరం..

Today horoscope in telugu : నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయి. ఉద్యోగులు తోటి వారితో సంయమనం పాటిస్తారు. అధికారుల నుంచి మద్దతు ఉండడంతో ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేస్తారు. భవిష్యత్తు కోసం వ్యాపారులు కొత్త ప్లాన్ చేస్తారు.

Written By: , Updated On : March 21, 2025 / 08:28 AM IST
Today Horoscope In Telugu

Today Horoscope In Telugu

Follow us on

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం శుక్రవారం ద్వాదశరాసులపై జిఎస్టి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజు లక్ష్మీనారాయణ రాజయోగం ఉండడంతో కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉండలున్నాయి. మరికొన్ని రాశుల వారు ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి అర్హులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి. సమాజంలో గుర్తింపు వస్తుంది. అనుకోకుండా ప్రయాణాలు చేస్తారు. విదేశాలనుంచి సమాచారాన్ని పొందుతారు. కుటుంబ సభ్యుల అండతో వ్యాపారాలు కొత్త పెట్టుబడులు పెడతారు. గతంలో ఉన్న సమస్యలు నీటితో పరిష్కారం అవుతాయి. ఆస్తికి సంబంధించిన ఒప్పందాలను చేసుకుంటారు. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడమే మంచిది. అవసరపు వివాదాల్లో తల దూర్చొద్దు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వ్యాపారాలు ఈరోజు మాటలను అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే వివాదాలు ఎదురవుతాయి. ఉద్యోగులు తోటి వారితో సంయమనం పాటించాలి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. లేకుంటే తీవ్ర నష్టాలు ఎదుర్కొంటారు. మానసికంగా ఆందోళనతో ఉంటారు. దీని పరిష్కారానికి కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉండాలి. కొన్ని పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయడానికి కృషి చేస్తారు.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కొన్ని పెట్టుబడులు పెట్టడం వల్ల భవిష్యత్తులో వీడియో నుంచి అధిక లాభాలు పొందుతారు.పిల్లల కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. విదేశాల్లో ఉండే వారి నుంచి శుభవార్తలు ఉంటారు. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నట్లయితే బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది. స్నేహితులతో విహారయాత్రలకు వెళ్తారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యుల సహాయంతో కొత్త పెట్టుబడును పెడతారు. ఇంటికి దూరంగా పనిచేసేవారు కొన్ని మానసిక సమస్యలను ఎదుర్కొనే అవకాశం. మాటలను అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారాలు కొత్త ఒప్పందాలకు దూరంగా ఉండాలి. ఏదైనా వివాదం ఎదురైతే వెంటనే పరిష్కరించుకోవాలి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : సింహరాశి వారు ఈరోజు ఉల్లాసంగా ఉంటారు. ప్రియమైన వారితో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. ఇప్పటివరకు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగులకు తోటి వారి అండ ఉంటుంది. అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. వ్యాపారానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. కొత్తగా ఎటువంటి పెట్టుబడి పెట్టిన భవిష్యత్తులో లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార పనుల కోసం ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. కొత్తగా పెట్టుబడి పెట్టేవారు పెద్దల సలహా తీసుకోవాలి. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసే వారికి అధిక లాభాలు ఉంటాయి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉండే అవకాశం. అందువల్ల మాటల మాధుర్యాన్ని కొనసాగించాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి. వ్యాపారంలో ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వెంటనే పరిష్కరించుకోవాలి. లేకుంటే తీవ్ర నష్టాలను ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం ఏర్పడితే మౌనంగా ఉండడమే మంచిది. కొందరు కొత్త వ్యక్తులు తప్పుడు మార్గాన్ని సూచించే అవకాశం ఉంది. అందువల్ల ఎవరి మాటలు నమ్మకుండా సొంత నిర్ణయాలు తీసుకోవాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వ్యాపారాలకు ఈరోజు ఆశించిన లాభాలు వచ్చే అవకాశాలు తక్కువ. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశం. సమాజంలో గుర్తింపు వస్తుంది. నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయి. ఉద్యోగులు తోటి వారితో సంయమనం పాటిస్తారు. అధికారుల నుంచి మద్దతు ఉండడంతో ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేస్తారు. భవిష్యత్తు కోసం వ్యాపారులు కొత్త ప్లాన్ చేస్తారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : నిరాశ వ్యాపారంలో ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు ఉంటారు. ఉద్యోగులుతం లేదా పదవ తరగతిని ముందే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఇంట్లో జరిగే శుభకార్యాల కోసం చర్చిస్తారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అధిక లాభాలు పొందుతారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి విద్యార్థులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. జీవిత భాగస్వామితో ప్రయాణాలు చేస్తారు. పిల్లల కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. ఏదైనా సమస్య వస్తే వాటిని వెంటనే పరిష్కరించుకుంటారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. ఉద్యోగులు లోపాలను సరి చేసుకోవాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబంతో ఉల్లాసంగా ఉంటారు. కొన్ని పనుల వల్ల సమాజంలో గుర్తింపు వస్తుంది. ఆస్తి ఒప్పందం విషయంలో శుభవార్తను వింటారు. జీవిత భాగస్వామితో వ్యాపారాలు చేసేవారు అధిక లాభాలు పొందుతారు. సాయంత్రం స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య వివాదం ఏర్పడితే వెంటనే పరిష్కరించుకోవాలి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు జీవిత భాగస్వామితో కలిసి ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులకు ఊహించని లాభాలు వస్తాయి. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. అధికంగా ఖర్చులు పెరిగే అవకాశం. అందువల్ల ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్ చేస్తారు. అయితే ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.